
కడియంపైకి చెప్పు విసిరిన రైతు
వరంగల్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి చేదు అనుభవం ఎదురైంది. టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ తరపున ప్రచారం చేసేందుకు శుక్రవారం శాయంపేటకు వచ్చిన కడియం శ్రీహరిపై ఓ రైతు చెప్పు విసిరాడు.
పత్తికి గిట్టుబాటు ధర కల్పించలేదని రైతు కడియం శ్రీహరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసులు వెంటనే ఆ రైతును అదుపులోకి తీసుకున్నారు.