జాతీయ స్టూడెంట్స్ ఒలింపిక్స్‌లో సత్తా
నెల్లూరు(బృందావనం):
జాతీయస్థాయి స్టూడెంట్స్ ఒలింపిక్ పోటీల్లో వివిధ క్రీడా విభాగంలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అభినందనసభ నిర్వహించారు. స్థానిక బాలాజీనగర్‌లోని మోడరన్ స్కూల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతి«థిగా వాకాటి విజయకుమార్‌రెడ్డి హాజరై మాట్లాడారు. గత నెల 22నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌లోని ప్రేమ్‌సాగర్ ఆశ్రమంలో జరిగిన 3వ జాతీయ స్టూడెంట్స్ ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న నెల్లూరుకు చెందిన క్రీడాకారులు అండర్–10 నుంచి 25 వరకు కరాటే, యోగా, చెస్ పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలవడం హర్షణీయమన్నారు. జిల్లా స్టూడెంట్స్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విజయభరద్వాజ్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ సందీప్‌కుమార్, యోగా మాస్టర్ ఆదినారాయణలను వాకాటి విజయకుమార్‌రెడ్డి ప్రశంసించారు.
కరాటే:
–అండర్–12 కటావిభాగంలో డీఎల్ నరసింహ, పి.అభినయ (బంగారు) ఎస్.వెంకటశివాని (వెండి), జి.కావ్యలిఖిత(రజత),అండర్–14 కటావిభాగంలో డీవీ జాహ్నవి(వెండి), డి.నరేంద్ర(వెండి), టి.చందన(రజత), పి.సాయివికాస్‌రెడ్డి(రజత),అండర్–14కుమిటే విభాగంలో ఎ.వెంకటసాత్విక్ (బంగారు),అండర్–17కటా విభాగంలో టి.అభినయ్ రజత,కుమిటేలో వెండి,కుమిటేలో బి.సరితారెడ్డి(వెండి),అండర్–19 కుమిటే విభాగంలో ఎస్.మల్లికార్జున(బంగారు)
యోగా:
అండర్–10–వి.అక్షిత(రజత),అండర్–14 వి.వి.పూర్ణిమ అపురూప(రజత),
చదరంగం
అండర్–12విభాగంలో–ఎ.ఎం.శ్రీహరి(బంగారు),14లోఎ.ఎం.కుమారస్వామి(రజత), 25లో సీహెచ్.సాయికుమార్(బంగారు), వి.విష్ణువర్ధన్‌రెడ్డి(వెండి) సాధించారన్నారు.