క్రీడాకారిణులకు అభినందన | Felicitation to champions | Sakshi
Sakshi News home page

క్రీడాకారిణులకు అభినందన

Published Sun, Sep 18 2016 1:25 AM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

క్రీడాకారిణులకు అభినందన

క్రీడాకారిణులకు అభినందన

నెల్లూరు(బృందావనం): జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన నెల్లూరు క్రీడాకారిణులు ఏకాంబరం జోష్ణవి, కొమ్మెర్ల తులసిను శాప్‌డైరెక్టర్‌ రవీంద్రబాబు, డీఎస్‌డీఓ రమణయ్య శనివారం అభినందించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ వియత్నాం రాజధాని హునాయ్‌లో ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు జరిగిన ఆసియా యోగా క్రీడోత్సవాల్లో జోష్ణవి మూడు బంగారు, ఒక రజత పతకం సాధించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జంషెడ్‌పూర్‌లో జరిగిన సీనియర్‌ జాతీయస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారిణి తులసి 162 కేజీల డెడ్‌లిఫ్ట్‌ ఈవెంట్‌లో కాంస్యపతకం సాధించినట్లు తెలిపారు.  అలాగే ఇంటర్‌స్టేట్‌ +84 వెయిట్‌ క్యాటగిరిలో 475 కేజీల పవర్‌లిఫ్టింగ్‌లో జాతీయస్థాయిలో రజత పతకం సాధించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఖోఖో క్రీడాకారుడు పీ విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement