గద్వాల టౌన్ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ఈ సారి రికార్డు స్థాయిలో అధికారులు జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు దిగువన ఉన్న లోయర్ జూరాలలోనూ కృష్ణానదికి జూలై నెలాఖరు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో రికార్డు స్థాయిలో 613.99 మిలియన్ యూనిట్ల జల విద్యుదుత్పత్తిని సాధించారు. 2008లో జూరాల జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇక్కడ 270 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి రికార్డుగా ఉంది.
అలాగే గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమైన లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 220 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తే రికార్డుగా ఉంది. తాజాగా ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ ఇప్పటి వరకు ఉన్న రికార్డులను అధిగమించి విద్యుదుత్పత్తిని సాధించారు. జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఈనెల 12వ తేదీ వరకు 310.18 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని, లోయర్ జూరాలలలో 303.81 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించారు.
రికార్డు సాధించాం..
జూరాల, లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయి లో ఉత్పత్తిని సాధించాం. కృష్ణానది లో జూలై నెలాఖరు నుంచి వరద కొనసాగుతుండడం వల్లే ఇది సాధ్యమైంది. టర్బైన్లలో ఇబ్బందులు తలెత్తకుండా విద్యుదుత్పత్తిని చేయడంలో జెన్ కో ఇంజనీర్లు చేసిన కృషి అభినందనీయం. వరద కొనసాగినన్ని రోజు లు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తాం.
– సురేశ్, చీఫ్ ఇంజనీర్, టీఎస్‌జెన్ కో
Comments
Please login to add a commentAdd a comment