ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు
Published Tue, Mar 7 2017 4:46 PM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM
హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబాకు మహారాష్ట్రలోని గడ్చిరోలి ఓ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆయనకు మావోయిస్టులతో
సంబంధాలున్నాయని విశ్వసించి ఈ మేరకు తీర్పునిచ్చినట్లు న్యాయస్థానం పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేశారు. వికలాంగుడైన ఆయన తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది.
ఆయనపై ఉన్న ఆరోపణలను గడ్చిరోలి న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపైనే ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు జేఎన్‌టీయూ విద్యార్థి హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్ రాహి తదితరులకు కూడా ఇదేవిధంగా జీవిత ఖైదు విధించింది.
Advertisement
Advertisement