
కడియం శ్రీహరికి ఎర్రబెల్లి సవాల్
వరంగల్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం.. విమర్శలు, సవాళ్లతో హోరెత్తుతోంది. టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు.. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి సవాల్ విసిరారు.
ఇద్దరం కలసి పాలకుర్తిలో ఇండిపెండెంట్లుగా పోటీ చేద్దామని ఎర్రబెల్లి.. కడియంకు ప్రతిపాదించారు. పాలకుర్తిలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎర్రబెల్లి సవాల్ చేశారు. నువ్వు ఓడిపోతే ఏం చేస్తావని కడియం శ్రీహరిని ప్రశ్నించారు.