
దండేశారు దండం పెట్టారు..
అయినా వినని వారికి ఫైన్ రాశారు...
అప్పటికీ వినకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు....
వరంగల్ బల్దియా అధికారుల్లా ఆలోచిస్తారు.
బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్న వారికి జీడబ్ల్యూఎంసీ (గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్)ల అధికారులు వెరైటీ శిక్ష వేశారు. 200 వందల మందికి పైగా పూలదండలు వేసి సన్మానించారు. బహిరంగ మూత్ర విసర్జన కారణంగా... వరంగల్ ఏజీఎం ప్రాంతంలో రోడ్డుపై జనం నడవాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. బల్దియా అధికారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎన్నోసార్లు శుభ్రం చేశారు. అయినా జనాల్లో మార్పు కనిపించకపోవడంతో ఈ దండ వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తమ చుట్టు ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని.. అలా చేసినప్పుడే రోగాల బారిన పడకుండా ఉంటారని అధికారులు అంటున్నారు. చూద్దాం పూలదండ కార్యక్రమమన్నా ప్రజల్లో మార్పు తీసుకొస్తుందేమో.
Comments
Please login to add a commentAdd a comment