ధరూరు, న్యూస్‌లైన్: జెన్‌కో జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్‌లో విద్యుదుత్పత్తి ప్రారంభమై నిలిచిపోయినట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 1835 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని, మంగళవారం సాయంత్రం 3 గంటలకు ఒక యూనిట్ విద్యుదుత్పత్తి నిమిత్తం ఆరువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు పీజేపీ అధికారి కృష్ణయ్య తెలిపారు.
విద్యుదుత్పత్తి ప్రారంభానికి ముందు జూరాల ప్రాజెక్టు నీటిమట్టం 318.50 మీటర్లుగా ఉండగా, రాత్రి 7 గంటల వరకు 318.45 మీటర్లకు తగ్గడంతో విద్యుదుత్పత్తిని నిలిపి వేశామని చెప్పారు. ఆయకట్టు రైతులకు కుడి, ఎడమ కాల్వల ద్వారా 850 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు నీటి మట్టం 491.246 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు 6 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా ఔట్‌ఫ్లో లేవన్నారు. ఆల్మట్టి ప్రాజెక్టు నీటి మట్టం 517.200 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టుకు ఎలాంటి ఇన్‌ఫ్లో లేవని, విద్యుదుత్పత్తి ద్వారా 6వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ప్రారంభమై నిలిచిపోయిన విద్యుదుత్పత్తి
Published Wed, Dec 18 2013 3:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement