kinnaru
-
నిజాయితీపరులకే ఓటేయండి: నేగీ
స్వతంత్ర భారత తొలి ఓటర్ శ్యామ్‌శరణ్ నేగీ(102) ఆదివారం ఓటేయనున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ నియోజకవర్గానికి చెందిన నేగీ పంచాయతీ నుంచి లోక్‌సభ వరకూ ప్రతీఎన్నికల్లో ఓటు వేశారు. భారత్‌లో తొలిఓటర్ కావడంపై నేగీ స్పందిస్తూ..‘1952, ఫిబ్రవరిలో మనదేశంలో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అయితే వాతావరణం అనుకూలించదేమోనన్న కారణంతో కిన్నౌర్‌లో 1951, అక్టోబర్‌లోనే ఎన్నికల్ని నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటూనే నేను ఓటేశా’ అని తెలిపారు. రాజకీయ పార్టీలకు కాకుండా నిజాయితీపరులైన, చురుకైన అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు నేగీ విజ్ఞప్తి చేశారు. కాగా, నేగీని పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చి, తీసుకెళ్లేందుకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. -
ఆరేళ్ల తర్వాత మేకప్ వేసుకోనున్న నటి
తిరువనంతపురం: వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తిరిగి మరోసారి తెరంగేట్రం చేయనున్నారు. దాదాపుగా ఆరేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఓ మలయాళ చిత్రం ద్వారా తిరిగి మేకప్ వేసుకోబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకోసం ఆమె కేరళ రాజధానికి కూడా చేరుకున్నారు. దర్శకుడు ఎంఏ నిషాద్ తీయబోతున్న కిన్నారు(మంచి) అనే మలయాళ చిత్రంలో జయప్రద ప్రస్తుతం నటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలయాళ చిత్రం ద్వారా తిరిగి నటనను ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. తాను నటించబోతున్న ఈ సినిమాలో సామాజిక సమస్య అయిన నీటి సమస్య, రైతుల సమస్యలు ఇతివృత్తంగా ఉండబోతుందని చెప్పారు. 2011లో ఆమె మలయాళంలో ప్రణయం అనే చిత్రం చేశారు. ఆ చిత్రంలో ఆమెతోపాటు మోహన్‌లాల్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా నటించారు.