water realease
-
'జూరాల' కు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో..
మహబూబ్‌నగర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో మరింత తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం 7 గంటల వరకు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 16,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో 10వేలకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన గుడ్డెందొడ్డి లిఫ్టు–1 వద్ద ఒక పంపు ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 750, ఆవిరి రూపంలో 94, ఎడమ కాల్వకు 920, కుడి కాల్వకు 738, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 60, సమాంతర కాల్వకు 850, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 8,737 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.929 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 115.058 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి 11వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 25.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 10,899 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఎలాంటి అవుట్ ఫ్లో లేదని అధికారులు తెలిపారు. స్వల్పంగా విద్యుదుత్పత్తి.. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో స్వల్పంగా ఉత్పత్తి కొనసాగుతుంది. ఆదివారం 2 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ రామసుబ్బారెడ్డి, డీఈ పవన్‌కుమార్ తెలిపారు. ఎగువలో ఒక యూనిద్ ద్వారా 39 మెగావాట్లు, 80.437 ఎం.యూ దిగువలో ఒక యూనిట్ ద్వారా 40 మెగావాట్లు, 86.813 ఎం.యూ విద్యుదుత్పత్తిని చేపడుతున్నామన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 167.250 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు. మదనాపురం మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం నాటికి పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకు వచ్చి చేరింది. శ్రీశైలంలో 854.7 అడుగుల నీటిమట్టం.. శ్రీశైలం జలాశయంలో ఆదివారం 854.7 అడుగుల వద్ద 91.1 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాలలో విద్యుదుత్పత్తి చేస్తూ 5,385 క్యూసెక్కుల నీటిని శ్రీశైలంకు వదులుతున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 1,583, మల్యాల ఎత్తిపోతల నుంచి హెచ్ఎన్ఎస్ఎస్కు 1,455, రేగుమాన్గడ్డ నుంచి ఎంజీకేఎల్‌ఐకు 800 క్యూసెక్కుల నీటిని వదిలారు. జలాశయంలో 197 క్యూసెక్కుల నీరు ఆవిరైంది. -
దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తాం..
సాక్షి, నెల్లూరు: సోమశిల హైలెవల్ కెనాల్ రెండో ఫేజ్ పనులు త్వరలోనే పూర్తి చేసి.. దశాబ్దాల ప్రజల కలను నిజం చేస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో వానలు లేవు.. నీళ్లు లేవని.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు. జలవనరుల శాఖ మంత్రిగా మన జిల్లాకు చెందిన అనిల్‌కుమార్ యాదవ్ ఉండటం సంతోషకరమన్నారు. సోమశిల నుంచి నీటిని విడుదల చేసిన మంత్రులు.. సోమశిల జలాశయం నుంచి కండలేరు జలాశయానికి మంత్రులు అనిల్‌కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి మంగళవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వర ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు పాల్గొన్నారు. -
సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల
నాగార్జునసాగర్ : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఎడమ కాలువకు మంత్రి జగదీశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. 50 రోజుల్లో ఆరు విడతలుగా నీటిని విడుదల చేస్నునట్లు తెలిపారు. నీటిని వృధా కాకుండా వాడుకోవాలంటూ రైతులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎఏంఆర్ ప్రాజెక్టు పరిధిలోని చెరువులు నింపేందుకు నీటిని విడుదల చేసినట్లు మంత్రి తెలియజేశారు. -
గోదావరికి మళ్లీ వరద పోటు
కొవ్వూరు : గోదావరికి వరద మళ్లీ పొటెత్తింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు భద్రాచలంలో నీటిమట్టం భారీగా పెరుగుతోంది. ఆదివారం సాయంత్రం నీటిమట్టం 38.20 అడుగులకు చే రింది. దీంతో దిగువన ధవళేశ్వరంలో నీటిమట్టం పెరుగుతుంది. ఆనకట్ట వద్దకి 6,35,171 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీనిలో ఉభయగోదావరి జిల్లాల్లో మూడు డెల్టాలకు 12,100 క్యూసెక్కుల నీరు విడిచిపెడుతున్నారు. ఆనకట్టకి ఉన్న 175 గేట్లను మీటరున్నర ఎత్తు లేపి 6,23,071 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. జిల్లాలోని పశ్చిమ డెల్టాకి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారానికి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. -
సాగర్ కుడికాల్వకు నీటి విడుదల
మాచర్ల-విజయపురి సౌత్: తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జున్‌సాగర్ కుడికాలువకు ఒక టీఎంసీ నీళ్లను డ్యాం అధికారులు వదిలారు. ప్రాజెక్టు ఐదవ గేట్ నుంచి మొదటగా 500 క్యూసెక్కుల నీటిని విడవగా..గంట గంటకూ 500 క్యూసెక్కులను పెంచుతూ 2000 క్యూసెక్కులను వదులుతామని తెలిపారు. ఇలా 6 రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. -
ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయాలి
నిజామాబాద్ : శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) నుంచి వెంటనే నీటిని కాకతీయ కాలువకు విడుదల చేయాలని శనివారం రైతులు ఆందోళన చేపట్టారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎస్సారెస్పీ వచ్చిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని రైతులు అడ్డుకున్నారు. తమతో కలిసి రావాలని రైతులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఆందోళనలో మోర్తాడ్, కమ్మర్పల్లి, బాల్కొండ మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. (శ్రీరాంసాగర్) -
సాగర్ కుడి కాలువకు నీరు విడుదల
గుంటూరు : నాగార్జున సాగర్ కుడి కాల్వకు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తునట్లు గురువారం అధికారులు తెలిపారు. 7 వేల క్యూసెక్కుల నీరు అవసరముండగా కేవలం 2వేల క్యూసెక్కులే విడుదల చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. కాల్వకు చివర నున్న భూములు సాగు అవ్వాలంటే 7 వేల క్యూసెక్కుల నీరు అవసరమని రైతులు చెప్తున్నారు. (మాచర్ల)