
'జీవితంలో ఎప్పటికీ మంత్రి కాలేరు'
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావుపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎర్రబెల్లి తన జీవితంలో ఎప్పటికీ మంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. తాను రాజీనామా చేస్తే ఆ స్థానంలో మంత్రి కావాలని ఎర్రబెల్లి కలలు కంటున్నారని కడియం వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్లో కడియం శ్రీహరి ఓపెన్ స్కూల్స్ ప్రాస్పెక్టర్స్ను విడుదల చేశారు. దశలవారిగా కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేస్తామని ఆయన తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో నియోజకవర్గానికి 10 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని కడియం హామీ ఇచ్చారు.