తొలి ఓటరుకు సన్మానం | first voter felicitated in warangal polls | Sakshi
Sakshi News home page

తొలి ఓటరుకు సన్మానం

Published Sat, Nov 21 2015 8:39 AM | Last Updated on Mon, Oct 1 2018 6:25 PM

తొలి ఓటరుకు సన్మానం - Sakshi

తొలి ఓటరుకు సన్మానం

వరంగల్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో తొలి ఓటరుకు సన్మానం చేశారు. కలెక్టర్ కరుణ, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఓటరకు పూలతో స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో  మొదట ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు అధికారులు పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సిబ్బంది వెంటనే సరిచేయడంతో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల విశేషాలు..

  • వడ్డేపల్లిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు
  • తమ గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ తొర్రురు మండలం టీక్యాతండా గిరిజనులు పోలింగ్ను బహిష్కరించారు.
  • భూపాలపల్లి 17వ బూత్ పోలింగ్ కేంద్రం, ధర్మసాగర్ మండలం జానకీపురం, వర్ధన్నపేట మండలం వట్యాలలో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు వెంటనే సరిచేసి పోలింగ్ కొనసాగిస్తున్నారు.
  • వరంగల్ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
  • లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 1778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • దాదాపు 10 వేల మందికిపైగా భద్రత సిబ్బందిని వినియోగించారు.
  • తొలిసారిగా ఈవీఎంలపై పార్టీ గుర్తులతోపాటు అభ్యర్థుల ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
  • ఈ ఉప ఎన్నికల్లో  దాదాపు 15 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
  • ఈ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement