
వరంగల్ బయల్దేరిన వైఎస్ జగన్
హైదరాబాద్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయల్దేరివెళ్లారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన వైఎస్ జగన్ వరంగల్ జిల్లాకు వెళతారు.
పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఈ రోజు సాయంత్రం తొర్రూరులో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో వైఎస్ జగన్ 4 రోజుల పాటు పర్యటించి.. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ తరపున ప్రచారం చేస్తారు.