Hydro power plant
-
570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం
అదానీ గ్రూప్ భూటాన్‌లో 570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు తాజాగా భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే, గౌతమ్ అదానీలు ఒప్పందంపై సంతకాలు చేశారు.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. భూటాన్‌లోని చుఖా ప్రావిన్స్‌లో 570 మెగావాట్ల జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ దేశంలోని డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ ఆధ్వర్యంలో జరుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధిని అదానీ ప్రశంసించారు. భూటాన్‌లో హైడ్రోపవర్, ఇతర ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్నగౌతమ్అదానీ తన ఎక్స్‌ఖాతాలో ఈ పర్యటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్గేతో సమావేశంకావడం చాలా సంతోషంగా ఉంది. చుఖా ప్రావిన్స్‌లో 570 మెగావాట్ల గ్రీన్ జలవిద్యుత్తు ప్రాజెక్ట్ ఏర్పాటుకు డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందం జరిగింది. అనంతరం భూటాన్ కింగ్ జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో సమావేశమయ్యాం. మౌలికసదుపాయాలు అభివృద్ధి చేయడానికి భూటాన్ చేస్తున్న కృషి అభినందనీయం’ అన్నారు. -
రాష్ట్రంలో మరిన్ని పీఎస్పీ ప్లాంట్లకు అవకాశం.. అసలు అవేంటో తెలుసా..
తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ విద్యుత్(పీఎస్పీ) ప్లాంట్లు నిర్మించేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ మేరకు తెహ్రీ జలవిద్యుత్ అభివృద్ధి సంస్థ(టీహెచ్‌డీసీ) సర్వే అందుకు సంబంధించిన అంశాలను వెల్లడించింది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం..మొత్తం 9 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం ఉన్న పీఎస్పీలను నిర్మించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అవకాశమిస్తే ప్లాంట్ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక అందజేస్తామని టీహెచ్‌డీసీ ఇండియా లిమిటెడ్ తెలిపింది. ఈ సంస్థ అధికారులు ఇటీవల హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో) అధికారులతో చర్చించినట్లు తెలిసింది. శ్రీశైలం డ్యాం దిగువన 1200 మెగావాట్లు, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ఆధారంగా 900 మెగావాట్లు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్ల వద్ద మరో 2 వేల మెగావాట్లు, రాష్ట్రంలోని ఇతర జలాశయాల వద్ద మిగిలిన ప్లాంట్లను నిర్మించవచ్చని ప్రాథమిక సర్వేలో తెలిపింది. తెలంగాణలో ఈ ప్లాంట్లు నిర్మించేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. జెన్కోకు శ్రీశైలం, నాగార్జునసాగర్ వద్ద నిర్మాణానికి మంచి అవకాశాలున్నాయని తెహ్రీ సంస్థ తెలిపింది. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. పీఎస్పీ అంటే.. పంప్డ్ స్టోరేజ్ హైడ్రోపవర్ అనేది ఒక రకమైన జల విద్యుత్ శక్తి నిల్వ ప్రాజెక్టు. దీనిని వేర్వేరు ఎత్తులలో ఉన్న రెండు నీటి రిజర్వాయర్లపై నిర్మిస్తారు. ఈ ప్లాంట్లు సంప్రదాయ జల విద్యుత్ ప్లాంట్లలానే పనిచేస్తాయి. వీటికి అదనంగా అదే నీటిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకునే సామర్థ్యం ఉంటుంది. అంతేకాదు పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లలో పగటిపూట చార్జింగ్ సౌర ఫలకల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. రాత్రి వేళ జలాశయం ద్వారా ఎగువ రిజర్వాయర్ నుంచి దిగువ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేయడం వల్ల టర్బైన్ కిందకి కదిలి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఒక సారి నిర్మించిన ప్రాజెక్టు ఎనభై ఏళ్ల వరకూ పనిచేస్తుంది. 1890 కాలంలో ఇటలీ, స్విట్జర్లాండ్‌లో మొదలైన పీఎస్పీ సాంకేతికత 1930లో యునైటెడ్ స్టేట్స్లో అడుగుపెట్టింది. ఇప్పుడిది ప్రపంచమంతా విస్తరించింది. తాజాగా మన దేశంలో పీఎస్పీల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అవతరించింది. ఇదీ చదవండి: ఐటీ ఉద్యోగం.. వర్క్‌ఫ్రం హాస్పిటల్! ఏపీలో ఇలా.. దేశం మొత్తం మీద 2030–31 నాటికి 18.8 గిగావాట్ల సామర్థ్యం ఉన్న పీఎస్పీల అవసరం ఉందని కేంద్ర ఇంధన శాఖ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఎగువ సీలేరులో 1,350 మెగావాట్ల సామర్థ్యంతో పీఎస్పీ నిర్మాణానికి కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) అనుమతి కూడా ఇచ్చింది. ప్రైవేటు రంగంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్ కో గ్రూప్ 1,680 మెగావాట్ల ప్రాజెక్టు నిర్మిస్తోంది. -
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి
ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండలు..ఆకట్టుకునే జలపాతాలు.. ప్రకృతి సోయగాల మధ్య పురుడుపోసుకున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఎన్నో ఏళ్ల తరువాత పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఈ కేంద్రంలో జనరేటర్లన్నీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు రూ.500 కోట్లు వెచ్చించాయి. ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిలో దూసుకుపోతోంది. ఇక్కడ ఆరు జనరేటర్లు సేవలందిస్తున్నాయి. 1, 2, 3 జనరేటర్లతో 51, 4,5,6 జనరేటర్లతో 69 చొప్పున 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సుమారు 65 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన ఈ విద్యుత్ కేంద్రంలో పురాతన యంత్రాలు కావడంతో గత పదేళ్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసిన దాఖలాలు లేవు. తరచూ సాంకేతిక సమస్యలతో అధికారులు, సిబ్బంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేవారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల నుంచి తప్పించుకొని ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు పూర్తి స్థాయిలో విద్యుత్ కేంద్రంపై దృష్టి సారించి, శత శాతం విద్యుత్ ఉత్పత్తిని చేయగలిగారు. నాగార్జున సాగర్, సీలేరు వంటి పలు విద్యుత్ కేంద్రాలు కేవలం పీక్‌లోడ్ అవర్స్‌లో మాత్రమే ఉత్పాదన చేస్తుండగా మాచ్‌ఖండ్ మాత్రం ఏడాది పొడవునా ఉత్పత్తి చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం విద్యుత్ కేంద్రంలో ఆరు జనరేటర్లతో 120 మోగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. డుడుమ, జోలాపుట్టు ప్రధాన ఆధారం మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంంద్రంలో ఉత్పత్తికి నీరందించేందుకు ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ, జోలాపుట్టు జలశయాలు ప్రధాన ఆధారం. డుడుమ నీటి సామర్థ్యం 2590, జోలాపుట్టు నీటి సామర్థ్యం 2750 అడుగులు. వీటికి మత్స్యగెడ్డ నీరే దిక్కు. జి. మాడుగుల మండలం గెమ్మెలి నుంచి మొదలై మత్స్యగుండం మీదుగా పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఈ గెడ్డ విస్తరించింది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటిని ఏడాది పొడవునా రెండు జలశయాల్లో నిల్వ చేస్తారు. డుడుమ కెనాల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తుంటారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదల అయినా నీరు తొలుత అప్పర్ సీలేరు వద్ద 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అక్కడ నుంచి ఆంధ్ర భాగస్వామ్యం మొదలై డొంకరాయి వద్ద 25 మెగావాట్లు, లోయర్ సీలేరు వద్ద 460 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసిన తరువాత మిగతా నీరు గోదావరిలో కలుస్తోంది రూ.500 కోట్లతో ఆధునికీకరణ.. 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న జల విద్యుత్ కేంద్రంలో కాలం చెల్లిన జనరేటర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మరమ్మతుల పేరిట ఏటా రూ. కోట్లు ఖర్చవుతున్నాయి. ప్రతీ జలవిద్యుత్ కేంద్రంలో జనరేటర్లు 25 ఏళ్లు వరకు మాత్రమే పని చేస్తాయి. కాని ఇక్కడ జనరేటర్లు 60 ఏళ్లు పైబడినా సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఆంధ్ర–ఒడిశా ప్రభుత్వాలు మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఆధునికీకరణకు నిర్ణయించాయి. ఇందుకు రూ. 500 కోట్లు కేటాయించాయి. విద్యుత్ కేంద్రంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి నివేదిక తయారీ బాధ్యత టాటా ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకు ఏపీజెన్కో వర్గాలు అప్పగించాయి. దీంతో అదే సంస్థకు చెందిన 14 మందితో కూడిన బృందం గత ఏడాది డిశంబర్ నెలలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించింది. జనరేటర్లు, టర్బైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్‌యార్డులు, భవనాల స్థితిగతులను పరిశీలించింది. వాటికి ఆయువు (ఎనాలసిస్) పరీక్షలు నిర్వహించింది. దీనిపై నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు కన్సల్టెన్సీ బృందం అందజేసింది. పూర్తిస్థాయిలో ఉత్పాదన శుభపరిణామం విద్యుత్ ఉత్పత్తిలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పనితీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తరువాత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన జరగడం శుభపరిణామం. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తితో పోలిస్తే మాచ్‌ఖండ్ విద్యుత్ ఉత్పత్తి తక్కువే అయినా వాటికి ధీటుగా ఉత్పాదకత ఉంటుంది. ఆధునికీకరణ కోసం ఇరు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ఈ పనులు పూర్తయితే మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి ఎంతో మేలు జరుగుతుంది. – కేవీ నాగేశ్వరరావు, సీనియర్ ఇంజినీర్, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
శ్రీశైలం డ్యాం రెండుగేట్ల ఎత్తివేత
శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల)/ సత్రశాల(రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో ఆదివారం రాత్రి రెండు గేట్లను ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వరద ప్రవాహం పెరగడం, డ్యాం నీటిమట్టం 884.40 అడుగులకు చేరుకోవడంతో రాత్రి 8.30 గంటల సమయంలో రెండు క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,600 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల ప్రాజెక్టులు, హంద్రీనది నుంచి 2,02,265 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 56,684 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.461 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.693 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా హంద్రీ–నీవా సుజలస్రవంతికి నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 211.4385 టీఎంసీల నీరునిల్వ ఉంది. సాగర్‌లో 311.1486 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి భారీగా నీరు వస్తుండటంతో నాగార్జునసాగర్ నీటిమట్టం పెరుగుతోంది. సాగర్‌లో 589.70 అడుగుల మట్టంలో 311.1486 టీఎంసీల నీరు ఉంది. కుడికాలువకు 9,217 క్యూసెక్కులు, ఎడమకాలువకు 8,718 క్యూసెక్కులు, 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16,138, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 28,379, ఎస్ఎల్బీసీకి 2,400, వరదకాలువకి 400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో సాగర్ నుంచి మొత్తం ఔట్‌ఫ్లో 65,252 క్యూసెక్కులుగా ఉంది. నాగార్జునసాగర్ నుంచి టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టుకు 44,030 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ప్రాజెక్ట్ డీఈ దాసరి రామకృష్ణ, ఏడీఈ నర్సింహారావు ఆదివారం తెలిపారు. టెయిల్‌పాండ్ ప్రాజెక్టు 4 క్రస్ట్ గేట్ల నుంచి, విద్యుదుత్పత్తి ద్వారా మొత్తం 44,783 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. -
శ్రీశైలంలో ఆగని తెలంగాణ దందా
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి చేయకూడదంటూ కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా తుంగలో తొక్కుతోంది. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేయకూడదని కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తోంది. నీటి సంవత్సరం ప్రారంభం నుంచే (జూన్ 1 నుంచి) ఎడమ గట్టు కేంద్రంలో అక్రమంగా నీటిని వాడుకుంటూ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన అటు తెలంగాణ, ఇటు ఏపీకి సంబంధించి తక్షణ సాగు, తాగునీటి అవసరాలు లేవు. ఎగువ నుంచి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన అవసరమూ లేదు. కానీ.. తెలంగాణ సర్కార్ అదేమీ పట్టకుండా ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటోంది. దీంతో దిగువకు వదిలేసిన జలాలు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. కొద్దిపాటి నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేయగా, మిగులుగా ఉన్న నీటినంతటినీ గేట్లు ఎత్తేసి దిగువకు వృథాగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా జూన్ 1 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 162.76 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం. వాటా నీటిని దక్కనివ్వకుండా.. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 12న వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఆ రోజున 884.4 అడుగుల్లో 211.96 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అదే రోజున సాగర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయిలో 589.5 అడుగుల్లో 311 టీఎంసీల నిల్వ ఉంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 878.40 అడుగుల్లో 180.28 టీఎంసీలకు తగ్గిపోయింది. రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాలను వాడుకోనివ్వకుండా చేయడానికే తెలంగాణ సర్కార్ కావాల్సిగా విద్యుదుత్పత్తి చేస్తోందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచీ ఇదే తీరు ► శ్రీశైలం ప్రాజెక్టులో నీటి సంవత్సరం ప్రారంభమైన రెండో రోజే అంటే జూన్ 2న 808.5 అడుగుల్లో 33.43 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు. ప్రాజెక్టు ఆపరేషనల్ ప్రొటోకాల్ ప్రకారం కనీస నీటి మట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేయకూడదు. ► కానీ.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే దిగువన ఎలాంటి సాగు, తాగునీటి అవసరాలు లేకపోయినా జూన్ 2న తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. తెలంగాణ సర్కార్ అక్రమ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ► ‘శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు నీటిని తరలించవచ్చు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు.. చెన్నైకి తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ సర్కార్ తీరుతో ప్రాజెక్టులో నీటి నిల్వ 854 అడుగుల కంటే తగ్గిపోతే, కేటాయింపులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులకు నీటిని అందించలేము’ అని కేంద్రానికి, కృష్ణా బోర్డుకు స్పష్టంగా వివరించింది. ► దీంతో తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డులు ఆదేశించాయి. అయినా సరే.. తెలంగాణ సర్కార్ ఖాతరు చేయకుండా రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ► ఈ పరిస్థితిలో న్యాయ పోరాటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 27న జరిగే కృష్ణా బోర్డు సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించింది. -
జూరాలలో రికార్డు స్థాయి విద్యుదుత్పత్తి
గద్వాల టౌన్ : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ఈ సారి రికార్డు స్థాయిలో అధికారులు జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రంతో పాటు దిగువన ఉన్న లోయర్ జూరాలలోనూ కృష్ణానదికి జూలై నెలాఖరు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో రికార్డు స్థాయిలో 613.99 మిలియన్ యూనిట్ల జల విద్యుదుత్పత్తిని సాధించారు. 2008లో జూరాల జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఇక్కడ 270 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి రికార్డుగా ఉంది. అలాగే గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభమైన లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రంలో 220 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తే రికార్డుగా ఉంది. తాజాగా ఈ రెండు ప్రాజెక్టుల్లోనూ ఇప్పటి వరకు ఉన్న రికార్డులను అధిగమించి విద్యుదుత్పత్తిని సాధించారు. జూరాల జలవిద్యుత్ కేంద్రంలో ఈనెల 12వ తేదీ వరకు 310.18 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని, లోయర్ జూరాలలలో 303.81 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని సాధించారు. రికార్డు సాధించాం.. జూరాల, లోయర్ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో ఎన్నడూ లేని విధంగా ఈసారి రికార్డు స్థాయి లో ఉత్పత్తిని సాధించాం. కృష్ణానది లో జూలై నెలాఖరు నుంచి వరద కొనసాగుతుండడం వల్లే ఇది సాధ్యమైంది. టర్బైన్లలో ఇబ్బందులు తలెత్తకుండా విద్యుదుత్పత్తిని చేయడంలో జెన్ కో ఇంజనీర్లు చేసిన కృషి అభినందనీయం. వరద కొనసాగినన్ని రోజు లు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తాం. – సురేశ్, చీఫ్ ఇంజనీర్, టీఎస్‌జెన్ కో -
'ఏపీజెన్కో అధికారులు వేధిస్తున్నారు'
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల అధికారుల మధ్య మరో వివాదం తలెత్తింది. సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో పనిచేస్తున్న 21 మంది తెలంగాణ ఇంజినీర్లు తమను ఏపీ జెన్కో అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమపై జెన్కో అధికారులు పరిమితికి మించిన పనిభారం మోపుతున్నారని పేర్కొటూ.. మూడు రోజులుగా తెలంగాణ ఇంజనీర్లు విధులకు హాజరవడం మానేశారు. -
ఏడాదికో విషాదం
ఇది ఐదో పడవ ప్రమాదం నిత్యం భయం గుప్పెట్లో ప్రయాణం ఇరు రాష్ట్ర అధికారులు స్పందించాలి సీలేరు: సీలేరు జలాశయం దిగువభాగాన ఉన్న గిరిజన గ్రామాల్లోని వారు ఏటా విషాదానికి గురవుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి జల విద్యుత్ కేంద్రానికి సమీపంలో వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న వీరు ఓ పడవ ప్రమాదంలో కన్నీరు ఆరక ముందే మరో ప్రమాదానికి గురవుతున్నారు. కాకులు దూరని కారడవిలో.. క్రూర మృగాలతో పాటు అటు మావోయిస్టులు, ఇటు పోలీసుల మధ్య బతుకుతున్న ఆదివాసీలకు పడవ ప్రయాణమే ఆధారం. అగ్గిపెట్టి కొనాలన్నా అవతల నుంచి ఇవతలకు నాటు పడవలపై ప్రయాణం తప్పదు. రోడ్డు మార్గాన రావాలంటే వందల మైళ్లు ప్రయాణించాలి. అలా కాకుండా తొందరగా వెళ్లాలన్న ఆశతో నాటు పడవలను ఆశ్రయించి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. బుధవారం కూడా ఇలాగే జరిగింది. తూర్పుగోదావరి సరిహద్దు సీలేరు నది ప్రవాహంలో ఒడిశా గిరిజనులు ప్రయాణిస్తున్న నాటు పడవ బోల్తా పడింది. ఒడిశా మల్కన్‌గిరి జిల్లా కులమనూరు పంచాయతీకి చెందిన ముగ్గురు గిరిజనులు గల్లంతయ్యారు. మరో వ్యక్తి ఈత కొట్టుకొని ఒడ్డుకు చేరుకున్నాడు. ఏటా ఈ పరిస్థితిని గుర్తించిన ఒడిశా ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఒక్కో పంచాయతీకి మోటారు బోట్లను మంజూరు చేసింది. ప్రస్తుతం అవి చెడిపోవడంతో గత్యంతరం లేక నాటు పడవలనే ఆశ్రయిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో ఏడాదికి ఒకటి చొప్పున ఈ పడవలు మునిగి 10 మందికిపైగా గిరిజనులు చనిపోయారు. ఈ పరిస్థితి నుంచి గిరిజనులు బయట పడాలంటే ఇరు రాష్ట్రాల అధికారులు ఉమ్మడిగా స్పందించి వంతెన సదుపాయం కల్పిస్తేనే తప్పా ఈ ప్రమాదాలకు స్వస్తి ఉండదన్న వాదన వ్యక్తమవుతోంది. -
బోర్డు పైనే భారం!
* రెండో రోజూ తెలంగాణ జలవిద్యుదుత్పత్తి * ఉత్తర్వుల ఉల్లంఘనపై కృష్ణా బోర్డే చర్యలు చేపట్టాలంటున్న ఏపీ సాక్షి, హైదరాబాద్/శ్రీశైలం ప్రాజెక్టు: తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీజలాల బోర్డు ఉత్తర్వులను ఉల్లంఘించి ఆదివారం కూడా శ్రీశైలం ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి కొనసాగించింది. బోర్డు ఉత్తర్వులను ధిక్కరించి రెండురోజులుగా విద్యుదుత్పత్తి చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయకుండా ఏపీ ప్రభుత్వం మౌనంగా వ్యహరిస్తోంది. ఉత్తర్వులపై 15న సమీక్షించనున్న బోర్డు శ్రీశైలం నీటిపై తమ ఉత్తర్వుల అమలు స్థితిగతులను ఈనెల 15వతేదీన సమీక్షించాలని బోర్డు నిర్ణయించిన విషయం విదితమే. ఉత్తర్వుల ఉల్లంఘనలపై చర్యలు చేపట్టకుంటే బోర్డును నిలదీయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. మరోవైపు బోర్డు ఉత్తర్వుల్ని ధిక్కరించి తెలంగాణ శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో శనివారం నుంచి విద్యుత్ ఉత్పాదన కొనసాగిస్తోంది. నవంబర్ 2వతేదీ తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయరాదని, అక్టోబర్ 31 నుంచి 2వ తేదీ వరకు మూడు టీఎంసీలకు మించి నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించడానికి వీల్లేదంటూ కృష్ణా బోర్డు 31వతేదీన ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే. అయితే శనివారం నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 1.12 టీఎంసీల నీటిని వినియోగించుకుని 3.767 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు 420 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు 240 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 13,480 క్యూసెక్కుల నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. జలాశయం నుంచి హంద్రీనీవా సుజల స్రవంతికి 1,350 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 700 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. జలాశయంలో 857.60 అడుగుల మట్టంలో 98.9024 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వాస్తవ పరిస్థితులపైనే ఏపీ సర్కారు లేఖ ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం మేరకు ఏర్పాటైన కృష్ణా బోర్డుకు తన ఉత్తర్వులు అమలు చేయించడానికి అవసరమైన అన్ని అధికారాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. ఉత్తర్వులు అమలు చేయించలేని పరిస్థితి ఉంటే బోర్డు ఎందుకు? అన్ని విషయాలూ బోర్డుకు తెలుసు. ప్రత్యేకంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ బోర్డుకు ప్రభుత్వం శుక్రవారం లేఖరాసింది. అందులో కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొనలేదు’ అని నీటి పారుదలశాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.