ఐపీఎల్‌లో క్రికెట్ లెజెండ్స్‌కు సన్మానం
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో భారత క్రికెట్ లెజెండ్స్ ఐదుగురుని సన్మానిస్తామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. కౌన్సిల్ గురువారం ఢిల్లీలో సమావేశమైంది. హైదరాబాద్‌లో ఏప్రిల్ 5న జరిగే ఐపీఎల్-10 ప్రారంభ వేడుకలోభారత క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావీడ్, వీరెంద్ర సేహ్వాగ్ వీవీఎస్ లక్ష్మన్‌లను సన్మానించాలని నిర్ణయించింది. సమావేశ విషయాలనుఐపీఎల్ చైర్మెన్ రాజీవ్ శుక్లా మీడియాకు తెలిపారు.
ఈ ఐదుగురి లెజెండ్స్‌లో నలుగులు మాజీ కెప్టెన్‌లున్నారు. సన్మానించే లెజెండ్స్ లిస్టులో మాజీ కెప్టెన్, ప్రస్తుత కోచ్ అనీల్‌కుంబ్లే పేరు లేకపోవడం గమనార్హం. కుంబ్లే ఐదుగురి లెజెండ్స్‌తో భారత క్రికెట్‌కు సేవలందించిన సమ ఆటగాడు. మాజీ భారత మహిళా క్రికెటర్ డయానా ఎడ్జులీ మహిళా మాజీ క్రికెటర్ల ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను ఐపీఎల్ మ్యాచ్ వేదికలపై ఇవ్వాలని కోరింది.