దాదాపు పది నెలలుగా ఇన్‌చార్జి కమిషనర్‌తో నెట్టుకొస్తున్న దేవాదాయశాఖకు కమిషనర్‌ను నియమించాలని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్ణయించారు.
సాక్షి, హైదరాబాద్: దాదాపు పది నెలలుగా ఇన్‌చార్జి కమిషనర్‌తో నెట్టుకొస్తున్న దేవాదాయశాఖకు కమిషనర్‌ను నియమించాలని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ కార్యదర్శి వెంకటేశ్వరరావు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.
కమిషనర్‌గా ఆయన సరిగా దృష్టి సారించకపోవడంతో దేవాదాయశాఖలో ఫైళ్లు పేరుకుపోయినట్టు ఆ శాఖ ఉద్యోగులే పేర్కొంటున్నారు. దీంతో నిత్యం ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదులు వస్తున్నాయి. గురువారం ప్రధాన దేవాలయాల ప్రతినిధులు కొందరు స్వయంగా మంత్రి ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో గృహనిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న వెంకట్రామిరెడ్డికి తాత్కాలికంగా దేవాదాయ శాఖ కమిషనర్ బాధ్యత అప్పగిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిసింది.