
'టీఆర్ఎస్ నేతలు ఓటర్లను బెదిరించారు'
హైదరాబాద్: వరంగల్ లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ నేతలు ఓటర్లను బెదిరించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. పింఛన్లు, రుణమాఫీ ఆగిపోతాయని బ్లాక్మెయిల్ చేశారని చెప్పారు. వరంగల్ లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ రికార్డు మెజార్టీతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
బుధవారం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో ఇంటింటికి నీళ్లు అందించి ఓట్లు అడుగుతామంటున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎన్నికల హామీలు అమలు చేశాకే ఓట్లు అడుగుతామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయం పరిస్థితులను బట్టి ఉంటుందని చెప్పారు.