పాలకుర్తిలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం | ys jagan mohan reddy starts campaign in warangal | Sakshi
Sakshi News home page

పాలకుర్తిలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం

Published Mon, Nov 16 2015 11:42 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

పాలకుర్తిలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం - Sakshi

పాలకుర్తిలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం

వరంగల్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం ప్రారంభించారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన వైఎస్ జగన్ వరంగల్ జిల్లా పాలకుర్తి చేరుకున్నారు. పాలకుర్తిలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం లభించింది. వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తరలివచ్చి వైఎస్ జగన్కు స్వాగతం పలికారు.

పాలకుర్తిలో వైఎస్ జగన్ రోడ్డు షో నిర్వహించారు. భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. మూడు గంటల సమయానికి రోడ్డుమార్గాన జఫర్‌గఢ్ నుంచి వర్దన్నపేట మండలంలోకి ప్రవేశించారు. మండలంలోని దమ్మన్నపేట వద్దపొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు, కూలీలతో మాట్లాడారు. పొలుగు హైమావతి అనే వ్యవసాయ కూలీతో మాట్లాడి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. మంచి రోజులు వస్తాయి.. అధైర్యపడవద్దని వైస్ జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం రెడ్డిపాలెం గ్రామం వైపు వెళ్లారు. రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దాదాపు అరగంటపాటు ఆయన అక్కడే ఉండి వారితో మాట్లాడారు.

వైఎస్ జగన్ వెంట తెలంగాణ పార్టీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ తరపున వైఎస్ జగన్ ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం తొర్రూరులో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో వైఎస్ జగన్ 4 రోజుల పాటు ప్రచారం చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement