హనుమ విహారికి ఘన సన్మానం  | Hanuma Vihari Felicitated By CER Club And Fans At 8 Incline Colony | Sakshi
Sakshi News home page

హనుమ విహారికి ఘన సన్మానం 

Published Tue, Feb 12 2019 11:19 AM | Last Updated on Tue, Feb 12 2019 11:19 AM

Hanuma Vihari Felicitated By CER Club And Fans At 8 Incline Colony - Sakshi

యైటింక్లయిన్‌కాలనీ: భారత క్రికెట్‌ హనుమ విహారిని ఆదివారం రాత్రి ఘనంగా సన్మానించారు. తన సోదరి వివాహ రిసెప్షన్‌ వేడుకల్లో పాల్గొనడానికి  యైటింక్లయిన్‌కాలనీకి వచ్చిన క్రికెటర్‌ హనుమ విహారిని సీఈఆర్‌క్లబ్, దృవపాండవ్‌ క్రికెట్‌ టీం సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మరింత రాణించి భారత్‌కు కీర్తిప్రతిష్టలు తేవాలని వక్తలు అన్నారు. చిన్ననాటి నుంచి కఠోర శ్రమతో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన విహారి ఈ తరం యువతకు ఆదర్శం అని కొనియాడారు. పట్టుదల ఉంటే సాధించనిది ఏమి లేదని, ప్రతీ ఒక్కరు తమ లక్ష్యం వైపు అలుపెరుగని శ్రమ చేస్తే విజయం వరిస్తుందన్నారు. విహారీ మాట్లాడుతూ తనను సాదరంగా సన్మానించిన క్లబ్‌ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో క్లబ్‌ గౌరవ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, కార్యదర్శి హమీద్, సింగరేణి డాక్టర్‌ రమేష్‌బాబు, ఓసీపీ–2 ఎస్‌ఈ చంద్రశేఖర్, దృవపాండవ క్రికెట్‌ టీం సభ్యులు నర్సింహారెడ్డి, ముఖేశ్, తిరుపతిరెడ్డి, హరీష్, రవిశంకర్, వేణుమాదవ్, పాశం ఓదెలు, ఆరీఫ్, శ్రీధర్, అంజి పాల్గొన్నారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement