indrakaran raeedy
-
బాసర అమ్మవారి కిరీటంలోని కెంపు గల్లంతు
-
బాసర అమ్మవారి కిరీటంలోని వజ్రం గల్లంతు
సాక్షి, బాసర : ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ విగ్రహం మకుటంలోని ఓ వజ్రం కనిపించకుండా పోయింది. నవరత్నాలతో కూడిన అమ్మవారి కిరీటంలో మరకతం (పచ్చ) గల్లంతయినట్లు గుర్తించిన భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం కాస్తా వివాదాస్పదంగా మారటంతో దేవదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విచారణకు ఆదేశించారు. కెంపు గల్లంతుకు సంబంధించి పూర్తి నివేదిక సమర్పించాలని మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో విగ్రహాన్ని మరో ప్రాంతానికి తీసుకొచ్చి పూజలు నిర్వహించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ అధికారులు... మరోసారి ఇంకో వివాదంలో ఇరుక్కోవడం గమనార్హం. -
వేగంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
బీర్కూర్(బాన్సువాడ) : కామారెడ్డి జిల్లాలో వేగంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర దేవాదాయ, గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా 3 వేల ఇళ్లు నిర్మాణంలో ఉండడం ప్రశంసనీయమన్నారు. మండలంలోని బైరాపూర్‌లో నిర్మించిన విఠల్ రుక్మిణి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు, గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఆయన హాజరయ్యారు. ఆయనతోపాటు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ దఫేదర్‌రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయాలను దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు, పూజారులకు వేతనాలు చెల్లిస్తోందన్నారు. అలాగే గ్రామంలో నిర్మించిన 40 డబుల్బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కామారెడ్డి జిల్లాలో 5138 ఇండ్లకు టెండర్ పూర్త యి, సుమారు 3 వేల ఇండ్లు నిర్మాణంలో ఉండడం ప్రశంసనీయమన్నారు. ముఖ్యమంత్రి ఆప్యాయంగా లక్ష్మీపుత్రుడు అని పిల్చుకునే వ్యక్తి మీ బాన్సువాడ ముద్దుబిడ్డ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో తాగు, సాగునీటికి కొరత లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నిజాంసాగర్‌కు పూర్వవైభవం వస్తుందన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్యాత్మిక భావా లు కలి గిన వ్యక్తి అన్నారు. పండరిపురం తర్వాత అంతటి అద్భుత ఆలయాన్ని బైరాపూర్‌లో నిర్మించిన ఆల య కమిటీకి మంత్రి అభినందనలు తెలిపారు. -
దేవాదాయ కమిషనర్‌గా వెంకట్రామిరెడ్డి?
సాక్షి, హైదరాబాద్: దాదాపు పది నెలలుగా ఇన్చార్జి కమిషనర్‌తో నెట్టుకొస్తున్న దేవాదాయశాఖకు కమిషనర్‌ను నియమించాలని ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్ణయించారు. ప్రస్తుతం దేవాదాయ శాఖ కార్యదర్శి వెంకటేశ్వరరావు ఇన్‌ఛార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. కమిషనర్‌గా ఆయన సరిగా దృష్టి సారించకపోవడంతో దేవాదాయశాఖలో ఫైళ్లు పేరుకుపోయినట్టు ఆ శాఖ ఉద్యోగులే పేర్కొంటున్నారు. దీంతో నిత్యం ఆ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ఫిర్యాదులు వస్తున్నాయి. గురువారం ప్రధాన దేవాలయాల ప్రతినిధులు కొందరు స్వయంగా మంత్రి ఇంటికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో గృహనిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న వెంకట్రామిరెడ్డికి తాత్కాలికంగా దేవాదాయ శాఖ కమిషనర్ బాధ్యత అప్పగిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
జిల్లా స్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా యువజన క్రీడోత్సవాలు ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యాయి. శనివారం ఈ క్రీడోత్సవాలను రాష్ట్ర అటవీ శాఖమంత్రి జోగు రామన్న, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ క్రీడోత్సవాల్లో వాలీబాల్, కబడ్డీ, అథ్లెటిక్స్‌కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో జిల్లాలోని 10 నియోజక వర్గాల పరిధిలోని క్రీడాకారులు పాల్గొనున్నారు.