అదానీ గ్రూప్ భూటాన్‌లో 570 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు తాజాగా భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్‌గే, గౌతమ్ అదానీలు ఒప్పందంపై సంతకాలు చేశారు.
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. భూటాన్‌లోని చుఖా ప్రావిన్స్‌లో 570 మెగావాట్ల జలవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఆ దేశంలోని డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్ ఆధ్వర్యంలో జరుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధిని అదానీ ప్రశంసించారు. భూటాన్‌లో హైడ్రోపవర్, ఇతర ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ప్రపంచాన్ని పరిచయం చేసిన నాన్న
గౌతమ్‌అదానీ తన ఎక్స్‌ఖాతాలో ఈ పర్యటనకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు. ‘భూటాన్ ప్రధానమంత్రి దాషో షెరింగ్ టోబ్‌గేతో సమావేశంకావడం చాలా సంతోషంగా ఉంది. చుఖా ప్రావిన్స్‌లో 570 మెగావాట్ల గ్రీన్ జలవిద్యుత్తు ప్రాజెక్ట్ ఏర్పాటుకు డ్రక్ గ్రీన్ పవర్ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందం జరిగింది. అనంతరం భూటాన్ కింగ్ జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో సమావేశమయ్యాం. మౌలికసదుపాయాలు అభివృద్ధి చేయడానికి భూటాన్ చేస్తున్న కృషి అభినందనీయం’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment