జూరాల : కర్ణాటక రాష్ట్రం నుంచి జూరాల ప్రాజెక్టుకు బుధవారం 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నాలుగు టరై్బన్లలో విద్యుదుత్పత్తిని కొనసాగించి 28వేల క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. వీటిద్వారా 130మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు.
జూరాలలో 130మెగావాట్ల విద్యుదుత్పత్తి
Published Thu, Aug 18 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
జూరాల : కర్ణాటక రాష్ట్రం నుంచి జూరాల ప్రాజెక్టుకు బుధవారం 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టులో నాలుగు టరై్బన్లలో విద్యుదుత్పత్తిని కొనసాగించి 28వేల క్యూసెక్కుల వరదను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. వీటిద్వారా 130మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టుకు పరివాహక ప్రాంతం నుంచి కేవలం 32,662క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటినిల్వ 129.72టీఎంసీలు కాగా 128.19 టీఎంసీలను కొనసాగిస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 22,920క్యూసెక్కులను దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64టీఎంసీలు కాగా 37.22టీఎంసీలను ఉంచుతున్నారు. పై నుంచి 22,989క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద వస్తుండగా ప్రాజెక్టులో విద్యుదుత్పత్తితోపాటు రెండు క్రస్టుగేట్లను తెరిచి 19,030క్యూసెక్కుల వరదను జూరాల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
Advertisement
Advertisement