warangal by polls
-
'టీఆర్ఎస్ నేతలు ఓటర్లను బెదిరించారు'
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ నేతలు ఓటర్లను బెదిరించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పింఛన్లు, రుణమాఫీ ఆగిపోతాయని బ్లాక్మెయిల్ చేశారని చెప్పారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బుధవారం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంటింటికి నీళ్లు అందించి ఓట్లు అడుగుతామంటున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎన్నికల హామీలు అమలు చేశాకే ఓట్లు అడుగుతామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయం పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్పారు. -
టీఆర్ఎస్ ఖాతాలోకి కాంగ్రెస్, బీజేపీ ఓట్లు
(సాక్షి వెబ్ ప్రత్యేకం) వరంగల్ లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయా? టీఆర్ఎస్ తన ఓటు బ్యాంకును యథాతథంగా కాపాడుకోవడంతో పాటు ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఓట్లలోంచి కొన్నింటిని కూడా తన ఖాతాలోకి మళ్లించుకోవడం ద్వారా రికార్డు స్థాయి మెజారిటీని సాధించుకోగలిగింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లను, ప్రస్తుత ఉపఎన్నికల్లో వచ్చిన ఓట్ల సరళిని విశ్లేషిస్తే కాంగ్రెస్, బీజేపీల ఓట్లకు ఈసారి గండిపడినట్లు స్పష్టంగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్ల కంటే ఈసారి ఆ పార్టీ అభ్యర్థికి 7.9 శాతం ఓట్లు తగ్గాయి. అలాగే బీజేపీకి పోలైన ఓట్లు కూడా 3.4 శాతం తగ్గాయి. ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం.. ఈసారి ఓట్లు గణనీయంగా పెరిగాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఓట్లను అటు టీఆర్ఎస్తో పాటు స్వతంత్రులు సైతం చీల్చుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ 2014 మే ఎన్నికలు 2015 నవంబర్ ఉప ఎన్నికలు తేడా టీఆర్ఎస్ 56.2 58.9 +2.7 కాంగ్రెస్ 22.9 15.0 -7.9 బీజేపీ 15.9 12.5 -3.4 ఇతరులు 5.0 13.7 +8.7 2014 సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానంలో 76 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి అది 69 శాతానికి తగ్గింది. అయినా టీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్కు 56.2 శాతం ఓట్లు రాగా ఈసారి 58.9 శాతం ఓట్లు వచ్చాయి. అంటే, ఆ పార్టీకి 2.7 శాతం ఓట్లు పెరిగాయన్నమాట. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో 22.9 శాతం ఓట్లు పోలవగా, ఈసారి అది 15 శాతానికి పడిపోయింది. అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించుకున్న ఓట్లలో ఆ పార్టీకి ఈసారి 7.9 శాతం గండిపడింది. బీజేపీ పరిస్థితి కూడా అంతే. గత ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీ చేసిన బీజేపీకి 15.9 శాతం ఓట్లు రాగా ఈసారి ఆ పార్టీ 12.5 శాతానికి పడిపోయింది. అంటే.. ఈ ఎన్నికలో 3.4 శాతం ఓట్లను బీజేపీ కోల్పోయింది. విచిత్రమేమంటే గతంలో మిగలిన పక్షాలు, స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి కేవలం 5 శాతం మాత్రమే ఓట్లు రాగా ఈసారి ఏకంగా 13.7 శాతం ఓట్లను సాధించుకున్నాయి. తాజా ఎన్నికల ఫలితాలను, 2014లో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్ల సరళిని విశ్లేషించిన పీపుల్స్ పల్స్ సంస్థ ఓట్లను సాధించుకోవడంలో ఏ పార్టీ ప్రయోజనం పొందింది.. ఏ పార్టీ నష్టపోయిందన్న వివరాలను వెల్లడించింది. -
డబ్బిచ్చి, బతిమాలితే వచ్చిన ఓట్లు కావివి: కేసీఆర్
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ప్రజలు తమ పాలనపై విశ్వాసం ఉంచి, అభిమానంతో భారీ విజయం అందించారని టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. వరంగల్ ఎన్నికలో డబ్బులు ఇచ్చి తాము ఓట్లు కొనుగోలు చేయలేదని, ఓట్లు వేయాలని బతిమాలలేదని, ప్రజలు మాపై నమ్మకంతో ఓట్లు వేశారని కేసీఆర్ అన్నారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు మెజార్టీతో విజయం సాధించిన అనంతరం మంగళవారం సాయంత్రం.. కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారంటే.. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక విజయం చరిత్రాత్మకం మా గురించి విపక్షాలు చాలా నీచంగా ప్రచారం చేశాయి. ప్రజలు విపక్షాలకు తగిన బుద్ధి చెప్పారు ప్రజలు అభిమానంతో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటేశారు వరంగల్ ఉప ఎన్నికలో 70 శాతం పోలింగ్ జరిగిందని పార్టీ శ్రేణులు చెప్పగానే.. ప్రజలకు మనపై నమ్మకం ఉంటే భారీ విజయం సాధిస్తామని, లేకుంటే అదే స్థాయిలో వ్యతిరేకత ఉంటుందని చెప్పాను వరంగల్ ప్రజలు వెల్లువలాంటి ఫలితాన్నిచ్చారు ప్రభుత్వ పథకాలపై ప్రజలు విశ్వాసం ఉంచారు ఈ విజయంతో మా బాధ్యత మరింత పెరిగింది తెలంగాణలో బ్రహ్మాండంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం రైతులకు సకాలంలో విత్తనాలను పంపిణీ చేస్తాం సంక్షేమంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయం సాధిస్తాం -
దేశంలో ఏడో అత్యధిక మెజార్టీ
-
దేశంలో ఏడో అత్యధిక మెజార్టీ
వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. దేశంలో ఇప్పటి వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన ఏడో వ్యక్తిగా ఘనతకెక్కారు. దయాకర్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 4,59,092 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన విజేతలు ప్రీతమ్ ముండే (బీజేపీ) మహారాష్ట్రలోని బీద్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే కుమార్తె ప్రీతమ్ ముండే 6.92 లక్షల ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. అనిల్ బసు (సీపీఎం) 2004లో పశ్చిమబెంగాల్లోని అరమ్గఢ్ నియోజకవర్గం నుంచి అనిల్ బసు 5.92 లక్షల మెజార్టీతో గెలుపొందారు. పీవీ నరసింహారావు (కాంగ్రెస్) 1991లో నంద్యాల నుంచి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు 5.80 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నరేంద్ర మోదీ (బీజేపీ) 2014 ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదర నుంచి నరేంద్ర మోదీ 5.7 లక్షల ఓట్ల మెజార్టీతో విజయబావుటా ఎగురవేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2011లో కడప లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 5.45 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాంవిలాస్ పాశ్వాన్ 1989లో ఉత్తరప్రదేశ్‌లోని హజీపూర్ నుంచి రాం విలాస్ పాశ్వాన్ (జనతా దళ్) 5.04 లక్షల మెజార్టీతో నెగ్గారు. పసునూరి దయాకర్ వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ 4.59 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. -
ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు రాలేదు
-
వరంగల్ ఎన్నికల విశేషాలు
-
వరంగల్ ఎన్నికల విశేషాలు
వరంగల్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు 46 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఎన్నికల ఏర్పాట్లను, ఈవీఎంల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న అధికారులను అప్రమత్తం చేసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో తొలి ఓటరుకు సన్మానం చేశారు. కలెక్టర్ కరుణ, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఓటరకు పూలతో స్వాగతం పలికారు. ఎన్నికల మరిన్ని విశేషాలు: వరంగల్ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 1778 పోలింగ్ కేంద్రాలలో 10 వేల మందికిపైగా భద్రత సిబ్బంది ఏర్పాటు తొలిసారిగా ఈవీఎంలపై పార్టీ గుర్తులతోపాటు అభ్యర్థుల ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మావోయిస్టుల కంచుకోట టేకులగూడెంలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు రఘునాథపురం మండలం కంచరపల్లిలో మొరాయించిన ఈవీఎంలు, కాసేపు నిలిచిపోయిన పోలింగ్ స్టేషన్ ఘనాపూర్ మండలం మల్కాపూర్ లో ఈవీఎం మొరాయింపు. ఫ్యాన్ గుర్తు బటన్ పనిచేయలేదంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఆందోళన తమ గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ తొర్రురు మండలం టీక్యాతండా గిరిజనులు పోలింగ్ బహిష్కరణ. తండా వాసులతో చర్చలు జరుపుతున్న ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు వడ్డేపల్లిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు పర్వతగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు సంగెలం మండలం బొల్లికుంటలో ఓటు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ -
తొలి ఓటరుకు సన్మానం
వరంగల్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో తొలి ఓటరుకు సన్మానం చేశారు. కలెక్టర్ కరుణ, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఓటరకు పూలతో స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో మొదట ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు అధికారులు పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సిబ్బంది వెంటనే సరిచేయడంతో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల విశేషాలు.. వడ్డేపల్లిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు తమ గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ తొర్రురు మండలం టీక్యాతండా గిరిజనులు పోలింగ్‌ను బహిష్కరించారు. భూపాలపల్లి 17వ బూత్ పోలింగ్ కేంద్రం, ధర్మసాగర్ మండలం జానకీపురం, వర్ధన్నపేట మండలం వట్యాలలో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు వెంటనే సరిచేసి పోలింగ్ కొనసాగిస్తున్నారు. వరంగల్ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 1778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల మందికిపైగా భద్రత సిబ్బందిని వినియోగించారు. తొలిసారిగా ఈవీఎంలపై పార్టీ గుర్తులతోపాటు అభ్యర్థుల ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ ఉప ఎన్నికల్లో దాదాపు 15 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది. -
ఎన్నికలో మంచి మెజార్టీతో గెలుస్తాం
-
పాలకుర్తిలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
-
పాలకుర్తిలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
వరంగల్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన వైఎస్ జగన్ వరంగల్ జిల్లా పాలకుర్తి చేరుకున్నారు. పాలకుర్తిలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తరలివచ్చి వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. పాలకుర్తిలో వైఎస్ జగన్ రోడ్డు షో నిర్వహించారు. భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. మూడు గంటల సమయానికి రోడ్డుమార్గాన జఫర్‌గఢ్ నుంచి వర్దన్నపేట మండలంలోకి ప్రవేశించారు. మండలంలోని దమ్మన్నపేట వద్దపొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీలతో మాట్లాడారు. పొలుగు హైమావతి అనే వ్యవసాయ కూలీతో మాట్లాడి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. మంచి రోజులు వస్తాయి.. అధైర్యపడవద్దని వైస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం రెడ్డిపాలెం గ్రామం వైపు వెళ్లారు. రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దాదాపు అరగంటపాటు ఆయన అక్కడే ఉండి వారితో మాట్లాడారు. వైఎస్ జగన్ వెంట తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరపున వైఎస్ జగన్ ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం తొర్రూరులో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్ జగన్ 4 రోజుల పాటు ప్రచారం చేస్తారు. -
వరంగల్ బయల్దేరిన వైఎస్ జగన్
-
వరంగల్ బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయల్దేరివెళ్లారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన వైఎస్ జగన్ వరంగల్ జిల్లాకు వెళతారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఈ రోజు సాయంత్రం తొర్రూరులో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్ జగన్ 4 రోజుల పాటు పర్యటించి.. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరపున ప్రచారం చేస్తారు. -
కడియం శ్రీహరికి ఎర్రబెల్లి సవాల్
వరంగల్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం.. విమర్శలు, సవాళ్లతో హోరెత్తుతోంది. టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి సవాల్ విసిరారు. ఇద్దరం కలసి పాలకుర్తిలో ఇండిపెండెంట్లుగా పోటీ చేద్దామని ఎర్రబెల్లి.. కడియంకు ప్రతిపాదించారు. పాలకుర్తిలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి సవాల్ చేశారు. నువ్వు ఓడిపోతే ఏం చేస్తావని కడియం శ్రీహరిని ప్రశ్నించారు. -
'కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోండి'
హైదరాబాద్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ తరపున శ్రీహరి ప్రచారం చేశారు. కడియం శ్రీహరి ఎన్నికల నిబంధలను ఉల్లంఘించి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రాంగణంలో ప్రచారం చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కడియంపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. -
కడియంపైకి చెప్పు విసిరిన రైతు
వరంగల్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ తరపున ప్రచారం చేసేందుకు శుక్రవారం శాయంపేటకు వచ్చిన కడియం శ్రీహరిపై ఓ రైతు చెప్పు విసిరాడు. పత్తికి గిట్టుబాటు ధర కల్పించలేదని రైతు కడియం శ్రీహరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసులు వెంటనే ఆ రైతును అదుపులోకి తీసుకున్నారు. -
నేడు వైఎస్ఆర్ సీపీ తెలంగాణ విస్తృతస్థాయి సమావేశం
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ నియోజక వర్గం ఉప ఎన్నికకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించనుంది. ఆదివారం మధ్నాహ్నం వైఎస్ఆర్ సీపీ తెలంగాణ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తామని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ చెప్పారు. -
వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్
-
వివేక్ లేదా సర్వేకు టికెట్
న్యూఢిల్లీ: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో చర్చిస్తున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఉత్తమ్ సమావేశమయ్యారు. వరంగల్ ఉప ఎన్నిక గురించి చర్చించారు. వరంగల్ అభ్యర్థిగా వివేక్, సర్వే సత్యనారాయణ పేర్లను కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. పోటీ చేయాల్సిందిగా వివేక్‌పై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. వివేక్ అంగీకరించకపోతే సర్వే సత్యనారాయణను బరిలో దింపాలని యోచిస్తున్నారు. -
వరంగల్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్
హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ 4. వచ్చే నెల 5న నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 7. నవంబర్ 21న పోలింగ్, 24న కౌంటింగ్ నిర్వహిస్తారు.