
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది.
విశాఖ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. వర్షాల ప్రభావంతో శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం నీటిమట్టం 884.80 అడుగులకు చేరడంతో 5 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు కు నీరు విడుదల చేస్తున్నారు.
నిన్న లక్ష 39 వేల 685 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. జూరాల, తుంగభద్రల నుంచి 2 లక్షల ఒక వెయ్యి 462 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. విద్యుత్ ఉత్పాదన అనంతరం సాగర్‌కు నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 213.8 టీఎంసీలు కాగా జలాశయం నీటిమట్టం 884.70 అడుగులుగా నమోదైంది. మరోవైపు కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా 33.298 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పాదన జరిగిందని అధికారులు తెలిపారు.
శ్రీశైలం నుంచి విడుదలవుతున్న నీటితో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరుకోవడంతో... 16గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 2లక్షల 9వేల క్యూసెక్కులు... ఔట్ ఫ్లో లక్షా 86వేల క్యూసెక్కులు ఉంది.