ధరూరు, న్యూస్‌లైన్ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు బుధవారం ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారి కృష్ణయ్య తెలిపారు. మంగళవారం రాత్రి ప్రాజెక్టుకు 59, 730 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, బుధవారం రాత్రి 7.30 గంటల వరకు జూరాల ప్రాజెక్టుకు 53, 947 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. దీంతో ప్రాజెక్టు ఆరు క్రస్టు గేట్లను ఒక మీటరు, రెండు క్రస్టు గేట్లను అర మీటర్ చొప్పున ఎత్తి 29,212 క్యూసెక్కుల నీటినినదిలోకి విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ కేంద్రంలోని మూడు యూనిట్ల విద్యుదుత్పత్తి నిమిత్తం 24వేల క్యూసెక్కులు, కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటి నిమిత్తం 1100 క్యూసెక్కుల నీరు, మొత్తం ప్రాజెక్టు నుంచి 54, 312 క్యూసెక్కుల నీటిని దిగువ నదిలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఎగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టు నీటి మట్టం 492.110 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 12143 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, విద్యుదుత్పత్తి యూనిట్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటి మట్టం 519.400 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లేవని విద్యుదుత్పత్తి యూనిట్ల ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తి...
జెన్‌కో జలవిద్యుత్ కేంద్రంలోని మూడు యూనిట్లలో రెండు రోజులుగా నిరవధికంగా విద్యుదుత్పత్తి కొనసాగుతున్న జెన్‌కో అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం వరకు జలవిద్యుత్ కేంద్రంలోని 1,4 యూనిట్లు కొనసాగుతుండగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆరవ యూనిట్ సాంకేతిక లోపాలను సరిచేసుకొని అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మూడు యూనిట్లలో పూర్తి స్థాయిలో 117 మెగా వాట్ల విద్యుదుత్పత్తి అవుతున్నట్లు అధికారులు వివరించారు.
జూరాలకు స్వల్పంగా తగ్గిన ఇన్‌ఫ్లో
Published Thu, Sep 12 2013 2:18 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement