
సాక్షి, అనంతపురం : హత్యారాజకీయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 36వ రోజు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చంద్రబాబును దుయ్యబట్టారు. అవినీతి, అక్రమాలకు టీడీపీ సర్కార్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. అందుకే వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు వేలాదిమంది ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment