శ్యామ్‌శరణ్ నేగీ
స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యామ్‌శరణ్ నేగీ(102) ఆదివారం ఓటేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ నియోజకవర్గానికి చెందిన నేగీ పంచాయతీ నుంచి లోక్‌సభ వరకూ ప్రతీఎన్నికల్లో ఓటు వేశారు. భారత్‌లో తొలిఓటర్ కావడంపై నేగీ స్పందిస్తూ..‘1952, ఫిబ్రవరిలో మనదేశంలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే వాతావరణం అనుకూలించదేమోనన్న కారణంతో కిన్నౌర్‌లో 1951, అక్టోబర్‌లోనే ఎన్నికల్ని నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటూనే నేను ఓటేశా’ అని తెలిపారు. రాజకీయ పార్టీలకు కాకుండా నిజాయితీపరులైన, చురుకైన అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు నేగీ విజ్ఞప్తి చేశారు. కాగా, నేగీని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి, తీసుకెళ్లేందుకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment