వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది.
న్యూఢిల్లీ: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఢిల్లీ వెళ్లిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో చర్చిస్తున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఉత్తమ్ సమావేశమయ్యారు. వరంగల్ ఉప ఎన్నిక గురించి చర్చించారు.
వరంగల్ అభ్యర్థిగా వివేక్, సర్వే సత్యనారాయణ పేర్లను కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారు. పోటీ చేయాల్సిందిగా వివేక్పై ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. వివేక్ అంగీకరించకపోతే సర్వే సత్యనారాయణను బరిలో దింపాలని యోచిస్తున్నారు.