తెనాలివాసికి ‘లెజెండ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు | Tenali native got place in Legend book of records | Sakshi
Sakshi News home page

తెనాలివాసికి ‘లెజెండ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు

Published Tue, Oct 25 2016 8:49 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM

తెనాలివాసికి ‘లెజెండ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు

తెనాలివాసికి ‘లెజెండ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు

తెనాలి: పట్టణంలోని నాజరుపేటకు చెందిన ప్రముఖ గణిత పరిశోధకుడు కొండూరు శ్రీనివాస రాఘవ లెజండ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో  స్థానం సంపాదించారు. హైదరాబాద్‌ తెలుగు విశ్వవిద్యాలయంలో సంఘమిత్ర సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి జరిగిన అభినందన సభలో ఆయన తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్‌ పి.విజయబాబు చేతుల మీదుగా పత్రం అందుకున్నారు.  తెలంగాణ శాసనమండలి చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకరరెడ్డి, సంఘమిత్ర కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ పానుగంటి వెంకటేష్, తెలంగాణ స్టేట్‌ గ్యాలరీ ఆఫ్‌ ఆర్ట్స్‌ డైరెక్టర్‌ డి.మనోహర్, డాక్టర్‌ తుర్లపాటి పట్టాభి పాల్గొని రాఘవ సేవలను కొనియాడారు.
 
ఆయన పరిశోధనలివీ..
వేద గణితంతో పాటు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌కు సంబంధించిన సూత్రాల  పరిశీలన– అభివృద్ధి అనే అంశంపై ఆయన పరిశోధన చేశారు. ‘పై’విలువకు 500 సూత్రాలు కనుగొన్నారు. 70కి పైగా జాతీయ, అంతర్జాతీయ గణిత సమావేశాల్లో ప్రసంగించి, పత్రాలు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement