
పూర్ణ, ఆనంద్ కు సన్మానం
బెంగళూరు : ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్‌లకు బెంగళూరులో ఆదివారం అపూర్వ సత్కారం లభించింది. ఈ సందర్భంగా జరిగిన సవూవేశంలో కర్ణాటక రాష్ర్ట రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మాట్లాడుతూ... ప్రపంచ దేశాల ముందు భారతీయులు తల ఎత్తుకునే రోజు ఇదని అన్నారు. ఇలాంటి సాహసవంతులను అన్ని ప్రభుత్వాలు ఆదరించాలన్నారు. జేసీ రోడ్డులోని రవీంద్ర కళాక్షేత్రంలో బెంగళూరు తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సిద్ధం నారయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాలవత్ పూర్ణ, ఆనంద్‌కుమార్‌ను కర్ణాటక సంప్రదాయ రీతిలో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.