first voter
-
Lok shabha Elections 2024: ఎవరిని ఎన్నుకుందాం?!
400కు పైగా అని ఒక కూటమి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని మరో కూటమి. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. జూన్ 1న చివరిదైన ఏడో విడతతో దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. చివరి విడతలో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ ఒకటి. అక్కడి తొలి ఓటర్లు పలు అంశాలపై చురుగ్గా స్పందిస్తున్నారు. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు, మహిళా భద్రత తదితరాలకే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. అయితే అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల్లో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేని డైలమాలో ఉన్నామని ఈ యంగ్ ఓటర్స్‌లో పలువురు అంటున్నారు. నోటాకే తమ ఓటని పలువురు చెబుతుండటం విశేషం. రాష్ట్రంలో 4 లోక్‌సభ సీట్లతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.ఉచితాలు అనుచితాలే...! కొన్నేళ్లుగా పారీ్టలన్నీ పోటాపోటీగా ప్రకటిస్తున్న పలు ఉచిత హామీలపై, అమలు చేస్తున్న ఉచిత పథకాలపై యువ ఓటర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండటం విశేషం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల భారమంతా అంతిమంగా పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ప్రజానీకంపైనే పడుతోందని వారంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా హిమాచల్‌లో ఉచితాలను నిలిపివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘‘అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సిన నిధులు ఉచితాల కారణంగా పక్కదారి పడుతున్నాయన్నది నిస్సందేహం’’ అంటున్నారు సోలన్‌కు చెందిన రియా. ఆమె ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా యువత నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పదేళ్ల బీజేపీ పాలనను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు. ‘‘బీజేపీ సారథ్యంలోని నియంతృత్వమా? విపక్ష ఇండియా కూటమి సంకీర్ణమా? కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేకపోతున్నా. ఏమైనా రాజకీయాల్లో సానుకూల మార్పు మాత్రం కోరుకుంటున్నా’’ అంటున్నాడు మరో ఓటరు నితీశ్. బీజేపీ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ దురి్వనియోగం చేస్తోందని డిగ్రీ ఫస్టియర్ విద్యార్థి రోహిత్ విమర్శిస్తున్నారు. ‘‘మోదీకి ఓటేయడమంటే నియంతృత్వాన్ని సమర్థించడమే. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు కూడా దేశానికి మంచివి కావు. కనుక ఇండియా కూటమికి ఓటేయడం కూడా సరికాదు’’ అంటున్నాడతను! ఔత్సాహిక జర్నలిస్టు...సంజౌలీ ప్రభుత్వ పీజీ కాలేజీలో జర్నలిజం చదువుతున్న అన్షుల్ ఠాకూర్ ఈసారి ఓటేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కలి్పంచి, మహిళలకు భద్రతను పెంచేవారికే తన ఓటని స్పష్టంగా చెబుతున్నాడు. పారిశ్రామికవేత్త కావాలన్నది తన కల అని మరో పీజీ విద్యార్థి పరీక్షిత్ అంటున్నాడు. ఆధునిక సాంకేతికతను, స్టార్టప్ సంస్కృతిని, యువతను ప్రోత్సహించే వారికే తన ఓటని చెబుతున్నాడు. ‘‘ఏ పార్టీ అధికారంలోకి వచి్చనా ఉమ్మడి పౌరస్మృతి, నూతన విద్యా విధానాలను సమర్థంగా అమలు చేయాలి. ఈశాన్య ప్రాంతాలతోపాటు లద్దాఖ్ వంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. భారత సంస్కృతిని పరిరక్షించాలి. తొలిసారి ఓటరుగా ఇది నా ఆకాంక్ష’’ అని సంజౌలీ పీజీ కాలేజీకి చెందిన మరో విద్యార్థి వశి‹Ù్ట శర్మ చెప్పాడు. అభ్యర్థులెవరూ నా అంచనాలకు తగ్గట్టుగా లేరు. అందుకే నా తొలి ఓటు నోటాకే’’ అని మంచీకి చెందిన అదితి ఠాకూర్ చెప్పుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓటర్ల అవగాహన కోసం కాలేజీ విద్యార్థులు వినూత్న ప్రదర్శన (ఫోటోలు)
-
తొలి ఓటర్ ఇక లేరు
షిమ్లా: స్వతంత్ర భారతదేశంలో తొలి ఓటర్‌గా చరిత్రకెక్కిన 106 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగీ ఇక లేరు. చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కిన్నౌర్ జిల్లా కల్పా గ్రామంలోని స్వగృహంలో శనివారం తెల్లవారుజామున మరణించారు. అయితే తుదిశ్వాస వదిలేందుకు ముందు కూడా ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం! రాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఈ నెల 2న కల్పా గ్రామంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. నేగీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడం ఇదే తొలిసారి! ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలు నేగీ 1917 జూలైలో జన్మించారు. పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1975లో పదవీ విరమణ పొందారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ఆయనకెంతో ఇష్టం. ఇప్పటిదాకా 34సార్లు ఓటు వేశారు. పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ.. ఎన్నిక ఏదైనా సరే 1951 నుంచి ఏనాడూ ఓటు వేయడం మర్చిపోలేదు. 2010లో అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా కల్పా గ్రామంలో నేగీని ఘనంగా సత్కరించారు. 2014లో హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల సంఘం నేగీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. 2014 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గూగుల్ సంస్థ ‘ప్లెడ్జ్ టు ఓట్’ ప్రచారంలో భాగంగా నేగీపై వీడియో రూపొందించింది. ఈ వీడియో ద్వారా ఆయన అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు పొందారు. ప్రతి ఎన్నిక ఓ పండుగ లాంటిదేనని, ప్రతి ఓటూ విలువైనదేనని, ఓటర్లంతా తప్పనిసరిగా ఓటు వేసి, మంచి నాయకులను ఎన్నుకోవాలని నేగీ తరచూ చెబుతుండేవారు. యువతకు స్ఫూర్తిదాయకం: మోదీ తొలి ఓటర్ నేగీ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వెలిబుచ్చారు. ఆయన 34 సార్లు ఓటు వేయడం గొప్ప విషయమని కొనియాడారు. ‘‘అనారోగ్యంతో బాధపడుతూ కూడా రెండు రోజుల క్రితమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలా మరణానికి ముందు కూడా తన విధిని చక్కగా నిర్వర్తించారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన దృక్పథం యువతకు స్ఫూర్తిదాయకం’’ అంటూ ప్రశంసించారు. భారమైన హృదయంతో తలవంచి నేగీకి నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ తదితరులు నేగీ మరణం పట్ల సంతాపం తెలిపారు. నేగీ ఇక లేరన్న నిజం బాధాకరమని పేర్కొన్నారు. బీజేపీ కూడా ట్విట్టర్లో సంతాపం ప్రకటించింది. నేగీ మృతి పట్ల ఎన్నికల సంఘం కూడా సంతాపం ప్రకటించింది. ఇలా తొలి ఓటు... దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952 జనవరి–ఫిబ్రవరిలో జరిగాయి. కానీ, హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లా చినీ గ్రామంలో (నేటి కల్పా) తీవ్రమైన చలితోపాటు ముందుగానే మంచు కురుస్తుండడంతో 1951 అక్టోబర్ 25న్నే పోలింగ్ జరిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి దట్టమైన మంచులో నడుచుకుంటూ వెళ్లి నేగీ మొదటి ఓటు వేశారు. అలా స్వతంత్ర భారత్‌లో ఓటేసిన తొలి పౌరుడిగా రికార్డు సృష్టించారు. -
స్వతంత్ర భారత్ తొలి ఓటర్ కన్నుమూత..
-
117 ఏళ్ల దేశ తొలి ఓటరు ఇక లేరు.. బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన 3 రోజులకే..
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. నవంబర్ 12న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో భారత్‌కు స్వాతంత్ర్యం అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసిన శ్యామ్ శరణ్ నేగి మరణించారు. ఆయన వయసు 106 సంవత్సరాలు. కాగా ఆయన మూడు రోజుల క్రితమే(నవంబర్ 2) హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా 34 సారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలని శ్యాం శరణ్ భావించినా.. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి నుంచి ఓటు వేసేందుకు అనుమతించాలని అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. కిన్నౌర్ జిల్లాకు చెందిన శ్యాం శరణ్ నేగి కోసం ఎన్నికల కమిషన్ బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అప్పటికే శ్యామ్ అనారోగ్యంతో బాధపడుతుండగా.. శనివారం ఉదయం తన స్వస్థలమైన కల్పాలో కన్నుమూశారు. వృద్ధుడి అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తోందని, గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. శ్యామ్ శరణ్ నేగి జూలై 1, 1917న జన్మించారు. కల్పాలో పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1947లో బ్రిటిష్ పాలన ముగిసిన తరువాత స్వాతంత్ర్య భారతదేశంలో జరిగిన మొదటి ఎన్నికల్లో ఓటు వేసిన తొలి వ్యక్తి శరణ్ నేగి. 1951 అక్టోబర్ 25న ఆయన ఓటేశారు. అయితే మొదటిసారి ఎన్నికల పోలింగ్ 1952లో ఎక్కువ జరిగినప్పటికీ హిమాచల్ ప్రదేశ్ అయిదు నెలల ముందగానే ఎన్నికలకు వెళ్లింది. హిమాచల్‌లో ఫిబ్రవరి, మార్చిలో వాతావరణం ప్రతికూలంగా ఉండటం, అతిగా మంచు కురిసే ప్రమాదం ఉండటం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాక శ్యామ్ శరణ్ నేగి హిందీ చిత్రం సనమ్ రేలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు. -
నిజాయితీపరులకే ఓటేయండి: నేగీ
స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యామ్‌శరణ్ నేగీ(102) ఆదివారం ఓటేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ నియోజకవర్గానికి చెందిన నేగీ పంచాయతీ నుంచి లోక్‌సభ వరకూ ప్రతీఎన్నికల్లో ఓటు వేశారు. భారత్‌లో తొలిఓటర్ కావడంపై నేగీ స్పందిస్తూ..‘1952, ఫిబ్రవరిలో మనదేశంలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే వాతావరణం అనుకూలించదేమోనన్న కారణంతో కిన్నౌర్‌లో 1951, అక్టోబర్‌లోనే ఎన్నికల్ని నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటూనే నేను ఓటేశా’ అని తెలిపారు. రాజకీయ పార్టీలకు కాకుండా నిజాయితీపరులైన, చురుకైన అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు నేగీ విజ్ఞప్తి చేశారు. కాగా, నేగీని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి, తీసుకెళ్లేందుకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
తొలి ఓటరు దొరికాడిలా..
సాక్షి, సెంట్రల్ డెస్క్ : స్వతంత్ర భారతదేశపు మొదటి ఓటరు శ్యామ్ నారాయణ్ నేగి. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన శ్యామ్ 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి ఇంత వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఓటు వేశారు. లోక్‌సభ, అసెంబ్లీ, పంచాయతీ.. ఇలా ఏ ఒక్క ఎన్నికనూ ఆయన మిస్ కాలేదు. ఇప్పుడు 102 ఏళ్ల వయసులో వచ్చే నెల్లో జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతకీ అసలాయనే మొట్టమొదటి ఓటరని ఎలా గుర్తించారు? ‘అబ్బో.. అదో పెద్ద కథ. శ్యామ్‌ను గుర్తించడం కోసం ఎంతో కష్టపడ్డాం. నాలుగు నెలల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులన్నీ క్షుణ్ణంగా తిరగేశాం. ఆయన జాడ కనిపెట్టడానికి పీహెచ్డీ పట్టా కోసం పడాల్సినంత శ్రమ పడ్డాం. మొత్తానికి 45 ఏళ్ల తర్వాత ఒక చారిత్రక సత్యాన్ని వెలుగులోకి తెచ్చాం’ అంటూ తాము పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నారు ఐఏఎస్ అధికారి మనీషా నందా. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంలో అదనపు ప్రధాన కార్యదర్శి (పీడబ్ల్యూడీ)గా పనిచేస్తున్న మనీషాయే మొదటగా శ్యామ్‌ను గుర్తించారు. హిమాచల్‌లోని కినార్ జిల్లా కల్ప గ్రామస్తుడైన శ్యామ్ మన దేశపు తొలి ఓటరన్న సంగతి 2007 జూలైలో బయటపడింది. ‘మన దేశంలో ఇతర ప్రాంతాల కంటే ముందు కినార్లో పోలింగ్ మొదలవుతుందని నాకు తెలుసు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల కారణంగా అక్కడ ముందే పోలింగ్ మొదలు పెడతారు. ఒకరోజు ఓటర్ల ఫొటోలున్న జాబితా చూస్తున్నాను. దాంట్లో వారంతా 90 ఏళ్లు పైబడిన వారే. వారిలో శ్యామ్ ఫొటో నన్ను ఆకట్టుకుంది. వెంటనే ఆయన వివరాలు తెలుసుకోవాలని ఎన్నికల అధికారులను కోరాను’ అన్నారు నందా. అప్పట్లో కినార్ డిప్యూటీ కమిషనర్‌గా ఉన్న సుధాదేవి అనే ఐఏఎస్ అధికారి కల్ప గ్రామానికి వెళ్లి శ్యామ్‌ను కలుసుకున్నారు. అప్పటికి శ్యామ్ వయసు 92 సంవత్సరాలు. 1917, జూలై 1న పుట్టిన శ్యామ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. 1951 ఎన్నికల్లో శ్యామ్‌కు ఎన్నికల డ్యూటీ వేశారు. ‘ముందు ఓటు వేసి తర్వాత ఎలక్షన్ డ్యూటీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మా నాన్న ఎన్నికల అధికారులను కోరారు. వారు ఒప్పుకోవడంతో అందరికంటే ముందే ఓటు వేశారు. అలా ఆయన దేశంలో మొట్టమొదట ఓటు వేసిన వ్యక్తి అయ్యారు’ అంటూ సుధాదేవికి విషయం వివరించారు శ్యామ్ కుమారుడు చంద్ర ప్రకాశ్. ఆయనకిప్పుడు 53 ఏళ్లు. శ్యామ్ శరణ్ కథను సుధాదేవి నందాకు చెప్పారు. దాంతో నందా నాలుగు నెలల పాటు ఎన్నికల రికార్డులన్నింటినీ పరిశీలించారు. ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో రికార్డులను కూడా తనిఖీ చేసి శ్యామే మొదటి ఓటరన్న సంగతిని నిర్ధారించారు. విషయం తెలిసిన అప్పటి కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి నవీన్ చావ్లా 2012లో స్వయంగా కల్ప గ్రామానికి వెళ్లి శ్యామ్‌ను సత్కరించారు. -
తొలి ఓటరుకు సన్మానం
వరంగల్: వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పోలింగ్ కేంద్రంలో తొలి ఓటరుకు సన్మానం చేశారు. కలెక్టర్ కరుణ, పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఓటరకు పూలతో స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో మొదట ఓటు హక్కు వినియోగించుకున్న ఓటరుకు అధికారులు పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సిబ్బంది వెంటనే సరిచేయడంతో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల విశేషాలు.. వడ్డేపల్లిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఓటు హక్కు వినియోగించుకున్నారు తమ గ్రామాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదంటూ తొర్రురు మండలం టీక్యాతండా గిరిజనులు పోలింగ్‌ను బహిష్కరించారు. భూపాలపల్లి 17వ బూత్ పోలింగ్ కేంద్రం, ధర్మసాగర్ మండలం జానకీపురం, వర్ధన్నపేట మండలం వట్యాలలో ఈవీఎంలు మొరాయించాయి. అధికారులు వెంటనే సరిచేసి పోలింగ్ కొనసాగిస్తున్నారు. వరంగల్ ఎన్నికల్లో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 1778 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 10 వేల మందికిపైగా భద్రత సిబ్బందిని వినియోగించారు. తొలిసారిగా ఈవీఎంలపై పార్టీ గుర్తులతోపాటు అభ్యర్థుల ఫోటోను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ ఉప ఎన్నికల్లో దాదాపు 15 లక్షల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగియనుంది. -
స్వతంత్య్ర భారతదేశపు మొట్టమొదటి ఓటరు...
భారతదేశంలో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ‘శ్యామ్ శరణ్ నేగీ’ గురించి అందరూ తెలుసుకోవాలి. 97 సంవత్సరాలశ్యామ్ శరణ్ నేగీ ... 1951 - 52 నుంచి తన ఓటుహక్కును వినియోగించుకుంటూనే ఉన్నాడు. 16 వ సారి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమవుతున్న శ్యామ్ భారతదేశంలోని అత్యంత వృద్ధ ఓటరుగా నమోదయ్యాడు. ఉత్తర హిమాచల్‌ప్రదేశ్‌లో టీచర్‌గా పని చేసి రిటైరయిన శ్యామ్, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951 లో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి తన ఓటుహక్కును వినియోగించుకుంటూనే ఉన్నారు. ఈ నెల పద్నాలుగో తారీకున మొత్తం తొమ్మిది విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ఈప్రక్రియం మొత్తం ఐదు వారాలు జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు మే 16న విడుదలవుతాయి. 814 మిలియన్ల మంది ఈ ఎన్నికలలో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇంతకీ విశేషమేంటంటే స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఓటుహక్కును వినియోగించుకున్న మొట్టమొదటి ఓటరు శ్యామ్ నేగి. హిమాచలప్రదేశ్ కిన్నూర్ జిల్లా కల్పాలో నివాసం ఉంటున్న శ్యామ్...అత్యంత వృద్ధ ఓటరనీ, ఈయన 2014 మే 7 వ తేదీన తన ఓటుహక్కును వినియోగించుకోనున్నాడనీ ఎలక్షన్ కమిషన్ తెలియచేసింది. గూగుల్ ఇండియా ఇటీవలే ‘ప్లెడ్జ్ టు ఓట్’ అనే ఒక వీడియోను యూ ట్యూబ్‌లో ఉంచింది. ‘‘ప్రతి ఎన్నికల సమయంలోనూ తన ఓటుహక్కును సద్వినియోగం చేస్తున్న నిజాయితీ ఓటరు’’ అని అందులో పేర్కొంది. మార్చి 24, 2014న యూట్యూబ్‌లో ఉంచిన నాటి నుంచి ఇప్పటివరకు సుమారు 1.7 మిలియన్ల మంది ఈ వీడియోను సందర్శించారు. ఈ వీడియోలో... నేగీ టీ తన ఇంటిదగ్గర టీ తాగుతూ, ఆరుబయట కొండల మీద నుంచి రాలుతున్న మంచును చూస్తూ ఉండటంతో ప్రాంభమవుతుంది. ఆ తరువాత - కోటు వేసుకుని, చేతికర్ర సహాయంతో పోలింగ్ సెంటర్‌కు మంచు నేల మీద నడుస్తూ, ఆపిల్, పైన్ తోటల మీదుగా వస్తున్న గాలిని ఆస్వాదిస్తూ, ఎన్నికల కేంద్రానికి చేరుకోగానే, అతడికి మెడలో దండ వేసి, అతనితో ఓటు వేయిస్తారు. శ్యామ్ నేగీ భారతదేశంలోని మొట్టమొదటి ఓటరుగా ఈ వీడియోలో చూపుతారు. మొట్టమొదటి పోలింగ్ కేంద్రాన్ని కల్పా గ్రామంలోనే ఏర్పాటుచేశారని కూడా ఇందులో వివరిస్తారు. 25 అక్టోబరు 1951లో ఇక్కడ ఎన్నికలు జరిగాయనీ, అ రోజులను గుర్తు చేసుకుంటూ చెబుతారు శ్యామ్. నాటి నుంచి ప్రతిసారీ తన ఓటుహక్కును వినియోగించుకుంటున్నాననీ, రానున్న మే 7 వ తేదీన ఓటు వేయబోతున్నాననీ శ్యామ్ తెలిపారు. ‘‘ ఏళ్ల క్రితం జరిగిన ఆసంఘటనలను ఇంకా మర్చిపోలేదు. మొట్టమొదటిసారి ఓటు వేయడానికి వెడుతున్నప్పుడు విపరీతంగా మంచు కురుస్తోంది’’ అంటూ చిరునవ్వుతో చెబుతారు శ్యామ్. ‘ఏ పార్టీకి మద్దతిస్తారని ఎవరైనా అడిగితే, ‘‘దేశాన్ని నిజాయితీగా పరిపాలించి, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటేచేసేవారికి ఓటు వేస్తాను’’ అని మాత్రమే చెబుతారు. భారత ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన నోటా (నన్ ఆఫ్ ద ఎబౌ) గురించి మాట్లాడటానికి అంతగా ఉత్సాహం చూపట్లేదు. ‘‘నేను నోటాను అంగీకరించను. మనం ఎవ్వరికీ ఓటు వేయకూడదన్నంత చెడ్డవారు ఎవ్వరూ లేరు’’ అంటారు. - డా. వైజయంతి