gotluru
-
టీడీపీ నేత కీచక పర్వం.. విద్యార్ధినికి వేధింపులు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరం మండలం గొట్లూరులో టీడీపీ నేత భాస్కర్ కీచక పర్వానికి తెగబడ్డాడు. ఆటోలో వెళ్తున్న పదో తరగతి విద్యార్ధినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆటోలో నుంచి బయటకు లాక్కెళ్లి విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేశాడు. ఈ క్రమంలో బాలికకు గాయాలవ్వగా.. ఆసుపత్రికి తరలించారు.బాధితురాలి తల్లిదండ్రులు పోలసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గూడూరులో నకిలీ రైల్వే డీఎస్పీ అరెస్ట్ -
'హత్యా రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబు'
సాక్షి, అనంతపురం : హత్యారాజకీయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 36వ రోజు ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చంద్రబాబును దుయ్యబట్టారు. అవినీతి, అక్రమాలకు టీడీపీ సర్కార్ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. అందుకే వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రకు వేలాదిమంది ప్రజలు సంఘీభావం తెలుపుతున్నారని అన్నారు. -
బ్యాట్ పడితే పరుగుల వర్షమే..
హాయ్ చిన్నారులూ.. ఇక్కడ మీరు చూస్తున్న పల్లవి ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన ఆదినారాయణ, పార్వతి దంపతుల కుమార్తె. ఈమె గొందిరెడ్డిపల్లిలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇంతకు ఆమె గొప్పతనమేమంటే.. జాతీయ స్థాయిలో బాలికల క్రికెట్ జట్టులో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎలాగంటారా? జట్టు స్టార్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందిన పల్లవి ఓపెనర్‌గా బరిలో దిగితే పరుగుల వర్షం కురుస్తుంది. అంతేకాదు వికెట్ కీపర్‌గాను అద్భుత ప్రతిభను చాటుకుంటోంది. అసలు ఇంతటి ప్రతిభాపాటవాలు ఎలా సిద్ధించాయి అనుకుంటున్నారు కదూ!.. అసలు విషయమేమంటే... 7వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆమె క్రికెట్‌పై మక్కువతో ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. ఆమెలోని క్రీడాకారిణిని గుర్తించిన ఆర్డీటీ సంస్థ అకాడమీలో శిక్షణకు చేర్చుకుంది. అయితే ప్రతి రోజూ గొట్లూరు నుంచి అనంతపురం రావడం ఇబ్బందికరంగా మారడంతో కూతురు కోసం తండ్రి అనంతపురం నగర శివారుకు కుటుంబాన్ని మార్చాడు. అప్పటి నుంచి రోజూ ఆర్డీటీలో ఆమె క్రికెట్ శిక్షణ పొందుతూ వచ్చింది. ఇప్పటి వరకూ జిల్లా స్థాయి పోటీల్లో 12 సార్లు ఎంపికైంది. జోన్ స్థాయిలో 90 పరుగులతో అజేయంగా నిలిచింది. విజయనగరం, గుంటూరు ప్రాంతాల్లో జరిగిన సీనియర్ జోన్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. ఇక స్కూల్‌గేమ్స్‌లో జాతీయ స్థాయిలో రాణించింది. ఎలాగైనా భారత మహిళా క్రికెట్ జట్టులో స్థానం సాధించాలనే తపనతో ఆర్డీటీ కోచ్ యుగంధర్‌రెడ్డి వద్ద ప్రతిరోజూ ఆమె సాధన చేస్తోంది. సో... పల్లవికి మనందరమూ బెస్ట్ ఆఫ్ లక్ చెబుదామా.. - అనంతపురం సప్తగిరి సర్కిల్ -
మద్యం మత్తులో రోడ్డు ప్రమాదం
- ఇద్దరి దుర్మరణం - మరొకరికి గాయాలు ధర్మవరం అర్బన్ : మండలంలోని గొట్లూరు గ్రామం వంక వద్ద శుక్రవారం అర్ధరాత్రి 2గంటల సమయంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని కేపీటీ వీధికి చెందిన గజ్జెల బాలగంగాధర్(27), శివానగర్‌కు చెందిన పన్నూరు నారాయణరెడ్డి(28), దిగువగేరికి చెందిన వి.రవికుమార్ మద్యం సేవించి అర్థర్రాతి ద్విచక్రవాహనంలో బయల్దేరారు. గొట్లూరు వంక వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుకవైపు నుంచి ఢీకొట్టి కింద పడిపోయారు. ట్రాక్టర్ వాళ్లు ఇది గమనించకుండా వెళ్లిపోయారు. దాదాపు గంట తర్వాత అటువైపు వస్తున్న వాహనదారులు గమనించేసరికి బాలగంగాధర్, నారాయణరెడ్డి మృతి చెందారు. తీవ్రంగా గాయపడి ఉన్న రవికుమార్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యప్ప మాలధారుడిపై దాడి
ధర్మవరం రూరల్ : గొట్లూరులో సోమవారం రాత్రి శ్రీనివాసులు అనే అయ్యప్ప మాలధారుడిపై అదే గ్రామానికి చెందిన జగన్మోహన్రెడ్డి మద్యం మత్తులో దాడి చేశాడు. మాలను కూడా తెంచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. -
హైఓల్టేజీతో కాలిన విద్యుత్ పరికరాలు
ధర్మవరం రూరల్ : మండల పరిధిలోని గొట్లూరులో శనివారం గహాలకు హైఓల్టేజీతో విద్యుత్ పరికరాలు ధ్వంసం అయ్యాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సాధారణంగా గహాలకు 200 నుంచి 220 దాకా ఓల్టేజీ ఉంటుంది. అయితే ఏకంగా 500 ఓల్టేజీ రావడంతో ఫ్రిజ్‌లు, కూలర్లు, సెల్ఫోన్లు, టీవీలు తదితర వస్తువులు కాలిపోయాయి. సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు చెప్తున్నారు.