ప్రమాదరహిత డ్రైవర్లకు సన్మానం | Felicitation to non accident drivers | Sakshi
Sakshi News home page

ప్రమాదరహిత డ్రైవర్లకు సన్మానం

Published Sun, Jul 27 2014 1:16 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

ప్రమాదరహిత డ్రైవర్లకు సన్మానం - Sakshi

ప్రమాదరహిత డ్రైవర్లకు సన్మానం

డ్రైవర్లూ.. ప్రమాదాలు నివారించండి
ఉత్తమ డ్రైవర్లను    స్ఫూర్తిగా తీసుకోవాలి
ఆర్టీసీ ఈడీ పురుషోత్తం

 మంకమ్మతోట : కరీంనగర్ రీజియన్‌లోని ప్రమాదరహిత డ్రైవర్లను సన్మానించారు. ఆర్టీసీ ప్రమాదరహిత వారోత్సవాల ముగింపును నగరంలోని టు డిపోలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈడీ పురుష్తోతం హాజరై ఉత్తమ డ్రైవర్లకు జ్ఞాపికలు అందించారు. శాలువాలతో సన్మానించారు. ప్రస్తుత రోజుల్లో డ్రైవింగ్ సవాల్‌గా మారిందని, ప్రతిఒక్కరూ రోడ్డు ప్రమాణాలు పాటించి ప్రమాదాలను నివారించాలని సూచించారు. డ్రైవింగ్ సరిగ్గా చేస్తే తనతోపాటు ప్రయాణికులూ సురక్షితంగా గమ్యస్థానం చేరుతారనే విషయాన్ని డ్రైవర్లు గుర్తుంచుకోవాలన్నారు. డ్రైవర్లకు ఇబ్బందులు లేకుండా డ్యూటీలు వేయాలని అధికారులకు సూచించారు. ఉత్తమ డ్రైవర్లను ఇతర డ్రైవర్లు స్ఫూర్తిగా తీసుకుని సంస్థ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.

 జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ జోనల్ ఆస్పత్రిలో నలుగురు డాక్టర్లను నియమిం చి 24 గంటల సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. రీజినల్ మేనేజర్ పీవీ మునిశేఖర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని, సెల్‌ఫోన్ మా ట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న సమయంలోనే అధికం గా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మూడు నెలల్లో 30 ప్రమాదాలు జరిగి 16 మంది మరణించారని, 54మంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. ఈ ఏడాది బాధిత కుటుంబాలకు రూ.4.16 కోట్లు పరి హారం చెల్లిస్తే.. ఈ మూడు నెలల్లోనే 1.40 కోట్లు చెల్లిం చడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో డెప్యూటీ చీఫ్ మెకానిల్ ఇంజినీర్ కృష్ణమూర్తి, డెప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ మధుసూదన్, టీఎన్‌ఎంయూ నాయకులు జక్కుల మల్లేశం, టీఎంయూ నాయకుడు రవీందర్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకుడు మల్లయ్య పాల్గొన్నారు.
 
ప్రమాదరహిత డ్రైవర్లు వీరే..
వేములవాడకు చెందిన రాజయ్య 34 ఏళ్లుగా ప్రమాదం జరగకుండా డ్రైవింగ్ చేసి జోనల్‌లో ప్రమాదరహిత డ్రైవర్‌గా నిలిచారు. కరీంనగర్ టు డిపోకు చెందిన ఎస్‌కే.ఖరీముద్దీన్ ఉత్తమ డ్రైవర్‌గా ప్రథమ బహుమతి, అదే డిపోకు చెందిన ఎస్.రాజేందర్, ఎండీ.అమీరుద్దీన్ తృతీయ బహుమతులు అందుకున్నారు. అలాగే రీజియన్‌లోని 11 డిపోల నుంచి ఒక్కక్కరి చొప్పున ప్రమాదరహిత డ్రైవర్లను ఎంపిక చేశారు. గోదావరిఖని నుంచి ఎండీ.యూసఫ్‌ఖాన్, హుస్నాబాద్ నుంచి పి.కనుకయ్య, హుజూరాబాద్ నుంచి కె.కొమురయ్య, జగిత్యాల నుంచి పి.రాజయ్య, కరీంనగర్ వన్‌డిపో నుంచి బి.మల్లేశం, టు డిపో నుంచి ఎ.కృష్ణ, కోరుట్ల నుంచి బి.నరంద్ర, మంథని నుంచి ఎ.కొండయ్య, మెట్‌పల్లి నుంచి ఎస్‌కే.ఇక్బాల్, సిరిసిల్ల నుంచి ఎం.మహిపాల్‌రెడ్డి, వేములవాడ  నుంచి టి. యాదగిరి ఎంపికయ్యారు. వీరిని అధికారులు సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement