పెద్దమ్మను చూద్దామని ఒకరు.. అక్క కష్టసుఖాలను పంచుకుందామని మరొకరు.. మిత్రులను పలకరిద్దామని ఇంకొకరు..ఇలా వేసవి సెలవుల్లో ఒకరోజు హ్యాపీగా గడుపుదామని వచ్చిన వీరిని ‘కృష్ణమ్మ’ పొట్టనపెట్టుకుంది. గలగల పారుతున్న జూరాల నీళ్లను చూసి ఈత కొడదామన్న వారి సరదా అంతలోనే ప్రాణం తీసింది. ఒకరి తరువాత మరొకరు మునకేసిన నలుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. రాత్రివరకు గాలించినా వారి ఆచూకీ లభించలేదు. ఆర్తనాదాలు, రోదనలతో జూరాలతీరం శోకసంద్రంగా మారింది.
ధరూరు/ఆత్మకూరు, న్యూస్‌లైన్: ఈత కోసం జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానదిలోకి దిగిన నలుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన ఆదివారం జరి గింది. స్థానికులు, బాధితుల కథనం మేరకు.. హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం గద్వాల పట్టణంలోని శేరెల్లివీధిలోని మహిమూదాకు దగ్గరి బంధువులు. ఆమె కుటుం బసభ్యులను చూసేందుకు శనివారం వారు ఇక్కడికి వచ్చారు. రాత్రి ఇక్కడే గడిపి ఉదయం ఆత్మకూరులోని మరో బంధువులను చూసేందుకు జీపులో బయలుదేరి వెళ్లారు. అక్కడే భోజనం చేసి తిరిగి మధ్యాహ్నం గద్వాలకు తిరుగు పయనమయ్యారు.
మార్గమధ్యంలోని జూరాల ప్రాజెక్టును చూసి అక్కడే కొద్దిసేపు సేదతీరుదామని నిర్ణయిం చుకున్నారు. వేసవి కావడం, ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవడంతో వారు కుడికాల్వకు నీటిని విడుదల చేసే రెగ్యులేటరీ వద్దకు చేరుకున్నారు. మొదట షాకీర్ (17) ఈత కొట్టేందుకు కా ల్వలోకి దిగాడు. ఈత రాకపోవడంతో మునుగుతూ..తేలుతూ కనిపించాడు. ఇది గమనించిన సా బేర్ (20), మోసిన్(19), సమీర్(19)లు వెంటనే అతని కాపాడేందుకు కాల్వలోకి దూకారు. ఒకరి తరువాత మరొకరు నీటిలోకి జారుకుని కనిపించకుండాపోయారు.
ఐదుగురిలో జుబేర్ అనే యువకుడు ఈతరాక కొట్టుమిట్టాడుతుండటంతో జాల ర్లు కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని గాలింపు చర్య లు ప్రారంభించారు. గజ ఈతగాళ్లతో గద్వాల సీఐ రఘు ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. మట్టిలో కూరుకుపోయి ఉండొచ్చని, లేదా కుడికాల్వకు వదులుతున్న నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. రా త్రి పొద్దుపోవడంతో శవాల వెలికితీత ఇబ్బందికరంగా మారడంతో పోలీసులు వెనుదిరిగారు.
ఒకరి కోసం ఒకరు..
ఒకరి కోసం మరొకరు జూరాల కాల్వలోకి దిగి గల్లంతయ్యారు. మృతుల్లో సమీర్ గద్వాలకు చెందినవాడు. స్థానికంగా కార్పెంటర్‌గా పనిచేస్తూ తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. హైదరాబాద్‌కు చెందిన సాబేర్, మోసీన్, షాకీర్ లు అక్కడే చదువుకుంటున్నారు.
వేసవి సెలవులు కావడంతో తన ఇంటికి వచ్చిన వీరిని సమీర్ ఆత్మకూర్‌లోని తనసోదరి హలీమా, బావ సర్దార్ ఇంటికి వెళ్లారు. అక్కడే భోజనాలు ముగించుకుని తిరుగుముఖం పట్టారు. మార్గమధ్యంలోనే పీజేపీ కాల్వలో యువకులు గల్లంతయ్యారు. ఈ విషయం తెలియడంతో సమీర్ అక్కాబావలు కన్నీరుమున్నీరయ్యారు. సంఘటన స్థలానికి వెళ్లి బోరున విలపించారు. తన సోదరుడితో పాటు చిన్నాన్న కొడుకులు గల్లంతవడంతో హలీమా ఇంట్లో విషాదం అలుముకుంది.
మిన్నంటిన రోదనలు
కళ్ల ముందే ఉండి క్షణాల్లోనే నీటిలో మునిగి తమ పిల్లలు కనిపించకుండా పోవడంతో అక్కడే ఉన్న బంధువుల రోదనలు మిన్నంటాయి. రాత్రి కావడంతో బంధువులను గద్వాలలోని బంధువుల ఇంటికి తరలించేందుకు ప్రయత్నించగా..అల్లారుముద్దుగా పెంచుకున్న తమ పిల్లలు లేనిదే ఎలా వెళ్లమంటారంటూ పోలీసులను ప్రశ్నించడంతో విషాదవాతావరణం నెలకొంది.
శోకసంద్రం
Published Mon, May 26 2014 2:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement