ప్రగతిభవన్‌కు తిమ్మక్క.. సమీక్ష సమావేశానికి తీసుకెళ్లి సత్కరించిన సీఎం | CM KCR Felicitates 110 Year Old Environmental Activist Saalumarada Thimmakka | Sakshi
Sakshi News home page

ప్రగతిభవన్‌కు తిమ్మక్క.. సమీక్ష సమావేశానికి తీసుకెళ్లి సత్కరించిన సీఎం కేసీఆర్‌

Published Thu, May 19 2022 11:04 AM | Last Updated on Thu, May 19 2022 3:49 PM

CM KCR Felicitates 110 Year Old Environmental Activist Saalumarada Thimmakka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ గ్రహీత.. 110 ఏళ్ల వయసున్న సాలు మరద తిమ్మక్క బుధవారం సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎం ఆమెను ప్రగతిభవన్‌లో మంత్రు లు, కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి స్వయంగా తోడ్కొని వెళ్లారు. అందరికీ పరిచయం చేశారు. ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పర్యావరణం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన తిమ్మక్కను మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు.

మంచి పనిలో నిమగ్నమైతే గొప్పగా జీవించవచ్చని, మంచి ఆరోగ్యంతో ఉంటారనడానికి తిమ్మక్క నిలువెత్తు నిదర్శనమని చెప్పారు. అందరూ ఆమె బాటలో నడవాలని ఆకాంక్షించారు. కాగా.. వ్యవసాయం, అటవీ సంరక్షణ రంగాల్లో రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలవడం పట్ల తిమ్మక్క సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు అవసరముంటే తాను అందజేస్తానని చెప్పారు. కర్ణాటకకు చెందిన తిమ్మక్క బీబీసీ ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల్లో ఒకరు. 25 ఏళ్లవరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి.. పచ్చదనం, పర్యావరణ హితం కోసం ఆమె కృషి చేస్తున్నారు. 
చదవండి👉🏼 కేసీఆర్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు.. తప్పుగా అనుకోవద్దని వ్యాఖ్యలు

‘ఆకుపచ్చని వీలునామా’ఆవిష్కరణ 
హరితహారం, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ పై సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం ‘ఆకుపచ్చని వీలునామా’పుస్తకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు.  

సీఎంను కలిసిన తమిళ హీరో విజయ్‌ 
తమిళ సినీనటుడు విజయ్‌ బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. విజయ్‌కు కేసీఆర్‌ శాలువా కప్పి సత్కరించారు.   
చదవండి👉 భూవివాదంలో కేసు నమోదు.. పరారీలో మంత్రి మల్లారెడ్డి బావమరిది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement