సాక్షి, విజయవాడ : తాము ఎవరినీ బెదిరించేలా వ్యాఖ్యలు చేయలేదని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను బెదిరించాల్సిన అవసరం తనకు లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనాతో ఉద్యోగుల ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పాం. ఆ సందర్భంలో చేసిన వ్యాఖ్యలే కానీ.. నిమ్మగడ్డను ఉద్దేశించినవి కావు. నిమ్మగడ్డ కోరినట్లు నాపై పోలీసులు నిఘా పెట్టినా అభ్యంతరం లేదు. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించడం మంచిది కాదని చెప్పాం. 2 నెలల తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే వచ్చే నష్టమేంటి?. ఉద్యోగుల కోసం ఎన్నికలు వాయిదా వేయలేరా?. పంచాయతీ ఎన్నికలు వద్దని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం. మేం ఎవరికీ వ్యతిరేకం కాదు’’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment