Telangana News: 'జూరాల' కు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
Sakshi News home page

'జూరాల' కు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..

Published Mon, Sep 11 2023 12:58 AM | Last Updated on Mon, Sep 11 2023 1:54 PM

- - Sakshi

జెన్‌కో జల విద్యుత్‌ కేంద్రానికి వెళ్తున్న నీరు

మహబూబ్‌నగర్‌: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో మరింత తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 16,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 10వేలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు.

నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి లిఫ్టు–1 వద్ద ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఆవిరి రూపంలో 94, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 738, ఆర్డీఎస్‌ లింక్‌ కెనాల్‌కు 60, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 8,737 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.929 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 115.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 25.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10,899 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఎలాంటి అవుట్‌ ఫ్లో లేదని అధికారులు తెలిపారు.

స్వల్పంగా విద్యుదుత్పత్తి..
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో స్వల్పంగా ఉత్పత్తి కొనసాగుతుంది. ఆదివారం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ రామసుబ్బారెడ్డి, డీఈ పవన్‌కుమార్‌ తెలిపారు. ఎగువలో ఒక యూనిద్‌ ద్వారా 39 మెగావాట్లు, 80.437 ఎం.యూ దిగువలో ఒక యూనిట్‌ ద్వారా 40 మెగావాట్లు, 86.813 ఎం.యూ విద్యుదుత్పత్తిని చేపడుతున్నామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 167.250 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.

మదనాపురం
మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు వచ్చి చేరింది.

శ్రీశైలంలో 854.7 అడుగుల నీటిమట్టం..
శ్రీశైలం జలాశయంలో ఆదివారం 854.7 అడుగుల వద్ద 91.1 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 5,385 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 1,583, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు 1,455, రేగుమాన్‌గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 800 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 197 క్యూసెక్కుల నీరు ఆవిరైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement