Professor Saibaba
-
హింసల కొలిమిలో పదేళ్లు
సాక్షి, హైదరాబాద్: తప్పుడు కేసుల కారణంగా పదేళ్లు నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో చిత్రహింసల కొలిమిలో మగ్గిపోయానని, తొమ్మి దేళ్లు తనను అండా సెల్లోనే (జైలు ఆవరణ లోపలి ప్రత్యేక జైలు) ఉంచారని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవహక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తెలిపారు. ఇంత నిర్బంధం ఎదుర్కొన్నప్పటికీ తన ఉద్యమ పంథాను వీడనని, అధ్యాపకుడిగా కొనసాగుతా నని స్పష్టం చేశారు. తెలంగాణ స్టేట్ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడ బ్ల్యూజే) శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి.హర గోపాల్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కె.విరా హత్ అలీతో కలిసి సాయిబాబా మాట్లాడారు. పదేళ్ల తర్వాత స్వేచ్ఛగా మాట్లాడుతున్నా..‘జైలు జీవితం అంతా చీకటి రోజులు. అందులో రెండేళ్ల కరోనా సమయం మరింత దారుణం. పదేళ్ల తర్వాత తెలంగాణలో స్వేచ్ఛగా మాట్లాడుతున్నా. రాజ్య హింస నుంచి ఆదివాసీయులను కాపాడేందుకు జస్టిస్ రాజేంద్ర సచార్, మరికొందరు సామాజిక వేత్తలతో కలిసి ‘ఫోరం అగైనెస్ట్ వార్ అండ్ పీపుల్’ను స్థాపించి ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’కు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే నా అరెస్టుకు ప్రధాన కారణం. ఆపరేషన్ గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాటం ఆపాలని నన్ను, నా భార్య వసంతను కొందరు బెదిరించారు.మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతామని చెప్పడంతో పాటు చేసి చూపించారు. నన్ను ఢిల్లీలో కిడ్నాప్ చేసి గడ్చిరోలికి తీసుకు వచ్చా రు. అక్కడ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి నాగ్‌పూర్ జైలుకు తరలించారు. ఆ సమయంలో నా వీల్‌చైర్‌ను విరగ్గొట్టారు. నన్ను బయటికి ఈడ్చారు. ఆ దాడితో నా ఎడమ చేతి నరాలు దెబ్బతిన్నాయి. జైల్లో పెట్టిన తర్వాత 9 నెలలు నాకు కేవలం నొప్పిని తగ్గించే మాత్రలే ఇచ్చారు తప్ప డాక్టర్‌కు చూపించలేదు. పదే ళ్లలో కొన్నిసార్లు మాత్రమే ఆసుపత్రికి తీసుకె ళ్లారు. సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో ఎడమ చేయి పూర్తిగా పడిపోయింది.క్రమంగా ఊపిరి తిత్తులు, గుండెపై ప్రభావం పడింది. చిన్ననాటి నుంచి పోలియో తప్ప మరే జబ్బులు లేని నేను, జైలుకు వెళ్లిన తర్వాత 21 రకాల జబ్బుల బారినపడ్డా. కనీసం గ్లాస్ మంచినీళ్లు తాగలేని స్థితి. బాత్రూంకు ఇద్దరు మోసుకెళ్లాల్సిన దుస్థితి. ఇతర ఖైదీలతో కలవకుండా చేశారు. అప్పుడే తొలిసారి నేను దివ్యాంగుడిని అన్న భావన కలిగినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు..’ అని సాయిబాబా చెప్పారు.జైల్లో కుల వ్యవస్థ విచ్చలవిడిగా ఉంది ‘నాగ్‌పూర్ జైల్లో కుల వ్యవస్థ విచ్చలవిడిగా ఉంది. మహారాష్ట్ర జైలు మాన్యువల్‌లో కుల వ్యవస్థ గురించి, ఖైదీలను అవసరం అయితే కొంత హింసించవచ్చని రాసి ఉంది. నక్సల్స్, గ్యాంగ్స్టర్స్, పొలిటికల్ కేసులు మినహా మిగతా కేసుల్లో సాధారణ ఖైదీలను క్రమ శిక్షణ పేరిట చిత్రహింసలు పెడుతున్నారు. జైల్లో ఉన్న పదే ళ్లలో సాహిత్యమే నాకు ఊరటను, ఆత్మవిశ్వా సాన్ని ఇచ్చింది. అనేకమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా చేదు అనుభవ మే ఎదురైంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న మా అమ్మను చివరి దశలో చూసేందుకు, ఆమె అంత్య క్రియల్లో పాల్గొనేందుకు కూడా బెయిల్ దక్కలేదు.చివరకు ‘ఒక మేధావిని హింసించడం తప్ప ఈ కేసులో ఏమీ లేదు’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నా బెయిల్ ఉత్తర్వుల్లో రాశారు. రాజ్య వ్యవ స్థలో మిగిలిన వ్యవస్థలు పతనమవుతుంటే అందులోనే ఒక భాగమైన న్యాయ వ్యవస్థ నిలబ డదు. ప్రజా ఉద్యమం తీవ్రంగా ఉంటేనే కోర్టు లు న్యాయాన్ని త్వరగా అందిస్తాయి. అయితే క్రమంగా న్యాయవ్యవస్థ పైనా నమ్మకం సన్న గిల్లుతోంది. దీనిని జడ్జీ్జలుకూడా అర్ధం చేసుకుంటున్నారు..’ అని సాయిబాబా అన్నారు. -
మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీం కోర్టులో షాక్
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మావోయిస్టు లింకుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జీఎన్ సాయిబాబాకు భారీ షాక్ తగిలింది. ఆయన విడుదలను అడ్డుకుంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషి(సాయిబాబా) మీద నమోదు అయిన అభియోగాలు.. సమాజం, దేశ సమగ్రతకు భంగం కలిగించే తీవ్రమైన నేరాలని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. శనివారం ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్.. ఆయన జీవితఖైదును కొట్టేస్తూ తక్షణమే విడుదల చేయాలంటూ మహారాష్ట్ర హోం శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలపై స్టే విధించాలంటూ మహారాష్ట్ర సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం కోర్టు స్టేకు నిరాకరించింది. దీంతో.. ఈ వ్యవహారంపై మరో అత్యవసర అభ్యర్థన పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో.. శనివారం మహారాష్ట్ర పిటిషన్‌పై ప్రత్యేక సిట్టింగ్ ద్వారా విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం.. బాంబే హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దోషి విడుదల ఆదేశాలు ఇచ్చే సమయంలో బాంబే హైకోర్టు కొన్ని కీలక విషయాలను విస్మరించిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అంతేకాదు.. వైద్యపరమైన కారణాల దృష్ట్యా గృహనిర్భంధం కోసం సాయిబాబా చేసుకున్న అభ్యర్థనను సైతం.. నేర తీవ్రత దృష్ట్యా తోసిపుచ్చుతున్నట్లు పేర్కొంది. సాయిబాబాతో పాటు సహ నిందితులకు నోటీసులు జారీ చేస్తూ డిసెంబర్ 8వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. విడుదలపై స్టే ఇస్తూ.. రికార్డుల్లోని సాక్ష్యాలను సవివరంగా విశ్లేషించిన తర్వాత నిందితులు దోషులుగా నిర్ధారించబడినందున.. బాంబే హైకోర్టు ఆదేశాలను సస్పెండ్ చేయడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 390 కింద అధికారాన్ని వినియోగించుకుంటున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. వీల్ చైర్‌కి పరిమితమైన ఈ మాజీ ప్రొఫెసర్.. మావోయిస్టులతో సంబంధాల కేసులో 2014 ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో జీవిత ఖైదు పడడంతో.. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. తాజా సుప్రీం కోర్టు స్టే నేపథ్యంలో ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట
సాక్షి, ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు భారీ ఊరట లభించింది. మావోయిస్టులతో సంబంధాల కేసు నుంచి ఆయనకు విముక్తి లభించింది. ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన బాంబే హైకోర్టు.. ఆయన్ని తక్షణమే విడుదల చేయాలని మహారాష్ట్ర జైళ్ల శాఖను శుక్రవారం ఆదేశించింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో 2017లో సాయిబాబాను దోషిగా తేల్చింది ట్రయల్ కోర్టు. ఆ కేసులో జీవిత ఖైదు విధించింది. అయితే ఆ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ఇప్పుడు కొట్టేసింది. ట్రయల్ కోర్టు తనను దోషిగా నిర్ధారిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు రోహిత్ దియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించారు. ఈ మేరకు వాదనలు విన్న అనంతరం ట్రయల్‌కోర్టు తీర్పును కొట్టేస్తూ.. తక్షణమే ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌కి పరిమితమైన సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు. ఇక కోర్టు తీర్పుపై సాయిబాబా భార్య వసంత కుమారి స్పందించారు. మేధావి అయిన తన భర్తను కావాలనే కేసులో ఇరికించారని, జైల్లో ఏడేళ్లు గడిపారని, ఆయన ఆరోగ్యం బాగా దెబ్బ తిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: కన్నడ భాషపై దాడి చేస్తే ప్రతిఘటిస్తాం -
జైలులో మగ్గుతూనే ఉన్నారు!
‘భీమాకోరేగాం యుద్ధ గాయం ఇంకా మానడం లేదు. ఆ యుద్ధం జరిగి 200 సంవత్సరాలైన సందర్భంగా జరుపుకొన్న ఉత్సవాలపై అగ్ర వర్ణాలవారు దాడి చేశారు...’ ‘స్వాభిమాన పోరాటాలకు స్ఫూర్తి’ అని సాయిని నరేందర్ ‘సాక్షి’ దినపత్రికలో (1 జన వరి, 2022) రాసిన విశ్లేషణలో, ఆ దాడి జరిగిన వధూభద్రక్లో శంభాజీ మహరాజ్‌కు సమాధి నిర్మించిన దళితుని సమాధిని 2018 జనవరి 1న అగ్రవర్ణాలు కూల్చేసిన విషయాన్ని ప్రస్తావించ లేదు. భీమాకోరేగాం శౌర్యస్థలికి, ఒక రోజు ముందు (డిసెంబర్ 31, 2017) జరిగిన ‘ఎల్గార్ పరిషత్’ (శనివార్ వాడ, పుణే)కు ముంబై నుంచి దళితులను, అణచబడిన కులాలవారిని తరలించిన ఆరోపణపై 8 మంది తెలంగాణకు చెందిన రిలయన్స్ కంపెనీ కార్మికులను యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ అరెస్టు చేసిన ప్రస్తావనా ఆ వ్యాసంలో లేదు. ఈ అరెస్టు సందర్భంగా ఏటీఎస్ వాళ్లు చేసిన మానసిక చిత్రహింసలు భరించలేక తెలుగు, మరాఠీ సాహిత్యవేత్త మచ్చ ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఎనమండుగురు యువకులు ఉద్యోగాలు కోల్పోయి రెండేళ్లు జైల్లో ఉండి విడుదలయ్యారు. భీమాకోరేగాం అమరుల 200వ సంస్మరణ సభ నిర్వహించిన 280 సంస్థల ఎల్గార్ పరిషత్ సమావేశం (31 డిసెంబర్ 2017–శనివార్ పేట, పుణే)లో ‘నయీ పీష్వాయీ నహీ చలేగీ’ అని రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతిజ్ఞ చేయించిన సాంస్కృ తిక కళాకారుడు, రిపబ్లిక్ పాంథర్స్ సంస్థాపకుడు సుధీర్ ధావ్లే, కబీర్ కళామంచ్ కళాకారులు రమేశ్, సాగర్, జ్యోతి ఇంకా జైల్లో మగ్గుతూనే ఉన్నారు. (చదవండి: ఆదివాసీల ఆశాజ్యోతి... హైమండార్ఫ్) ఈ కేసును 2020 జనవరి నుంచి కేంద్ర ఎన్ఐఏ కోర్టు– ముంబై చేపట్టింది కనుక, వీళ్లతో పాటు అంబేడ్కరిస్టు మార్క్సిస్టు మేధావి ఆనంద్ టేల్టుంబ్డే, ప్రొఫెసర్ సాయిబాబా, ఆయన సహచరులపై గడ్చిరోలీ కుట్ర కేసును వాదించిన ప్రముఖ క్రిమినల్ లాయర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (ఐఏపీఎల్) కార్యదర్శి సురేంద్ర గాడ్లింగ్, ‘కలర్స్ ఆఫ్ కేజ్’ (సంకెళ్ల సవ్వడి) రచయిత, ఐఏపీఎల్ కోశాధికారి అరుణ్ ఫెరీరా, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, రీసెర్చ్ స్కాలర్ రోనా విల్సన్, ప్రొ. జీఎన్ సాయిబాబా డిఫెన్స్ కమిటీకి సహకరించిన ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లిష్ ప్రొఫెసర్ హనీబాబు, ప్రొఫెసర్ షోమా సేన్, వర్ణన్ గొన్జాల్వెజ్, మహేశ్ రౌత్, గౌతమ్ నవ్లఖా ఇంకా జైళ్లలో మగ్గుతూనే ఉన్నారు. కస్టోడియల్ మరణానికి గురయిన స్టాన్ స్వామి గురించి ఇక చెప్పేదేముంది? (చదవండి: అందరి వికాసం ఉత్త నినాదం కారాదు!) – సాథీ, హైదరాబాద్ -
ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడం హక్కుల ఉల్లంఘనే!
హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ నాగ్‌పూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. కేసు విచారణలో ఉండగానే ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రాంలాల్ ఆనంద్ కాలేజీ.. సాయిబాబా సర్వీసులను టెర్మినేట్ చేయడం సరికాదన్నారు. గతంలో కోర్టు కేసుల్లో నిర్దోషులుగా బయటపడి తమ ఉద్యోగాల్లో యథావిధిగా చేరిన ప్రొఫెసర్లు ఎంతోమంది ఉన్నారని ఆయన గుర్తుచేశారు. సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని స్పష్టంచేశారు. ఆయన అంగ వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో జైలు నుంచి విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రికి గతంలోనే లేఖ రాశానని తెలిపారు. -
మృత్యుశయ్యపై ఉంటున్నా....
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ నాపై మోపిన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలూ లేకున్నప్పటికీ దుర్బేధ్యమైన నాగ్‌పూర్ జైలులో పేరుమోసిన అండా సెల్లో 2017 మార్చి 7 నుంచి నన్ను నిర్బంధించారు. అండాసెల్ అనేది నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో అత్యంత అమానుషమైన గరిష్టభద్రతావలయంలోని బ్యారక్. అప్పటికే 90 శాతం అంగవైకల్యంతో కూడిన నా శారీరక ఆరోగ్యం గత 21 నెలలు నిర్బంధకాలంలో మరింతగా క్షీణించిపోయింది. తీవ్ర స్వభావంతో కూడిన 19 వ్యాధులు నన్ను కబళిస్తుండగా జైలులో ఎలాంటి వైద్య చికిత్సను అధికారులు నాకు కల్పించడం లేదు. వైద్య కారణాలతో నేను పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ 2018 మార్చి 8 నుంచి బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ముందు పెండింగులో ఉంది. తీవ్రమైన నొప్పితో నేను బాధపడుతున్నప్పటికీ నా శారీరక పరిస్థితి పట్ల అధికారులు అమానుషంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో గత 8 నెలలుగా నా బెయిల్ పిటిషన్‌పై వరుసగా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. అక్టోబర్ 6న నా బెయిల్ పిటిషన్‌పై విచారణ మరో ఆరు వారాలకు వాయిదా పడింది. ఈ సందర్భంగా నా ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వైద్య రికార్డులన్నింటినీ తనకు సమర్పించవలసిందిగా నాగ్‌పూర్ సెంట్రల్ జైల్ ప్రధాన వైద్యాధికారిని న్యాయస్థానం ఆదేశించింది. నా దిగజారిపోయిన ఆరోగ్య పరిస్థితిని నిగ్గుతేల్చడానికి కోర్టు ఆదేశం ఉపయోగపడవచ్చు. నా ఆరోగ్యానికి సంబంధించి జైలు అధికారులు ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్య ధోరణి, ఎలాంటి పరీక్షలూ జరపకపోవడం, సరైన చికిత్స అందించకపోవడం వంటి అంశాలపై నిజాలు బయటకి రావచ్చు. నా సీనియర్ న్యాయవాదులు, ఫ్యామిలీ డాక్టర్లు, ఇతర వైద్య నిపుణులు నా మెడికల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక రూపొందించి దాన్ని వీలైనంత త్వరగా హైకోర్టు ముందుంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఉంటున్న జైలు గది నిర్మాణం నన్ను పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తోంది. ఏ రకంగాకూడా బయటిప్రపంచంతో నాకు సంబంధం లేదు. ముడుతలుపడ్డ చర్మం, క్షీణించిన ఎముకలతో నా పరిస్థితి పడకేసిన ముదుసలి స్థాయికి దిగజారిపోయింది. అండాసెల్ లోపల వీల్ చెయిర్‌తో నేను టాయిలెట్‌కి కూడా పోలేను. మూత్రవిసర్జన చేయాలన్నా, స్నానం చేయాలన్నా సరే ఇద్దరు మనుషులు నన్ను ఎత్తుకెళ్లాల్సి వస్తోంది. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తితో ఎలా వ్యవహరిం చాలో కూడా జైలు అధికారులకు తెలియకపోవడమే కాకుండా, వారు సరైన చికిత్స విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కదలడానికి కూడా వీలులేని అండా సెల్లో మగ్గిపోతున్నాను. సెప్టెంబర్ 21, 2018న నాకు సీటీ బ్రెయిన్, సీటీ ఆంజియోగ్రఫీ టెస్టులను తులనాత్మక అధ్యయనం కోసం నిర్వహించారు. హైకోర్టు ఆదేశం ప్రకారం తొలిసారిగా నా సహచరి వసంతను ఆసుపత్రిలో నా పక్కన ఉండేందుకు అనుమతించారు. అక్కడ రేడియాలజీ విభాగం వైద్యులు హై రిస్క్ కన్ సెంట్ పేరిట ఒక పత్రంపై సంతకం చేయమని అడిగారు. అంటే మెదడుకు, గుండె వ్యాధికి నేను తీసుకుంటున్న మందులు తీవ్ర పరిస్థితికి దారి తీయనున్నాయని, చివరకు నాకు ప్రాణాపాయం కలిగే ప్రమాదం కూడా ఉందని దాని సారాంశం. చికిత్స ద్వారా తలెత్తే ఎలాంటి పరిణామాలకైనా నేను సిద్ధంగా ఉండాలని దీనర్థం. దాని రియాక్షన్ గంటలు, రోజుల వ్యవధిలో కూడా ప్రభావం చూపవచ్చు. నా ప్రస్తుత పరిస్థితికి దీర్ఘకాలిక చికిత్స అవసరం కాబట్టి నేను జైలుజీవితం గడిపినంత కాలం నా సహచరి నా పక్కన ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో జైలు అధికారులు, హైకోర్టు కూడా తగు న్యాయం చేయాలని అర్థిస్తున్నాను. అత్యంత తీవ్రమైన అనారోగ్య పరిస్థితి ప్రాతిపదికన నాకు బెయిల్ మంజూరు చేయవలసిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాను. (మావోయిస్టులతో సంబంధాలున్న ఆరోపణలతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో యావజ్జీవ శిక్ష గడువుతున్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబ తన సహచరి వసంతకు ఇటీవల రాసిన లేఖ సంక్షిప్త పాఠం) వ్యాసకర్త ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్, జైలు ఖైదీ జీఎన్ సాయిబాబ -
కారాగారంలో కారుణ్యం..?!
ఆదివాసీల కాళ్లకింది భూమిని పెకిలిస్తున్న అభివృద్ధిని ప్రశ్నించినందుకు కాదు.. వాళ్ల హక్కుల కోసం ప్రపంచ మేధావులను ఏకం చేయబూనడమే ప్రొఫెసర్ సాయిబాబ చేసిన మహానేరం. ఆ కారుణ్యమే నేడు కారాగారం పాలయ్యింది. మేత కోసం అడవికి వెళ్లి పులి నోటికి చిక్కిన ఆవు తన బిడ్డకు పాలిచ్చి పరుగు పరుగున వస్తా వదిలిపెట్టమని ప్రాధేయపడితే మనసు కరిగిన పులి ఆవును వదిలేసిందని నా బాల్యంలో తెలుగు వాచకంలోని ‘ఆవు– పులి’ పాఠ్యాంశంలో చదువు కున్నా. నిజాయితీ, నిబద్ధత బండరాయిలాంటి గుండె ఉన్న మనిషినైనా కదిలిస్తుం దని మా తెలుగు మాస్టారు చెప్తే మనసులోనే మననం చేసుకున్నా. కానీ కాలనాగులు కన్న పిల్లలనే కొరికి తిన్న ట్టుగా కనికరమే లేకుండా రాజ్యం ప్రొఫెసర్ సాయి బాబను జైలులోనే చిదిమేయజూస్తోంది. 90 శాతం శారీరక వైకల్యం, అంతకు మించిన అనారోగ్యంతో ప్రొ. సాయిబాబ అంపశయ్య మీదున్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. పోలీసుల డైరెక్షన్లో ఆయ నను జైలులోనే అనారోగ్యంతో చంపాలని చూస్తున్నారు. జాతీయ మానవ హక్కుల కమిటీ కల్పించుకొని ప్రొ. సాయిబాబ జీవించే హక్కును గౌరవించాలి. 1975 జూన్ 25 మనకు ఎప్పటికీ గుర్తే ఉంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పటాపంచలు చేసిన రోజు. ‘అత్యవసర పరిస్థి్థతి’ ప్రక టిస్తూ అప్పటి ప్రధాని ఇందిరమ్మ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. రాజ్యాంగం కల్పించిన సర్వ పౌర హక్కు లనూ హరించిన రోజు. నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాయిగానీ దండ కారణ్యంలో అప్పుడూ ఇప్పుడూ కూడా ఎమర్జెన్సీనే. ఎందుకంటే ఎమర్జెన్సీ నాటి పరిస్థితులే నేడూ కొనసా గుతున్నాయి. అప్పుడు అత్యవసర పరిస్థితి అని ప్రకటిం చారు. ఇప్పుడు ప్రకటించకుండానే దానిని అమలు చేస్తున్నారు. విశ్వాసాలు మూఢంగా ఉన్నా ఫరవాలేదు. కానీ అవి బలమైన భావజాలాలు కాకూడదు. దోపిడీ, నిరంకుశత్వాన్ని ప్రశ్నించే ఆయుధాలు కాకూడదంటూ విశ్వాసాల మీదే పోలీసులు దాడి చేస్తుంటే, పౌర స్వేచ్ఛను కాపాడాల్సిన న్యాయ వ్యవస్థ.. కార్యనిర్వా హక శాఖ తీరుగా ఆలోచన చేసి పోలీసులు చేసే హక్కుల ఉల్లంఘనకు అంగీకార ముద్ర వేసే ధోరణి క్రమంగా బలపడుతోంది. దేశానికి రాజకీయం అవ సరం. నలుగురు కూడి ఓ సమస్యకు పరిష్కారం వెతికే ఆద్భుత క్రతువే రాజకీయం. రాజకీయంలో భిన్న ఆలో చనలు ఉంటాయి. అంతులేని విజ్ఞాన శోధన ఉంటుంది. తార్కికం ఉంటుంది. ఏకాభిప్రాయాలు, విస్తృతాభిప్రా యాలు, విభేదాలు ఉంటాయి. వీటిలోంచే భిన్న రాజ కీయాలు పుట్టుకొస్తాయి. ఈ సంఘర్షణలోంచే విప్లవ భావజాలం పుట్టుకొస్తుంది, అది పరిసరాలను, ప్రాంతా లను, అవసరాలను బట్టి సాయుధ పోరాటంగానూ మారవచ్చు. లేదా శాంతి మార్గంలోనూ నడవవచ్చు. అప్రకటిత నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న దండ కారణ్య ఆదివాసీల ఉద్యమం ఇందులో భాగమే. అడ విలో పుల్లలేరుకున్నందుకు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు బతుకుతున్నందుకు ఆదివాసీలను జైళ్లలో పెట్టారు. నిజా నికి మనకన్నా ప్రజాస్వామ్యయుతమైన, చైతన్యమైన ప్రపంచం ఆదివాసీలది. ప్రేమించే హక్కు, సహ జీవనం చేసే హక్కు మన సమాజంలో లేదు. తమదైన ఒక ప్రత్యేక సంస్కృతి, భూభాగం, ఆచార వ్యవహారాలు కలిగిన ఆదివాసీలకు తమదైన రాజ్యాంగం, చట్టం ఉన్నా యన్నది మనం అంగీకరించం. ఆదివాసీలను తుడిచి పెట్టే మానవ హననంగానే గ్రీన్ హంట్ జరుగుతోంది. మానవతావాదులు, మేధావులు దీన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేశారు. రాజకీయ విశ్వాసాలు ఉన్న వ్యక్తిగా ఢిల్లీ యూనివర్సిటీæ ప్రొఫెసర్ సాయిబా బకు ఆదివాసీలపై స్పష్టమైన అవగాహన ఉంది. వాళ్ల హక్కుల కోసం పోరాడాలనే తపన ఉంది. ఆదివాసీ హక్కుల కోసం కడవరకు నిలవాలనే ఆదివాసీ ఉద్యమ బాధ్యతలు తీసుకున్నారు. వాళ్ల హక్కుల కోసం ప్రపంచ మేధావులను ఏకం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆది వాసీల హక్కుల కోసం మాట్లాడటం కూడా ఈ రాజ్యంలో నేరమే అని నాకు సాయిబాబను చూసిన తరువాతే తెలిసింది. నాగపూర్ సెంట్రల్ జైలులో ఉన్న ప్రొఫెసర్ సాయి బాబ ఆరోగ్య పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఆయ నకు శిక్ష విధించే కొద్ది రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధికి సంబంధించిన ఆపరేషన్ మూడు వారా లలో చేయాలని డాక్టర్లు సూచించారు. ఈ ఎనిమిది నెలల కాలంలో ప్రొ. సాయిబాబకు జైలులో ఏ విధ మైన వైద్య సహాయం అందలేదు. క్లోమ గ్రంధికి సంబం ధించిన నొప్పి తీవ్రతరం అయింది. ఛాతి నొప్పి, గుండె దడ రావడం జరిగింది. జీవించే హక్కులో భాగంగా ప్రొ. సాయిబాబ న్యాయస్థానాల్లో బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకుంటే అంగీకరించలేదు. ఇక్కడో విషయం చెప్పాలి. రూ. వందల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపా దించి, అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి జైల్లో ఉన్న శశికళకు భర్త ఆరోగ్యం బాగాలేదని న్యాయస్థానాలు బెయిల్ ఇచ్చాయి. క్రికెట్ ఆటను వ్యాపార, వ్యభిచార ఆటగా మార్చి వేల కోట్లు అక్రమంగా సంపాయించి జైలు పాలయిన లలిత్‌మోదీకి, ఆయన భార్య ఆరోగ్యం సరిగా లేదన్న కారణంగా బెయిల్ ఇచ్చారు. 90 శాతం శారీరక వైకల్యం, అంతకు మించిన అనారోగ్యంతో బాధ పడుతున్న సాయిబాబకు అవే న్యాయస్థానాలు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించడంపై విస్తృత చర్చ జరగాలి. - సోలిపేట రామలింగారెడ్డి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, దుబ్బాక శాసన సభ్యులు ‘ 94403 80141 -
హద్దులు దాటిన అమానుషత్వం
సాయిబాబాకి చట్ట ప్రకారమే శిక్షలు విధించామని చెప్తున్నారు. కానీ అదే చట్టాల్లో ఖైదీల హక్కుల గురించి ఉన్న అంశాలను ఆయన విషయంలో అమలు చేయకపోవడం రెండు నాల్కల వైఖరి తప్ప మరోటి కాదు. జైళ్లలోని ఖైదీల ఆరోగ్య బాధ్యతను జైలు అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం చట్టబద్ధ్దం అవుతుందా? సాయిబాబా విషయంలో చట్టాలను అమలుపరచాల్సిన అధికార యంత్రాంగం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన సంకేతం. ‘‘రాబోయే చలికాలాన్ని గురించి ఆలోచించాలంటే నాకు భయమేస్తోంది. ఇప్పటికే నిరంతరం జ్వరంతో వణికిపోతున్నాను. నాకు దుప్పటి లేదు. స్వెట్టర్ లేదు. ఉష్ణోగ్రతలు తగ్గేకొద్దీ కాళ్లను, ఎడమ చేతిని వేధిస్తున్న నొప్పి పెరిగిపోతోంది. నవంబర్ నుంచి మొదలయ్యే చలికాలంలో బ్రతికి ఉండడం నాకు అసాధ్యం. ఇక్కడ నేను ఆఖరి ఘడియల్లో ఉన్న జంతువులా జీవిస్తు న్నాను. ఎనిమిది నెలలు ఎలాగో తట్టుకొని జీవించగలిగాను. కానీ రానున్న శీతాకాలాన్ని తట్టుకొని జీవించలేను. ఇంక నా ఆరోగ్యం గురించి రాయడం వల్ల ఏ మాత్రమూ ప్రయోజనం లేదు. ఏది ఏమైనా నవంబర్ చివరి నాటికి సీనియర్ న్యాయవాదిని ఖరారు చేయండి. అక్టోబర్ చివరి వారంలో గానీ నవంబర్ మొదటి వారంలో గానీ నా బెయిల్ పిటిషన్ దాఖలు చేయమని గాడ్లింగ్‌కి తెలియజేయండి. ఇది ఈ విధంగా జరగకపోతే పరిస్థితి నా చేతిలో ఉండదని గుర్తుంచుకోవాల్సింది. ఇంక నా బాధ్యత ఏమీ లేదు. ఈ విషయం స్పష్టంగా చెపుతున్నాను. ఇక మీదట ఈ విషయం గురించి నేను ఏమీ రాయబోవడం లేదు. శ్రీమతి రెబెకాజీ, నందిత నారాయణ్‌లతో మాట్లాడు. అలాగే ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులతో మాట్లాడు. మొత్తం పరిస్థితిని వివరించు. ఈ పని త్వరగా చేయవలసింది. ఒక నిర్భాగ్యుడిలా, భిక్షగాడిలా మిమ్మల్ని పదే పదే ప్రాధేయపడాల్సిరావడం నన్ను కుంగ దీస్తోంది. కానీ మీరెవ్వరూ ఒక్క అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. నా పరిస్థితిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. అనేక ఆరోగ్య సమస్యలతో ఒక చెయ్యి మాత్రమే పనిచేస్తున్న 90 శాతం వైకల్యం గల మనిషి జైలులో ఉన్నాడన్న విషయం ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. నా ప్రాణం గురించి ఎవరికీ పట్టింపులేదు. ఇది కేవలం నేరపూరిత నిర్లక్ష్యం. నిర్లక్ష్య వైఖరి. నీ ఆరోగ్యం జాగ్రత్త. నీ ఆరోగ్యమే నా ఆరోగ్యం, మొత్తం మన కుటుంబ ఆరోగ్యం. ఇప్పుడు నీ ఆరోగ్యాన్ని చూసుకోవడానికి ఎవరూ లేరు. నేను నీ వద్దకు వచ్చేదాకా నీ ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించవద్దు.’’ - ప్రేమతో నీ సాయి. ఎవరీ ‘సాయి?’ మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో, కేవలం ల్యాప్ టాప్, కంప్యూటర్ల సాంకేతిక ఆధారాలతో మహారాష్ట్రలోని గడ్చిరోలి కోర్టు విధిం చిన జీవితఖైదుని అనుభవిస్తూ... ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా నాగ్‌పూర్ అండా సెల్‌నుంచి అత్యంత దయనీయమైన స్థితిలో తన భార్య వసంతకు రాసిన లేఖ ఇది. భారత దేశంలో అమలౌతోన్న ప్రజాస్వామిక వాతావరణాన్ని ఇది చెప్పకనే చెపుతోంది. అసలింతకీ ఎవరీ సాయిబాబా? ఎందుకీ చర్చ? సాయిబాబా తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో 1967లో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు. స్కాలర్‌షిప్‌ల సాయంతో చదువు సాగించారు. అమలాపురంలోని ఎస్కేబీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న ప్పుడు, విశ్వవిద్యాలయ స్థాయిలో మంచి ప్రతిభను కనబరచి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో చేరారు. అదే సమ యంలో ఆయనకు విప్లవ రాజకీయాలతో సంబంధాలేర్పడ్డాయి. ఏఐపీ ఆర్ఎఫ్ (అఖిల భారత ప్రజా ప్రతిఘటనా వేదిక)లో కొనసాగుతూ ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపక వృత్తిలో జీవనం సాగించేవారు. చిన్నతనంలోనే పోలియో వచ్చి ఆయన రెండు కాళ్లూ చచ్చుబడిపోయాయి. ఢిల్లీకి చేరేంత వరకు ఆయన చాలా వరకు రెండు చేతుల సాయంతో నేల మీద పాకుతూ వెళ్లేవారు. సహచరి వసంతతో పెళ్లి అనంతరం సాయిబాబా ఆమె సహకా రంతో నడవడం అలవర్చుకున్నాడు. రాజకీయాల్లో భుజం భుజం కలిపి నడిచినట్టే, అతనికి తోడునీడై నిలచిన ఆమె అతని భారాన్ని మోసేందుకు తన జీవితాన్ని అర్పించింది. ఇటువంటి పరిస్థితిలోని సాయిబాబాకు మహారాష్ట్ర లోని గడ్చిరోలి కోర్టు, మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణతో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)లోని వివిధ సెక్షన్ల ప్రకారం జీవిత ఖైదు విధించింది. ఉపాలోని సెక్షన్ 13 కింది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, సెక్షన్ 18 కింద ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర, 20, 38, 39 సెక్షన్ల కింద ఉగ్రవాద సంస్థల్లో సభ్యత్వం లేదా వాటితో సంబంధాలు కలిగి ఉండటం, ఆ కార్యకలాపాలకు మద్దతుగా నిలబడటం లాంటి నేరారోపణలు చేశారు. అందుకుగానూ సాయిబాబా సహా జెఎన్‌యు పరిశోధక విద్యార్థి హేమ్ మిశ్రా, జర్న లిస్టు ప్రశాంత్ రాహి, మహేష్ టిర్కి, పాండు నరోత్లకు గడ్చిరోలి కోర్టు జీవిత ఖైదుని విధించింది. వారితో పాటు విజయ్ టిర్కి అనే గిరిజనుడికి పదేళ్ల కారాగార శిక్షను కోర్టు విధించింది. చట్టాలకు తిలోదకాలిచ్చి... అయితే, సాయిబాబా పరిస్థితి ప్రత్యేకమైనది. 90 శాతం వైకల్యంతో పాటు ఎన్నో ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఆయన్ను సుదీర్ఘకా లంగా వేధిస్తున్నాయి. సాయిబాబా గత 15 ఏళ్లుగా హైబీపీతో సతమతమౌ తున్నారు. ఒక్క చేయి పూర్తిగా కదిలించలేరు. దీనికి తోడు పోలీసుల విచా రణలో ఒక చేయి పూర్తిగా పనిచేయని స్థితికి వచ్చింది. కార్డియోమయోపతి (గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి) కూడా ఉంది. గాల్ బ్లాడర్‌లో రాళ్ల సమస్య తీవ్రంగా ఉంది. వీటికి తోడు వేరొకరి సహకారం లేకుండా కదల్లేని స్థితిలో, గడ్డకట్టే చలిలో నేలపైన పాకుతూ బతకడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అన్ని వ్యాధులతో, కదల్లేని స్థితిలో ఉన్న నిస్సహాయుణ్ణి గాలీ వెలుతురూ సోకని అండాసెల్ అనే చీకటి గదిలో ఉంచడంలో ఆంతర్యం ఏమిటో అంతు పట్టదు. నిజానికి ఇలాంటి ఖైదీ ఉండాల్సినది ఆసుపత్రిలో, వైద్యుల పర్యవేక్షణలో. కానీ సాయిబాబాని ఉంచింది అండా సెల్ అనే చీకటి గుహలో. మన ౖజైళ్ల చట్టంలోని 37, 38, 39 సెక్షన్ల ప్రకారం జైలు అధికా రులు ఖైదీలకు అనారోగ్య సమస్యలు ఏర్పడినప్పుడు వారిని వెంటనే జైలు లోని ఆసుపత్రికి తరలించాలి. ఇంకా అదనపు వైద్య సహాయం అవసరమైన పుడు ప్రత్యేక సదుపాయాలు కలిగిన బయటి ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య సహకారం అందించాలని చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరుడికి జీవించే హక్కు ఉంది. అలాగే ఖైదీకి సైతం ఆ హక్కు ఉంటుంది. కాకపోతే అతను పోలీసుల నిర్బంధంలో ఉంటే, ఇతను బాహ్య ప్రపంచంలో ఉంటాడు. నిజానికి నిర్బంధంలో ఉన్నప్పుడు అతను ఆరోగ్యంగా ప్రాణా లతో ఉండేలా చూడాల్సిన బాధ్యత జైలు అధికారులపైనా, ఇంకా చెప్పా లంటే ప్రభుత్వం పైనా ఉంటుంది. సాయిబాబాకి చట్ట ప్రకారమే శిక్షలు విధించామని ప్రభుత్వాధినేతలు, పోలీసు అధికారులు, న్యాయాధిపతులూ చెప్తున్నారు. కానీ అదే చట్టాల్లో ఖైదీల గురించి ఉన్న అంశాలను అమలు చేయకపోవడం రెండు నాల్కల వైఖరి తప్ప మరోటి కాదు. జైళ్లలోని ఖైదీల ఆరోగ్య బాధ్యతను జైలు అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం చట్టబద్దం అవుతుందా? చట్ట వ్యతిరేకం అవుతుందా? మరణ శిక్ష విధించిన ఖైదీని సైతం ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఉరితీయకూడదనే నిబంధనను కచ్చితంగా పాటిస్తారు. ఖైదీలు సంపూ ర్ణారోగ్యంతో ఉండేలా జైలు అధికారులు చర్యలు తీసుకోవాలనేదే దాని అసలు ఉద్దేశం. పైగా ఐక్యరాజ్య సమితిలోని సభ్యదేశంగా భారత్, దివ్యాం గుల హక్కుల ఒప్పందాన్ని అమలుచేయాల్సి ఉంది. అందులోని సెక్షన్ 15(1), సెక్షన్15(2) ప్రకారం అంగ వైకల్యంతో గానీ, మానసిక వైకల్యంతో గానీ బాధపడుతున్న ఏ వ్యక్తినీ అమానవీయంగా చూడటం, చిత్రహింసలకు గురిచేయడం జరగకుండా అన్ని ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థలు అధికార యంత్రాంగం చట్టపరమైన ఏర్పాట్లు చేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 భారత పౌరులందరి ఆత్మగౌరవం, జీవన భద్రతలకు రక్షణనిచ్చే హక్కుకు హామీ కల్పిస్తోంది. సాయిబాబా విషయంలో మన ప్రభుత్వం ఈ నిర్దేశాలన్నిటికి తిలోదకాలిచ్చినట్టు స్పష్టమౌతోంది. ప్రజాస్వామ్యంపై విశ్వాసం సడలదా? అంగవైకల్యంతో చిత్రహింసలకు గురై, అతి దయనీయ స్థితిలో సాయి బాబా అండా సెల్లో మగ్గుతుంటే... మరోవైపు ప్రజా ధనాన్ని వనరులనీ దోచేసి, ప్రభుత్వాలనీ, వ్యవస్థలనీ భ్రష్టుపట్టించిన అనేక మంది బడా రాజకీయ, ఆర్థిక నేరçస్తులు జైళ్లలో ఫైవ్‌స్టార్ హోటల్లో లభించే విలాసాలతో గడు పుతున్నారని ప్రముఖ జర్నలిస్టు సునేత్రా చౌదరి ఇటీవల తాను రాసిన బిహైండ్ బార్స్ అనే పుస్తకంలో వివరంగా వర్ణించారు. అందులో, ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి పప్పూ యాదవ్, వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభి షేక్ వర్మ, స్టార్ టీవీ సీఈఓ పీటర్ ముఖర్జీ, 2–జీ కుంభకోణం నిందితుడు మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా, ఓట్ల కోసం నోట్ల కేసులో నిందితుడు, సమా జ్‌వాదీ పార్టీ నాయకుడు అమర్‌సింగ్ లాంటి వ్యక్తులు దేశంలోని వివిధ జైళ్లలో రాజభోగాలు అనుభవించిన తీరును సాక్ష్యాధారాలతో సహా రచయిత్రి ఈ పుస్తకంలో పేర్కొన్నారు. జైళ్లలోని ఖైదీల పట్ల అధికారులు చూపుతున్న ఈ పరస్పర విరుద్ధ వైఖరులు మన ప్రజాస్వామ్య విధానం పట్ల విశ్వాసాన్ని సడలింపజేసేవిగా ఉన్నాయి. ఒకే దేశానికి సంబంధించిన రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఈ ద్వంద్వ వైఖరికి మన దేశంలోని జైళ్లు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చట్టాలు అందరికీ సమానమైన అవకాశాలను, హక్కులను కలిగించాలి. కానీ ఇక్కడ సాయిబాబా లాంటి వ్యక్తులు చట్ట ప్రకారం శిక్ష అనుభవిస్తున్నప్పటికీ, చట్టాలను అమలుపరచాల్సిన అధికార యంత్రాంగం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇది ప్రజా స్వామ్యానికి ప్రమాదకరమైన సంకేతం. స్వాతంత్య్రానికి ముందు కొమురం భీం నాయకత్వంలో సాగిన ఆదివాసీ ఉద్యమాన్ని సమీక్షించి, తగు పరిష్కా రాలను చూపాలని నాటి రాచరిక నిజాం ప్రభుత్వం హేమండార్ఫ్ లాంటి సామాజిక శాస్త్రవేత్తలను కోరారు. వారి సలహాలను అమలు పరచడానికి ప్రయత్నించారు. దాన్ని చూసి అయినా మనం నేర్చుకోవాల్సింది ఏమిటో అర్థం చేసుకోవాలి. - మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
హక్కుల కమిషన్ రిపోర్టు వెల్లడించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాకు సంబంధించిన నివేదికను వెల్లడించాలని ఆయన సహచరి వసంత జాతీయ మానవహక్కుల కమిషన్‌ను డిమాండ్ చేశారు. సాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తోందనీ, ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నందున తక్షణమే జోక్యం చేసుకో వాలని కమిషన్‌ను వసంత గతంలో ఆశ్రయించింది. దీంతో నాగపూర్ అండాసెల్‌లో ఉన్న సాయిబాబాను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆగస్టులో కలిసింది. అయితే, 3 నెలలు కావస్తున్నా మానవ హక్కుల కమిషన్ నివేదికను వెల్లడించలేదని వసంత ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు. సాయిబాబా ఆరోగ్యానికి సంబంధించిన నిజాలు, జైలు అధికారుల కక్షసాధింపు చర్యలు బయటపడతాయనే ఆ రిపోర్టును వెల్లడించలేదని అన్నారు. ‘సాయిబాబా కార్డియో మయోపతితో బాధపడుతున్నారు, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఉన్నాయి, 15 ఏళ్లుగా హైబీపీ ఉంది, పోలియోతో 2 కాళ్లు పూర్తిగా పనిచేయవు. వేరొకరి సాయం లేకుండా కదల్లేని పరిస్థితి. రోజుకు 8 రకాల మందులు వాడాలి. కానీ ఒక్క మందు సకాలంలో అందించడం లేదు. శరీరం 90% చచ్చుబడిపోయిన ఆయన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నుతాడనే నెపంతో చీకటి గుహలాంటి అండాసెల్‌లో బంధించారు. ఏ నేరానికీ పాల్పడే అవకాశంలేని తను ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఎలా చేస్తారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. యుద్ధ ఖైదీలకు సైతం ఇలాంటి ట్రీట్మెంట్ ఉండదు.’అని వసంత ఆవేదన వ్యక్తం చేశారు. ఖైదీల పట్ల అనుసరించాల్సిన విధానాలను, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి అక్రమంగా సాయిబాబాను జైల్లో పెట్టి హింసిస్తున్నారని ఆరోపించారు. సాయిబాబా విడుదల కోరుతూ నిరసన ‘సాయిబాబా విడుదల కోరుతూ జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అనేక చోట్ల నిరసనోద్యమాలు జరుగుతున్నాయి. న్యూయార్క్‌లో నిరసన ప్రదర్శించారు. యూరోపియన్ కాన్సులేట్ నుంచి కొందరు ఫోన్ చేసి వివరాలు తీసుకుని సంఘీభావం ప్రకటించారు. పంజాబ్, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. మరోపక్క ఢిల్లీ యూనివర్సిటీలో సాయిబాబా సస్పెన్షన్‌పై వేసిన కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. సాయిబాబా రాసిన లేఖలను మూడు, నాలుగు రోజులు జైలు అధికారులు తమ దగ్గరే ఉంచుకొని ఆ తర్వాత పోస్ట్ చేస్తున్నారు. మా క్వార్టర్ ఖాళీ చేయించారు. మాకు ఇల్లు అద్దెకు ఇవ్వడంలేదు. మానవతా దృక్పథంతో సాయిబాబాను హైదరాబాద్‌కు మార్చాలి’ అని ఆమె అన్నారు. ప్రొఫెసర్ సాయిబాబా విడుదల కోరుతూ ఈ నెల 10న ఉస్మానియా యూనివర్సిటీలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్టు సాయిబాబా విడుదల కమిటీ నాయకులు బళ్లా రవీందర్, రవిచంద్ర, నారాయణరావు, విరసం సభ్యురాలు గీతాంజలి, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీ ఖాద్రి తెలిపారు. సాయిబాబా, అతని సహచరుల విడుదల ఉద్యమంలో ప్రజాస్వామికవాదులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు. -
ఇవి నాకు చివరి ఘడియలు
-
ఇవి నాకు చివరి ఘడియలు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కారణంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాతో సహా పాత్రికేయుడు ప్రశాంత్ రాహి, జేఎన్‌యూ పరిశోధక విద్యార్థి హేమ్ మిశ్రా, పాండు నరోత్, మహేశ్ టిర్కిలకు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనీ, రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫోరం సభ్యులంటూ రాజద్రోహ నేరం మోపి, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాను నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని అండాసెల్‌లో ఉంచారు. ఆయన 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అంతకుముందు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆయన కొంత కాలం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో కనీసం అత్యవసర మందులు సైతం అందించకపోవడంతో సాయిబాబా ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడిందని సాయిబాబా సహచరి వసంత ‘సాక్షి’కి తెలిపారు. ఆయనకు శిక్ష విధించే కొద్దిరోజుల ముందు పిత్తాశయం, క్లోమగ్రంధికి సంబంధించిన ఆపరేషన్ని మూడునెలలలోగా చేయాలని డాక్టర్లు సిఫారసు చేసినప్పటికీ జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు వసంత తెలిపారు. ఇటీవల మందులు సైతం ఇవ్వకపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ఛాతీనొప్పి తీవ్రమైందని ఆమె ‘సాక్షి’కి ఫోన్లో వివరించారు. గత జూన్ 1వ తేదీన సాయిబాబా అనారోగ్యాన్ని పరిగణనలోనికి తీసుకొని సాయిబాబాకు అత్యవసరంగా వైద్య సాయం అందించాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. నేలమీద పాకుతూ ఓ జంతువులా బతుకుతున్నా... తాజాగా తన ప్రాణాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని, తనను గురించి పట్టించుకోవాలని, అండాసెల్‌లో ఈ చలిని తట్టుకొని బతకడం అసాధ్యమని తన సహచరి వసంతకు సాయిబాబా రాసిన లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 90 శాతం వైకల్యంతో ఎవరి సాయం లేకుండా అంగుళం కూడా కదల్లేని పరిస్థితుల్లో నేలమీద పాకుతూ ఓ జంతువులా తాను బతుకుతున్నానని, తనకు స్వెట్టర్ కానీ, కనీసం కప్పుకునేందుకు దుప్పటికానీ ఇవ్వలేదని, నవంబర్‌లో గడ్డకట్టుకుపోయే చలిని తట్టుకొని తాను బతకడం అసాధ్యమైన విషయమని, తాను ఉన్న అత్యంత దయనీయమైన పరిస్థితుల గురించి వసంతకు రాసిన లేఖలో దుఃఖభరితంగా వివరించారు. నేలమీద పాకుతూ 90 శాతం అంగవైకల్యంతో ఉన్న మనిషి జైల్లో ఉన్నాడన్న విషయం ఎవరికీ పట్టకపోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ త్వరితగతిన సీనియర్ లాయర్‌తో మాట్లాడి తన ప్రాణాలను కాపాడాలని ఆయన లేఖలో కోరారు. తానొక భిక్షగాడిలా తన గురించి పట్టించుకోవాలంటూ పదే పదే ప్రాధేయపడాల్సి రావడం కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ మొదటి వారంలో బెయిలు పిటిషన్ దాఖలు చేయాలని లేఖలో కోరారు. అలా జరగకపోతే తన పరిస్థితి చేయిదాటిపోతుందని పేర్కొన్నారు. ఇదే చివరి ఉత్తరం అని, ఇక మీదట తానీ విషయాన్ని రాయబోనని కూడా లేఖలో తేల్చిచెప్పారు. తనను పట్టించుకోకపోవడాన్ని నేరపూరిత నిర్లక్ష్యంగా సాయిబాబా వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే హైదరాబాద్‌కి తరలించాలి... విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ఆయన బెయిలుకోసం ప్రయత్నాలు జరుగు తున్నాయని, ప్రభుత్వం సాయిబాబా పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం మాను కోవాలని, తక్షణమే ఆయనకు అత్యవసర మందులు అందించాలని, తన కనీస అవసరాలు తీర్చాలని కోరారు, సాయిబాబా అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తనను హైదరాబాద్ జైలుకు తక్షణమే తరలించి సరైన వైద్య సదుపాయం అందించాలని వరవరరావు డిమాండ్ చేశారు. తన గురించి పట్టించుకోని ప్రభుత్వం, పాల కులు, సమాజం బాధ్యతను లేఖ గుర్తు చేస్తోం దని పౌర హక్కుల సంఘం నాయకులు నారా యణరావు, ప్రొ.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. –వరవరరావు, నారాయణరావు, ప్రొఫెసర్ లక్ష్మణ్ -
ప్రొ‘‘ సాయిబాబను కాపాడుకుందాం!
నాగపూర్ సెంట్రల్ జైలులోని అండా సెల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటికీ దిగజారడంతో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదికతో కలిసి ఫిర్యాదు చేశారు. ఆయనకు శిక్ష విధించే కొద్ది రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధికి సంబంధించిన ఆపరేషన్ మూడు వారాలలో చేయాలనీ డాక్టర్లు సూచించారు. ఈ మూడు నెలల కాలంలో ప్రొ. సాయిబాబకు జైలులో ఏ విధమైన వైద్య సహాయం అందలేదు. జైలు అధికారులు కానీ, డాక్టర్స్ కానీ మహారాష్ట్ర ప్రభుత్వం గానీ వైద్య సహాయం అందించలేకపోవడం వలన ఆయన ఆరోగ్యం బాగా పాడైపోయింది. మే నెల లోనే రెండుసార్లు స్పృహ తప్పడం జరిగింది. క్లోమ గ్రంధికి సంబంధించిన నొప్పి తీవ్రతరం అయింది. ఛాతి నొప్పి, గుండెదడ రావడం జరిగింది. జైలు డాక్టర్లు నాగపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచిం చినా జైలు అధికారులు ఒప్పుకోలేదు. ప్రస్తుతం నాగపూర్ జైలులో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబ 90 శాతం శారీరక వైకల్యంతో వీల్ చెయిర్‌లోనే గడపాల్సిన పరిస్థితిలో ఉంటున్నారు. జైలులోని దుర్భర పరిస్థితులకు తోడు దాదాపుగా ఎవరిని కలిసే అవకాశం లేకుండా చేస్తున్నారు. పోలీసు, జైలు సిబ్బంది ఆయన పట్ల అత్యంత మొరటుతనంతో వ్యవహరిస్తున్నారు. జైలులో ప్రొ. సాయిబాబ ఆరోగ్య పరిస్ధితిఫై జాతీయ మానవ హక్కుల కమిటీ (ఢిల్లీ) ఏక సభ్య బృందాన్ని మే 15వ తేదీన జైలుకు పంపింది. ప్రాణాం తక వ్యాధులను ఎదుర్కొంటున్న సాయిబాబకు ప్రాణ రక్షక చికిత్సను అందించడానికి బదులుగా ఆయనను జైలు డాక్టర్ పరీక్షించడానికి కూడా జైలు సిబ్బంది అనుమతించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జైల్లో సాయిబాబకు సృష్టిస్తున్న దుర్భర పరిస్థితులు ఆయన జీవితానికి, గౌరవానికి, సమానత్వ భావనకు భంగకరంగా మారడమే కాకుండా క్రూరమైన, అమానుషమైన పద్ధతులను పాటిస్తూ ఆయన ఆరోగ్య పరిరక్షణ హక్కు పట్ల కూడా వివక్ష ప్రదర్శిస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. జీవించే హక్కులో భాగంగా ప్రొ. సాయిబాబ ఆరోగ్యంపై జైలు అధికారులు, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. జైలులో ఉన్న సాయిబాబకు తగిన వైద్య సహాయం అందించాలి. గతంలో ఆయన వైద్యం చేయించుకున్న ఢిల్లీ ఆసుపత్రికి లేదా హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో ఉన్నాడు కాబట్టి అక్కడికే తరలించాలని డిమాండ్ చేస్తున్నాము. జైలులో ప్రొ. సాయిబాబ ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రభుత్వాలు కావాలనే ప్రొఫెసర్ సాయిబాబ ఆరోగ్యం విషమించాలని చూస్తున్నాయనిపిస్తోంది. జైలులోనే ఆయనను అనారోగ్యంతో చంపాలని చూస్తున్నాయి. జాతీయ మానవ హక్కుల కమిటీ వెంటనే స్పందించి ప్రొ. సాయిబాబకు తగిన వైద్య సహాయంతోబాటు, బెయిల్ ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం జరిగింది. ప్రొ. సాయిబాబ సహచరి ఎ.ఎస్. వసంత కుమారి నుంచి వచ్చిన ఈ సమాచారం నేపథ్యంలో నాగపూర్ హై సెక్యూరిటీ జైలు అండా సెల్లో ఉన్న ప్రొ. సాయిబాబను ప్రాణాలతో కాపాడుకోవాలంటే ఆయనను వెంటనే హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రికి తరలించడానికి వీలుగా సికింద్రాబాద్ చర్లపల్లి హై సెక్యూరిటీ జైలుకు తరలించాలని ప్రజాస్వామ్యవాదులందరూ స్పందించాల్సిందిగా కోరుతున్నాను. ఈ మేరకు మహారాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెట్టి ఆ రెండు ప్రభుత్వాలు అంగీకరించిన తరువాత తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా అభ్యంతరం లేని విధంగా కృషి చేయాలని కోరుతున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టులకు సెలవులు ఉన్నందున బెయిల్ కోసం ప్రయత్నాలు చేయడం కంటే ముందుగా ప్రజాస్వామ్యవాదులందరూ తక్షణం చేపట్టవలసిన కర్తవ్యం ఇది అని విజ్ఞప్తి చేస్తున్నాను. – వరవరరావు, విరసం వ్యవస్థాపక సభ్యుడు -
సాయిబాబా ఆరోగ్యంపై జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు సరైన వైద్యం అందేలా జోక్యం చేసుకోవాలని ఆయన భార్య వసంత కుమారి ఆధ్వరంలో ప్రతినిధి బృందం జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించింది. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని అండా సెల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. 90 శాతం వైకల్యంతో ఉన్నా సాయిబాబా కాలకృత్యాలు తీర్చుకోలేకపోవడంతో పాటు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారని ప్రతినిధి బృందం తెలిపింది. గత పది వారాల నుంచి జైలు అధికారులు సాయిబాబాకు సరైన వైద్యం అందించడం లేదని వసంత కుమారి ఆరోపించారు. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాకు కోర్టు ఇంతకుముందు యావజ్జీవ శిక్ష విధించింది. -
సాయిబాబా కోసం చలో ఢిల్లీ
మహబూబ్‌నగర్ : ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఏడుగురు సభ్యులను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ ప్రజా స్వామిక వేదిక ఆధ్వర్యంలో ఈనెల 30 వ తేదిన నిర్వహించతలపెట్టిన చలో డిల్లీ పోస్టర్‌ను శనివారం స్తానిక టీఎన్‌టీఓ భవన్లో ఆవిష్కరించారు. ఈసందర్బంగా టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, టీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భూషన్, పాలమూర్ అద్యాయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవాచారీ, టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి మాట్లాడుతు సాయిబాబతోపాటు మరో ఐదుగురు సహచరులను వెంటనే విడుదల చేయాలని కోరారు. గురువావ్ మారుతి కంపెనికి చెందిన 13 మంది కార్మికులకు విధించిన జీవిత ఖైదును వెంటనే రద్దు చేయాలని కోరారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బంగార్ గ్రామానికి చెందిన భూఆందోళన కారులు, హక్కుల సంఘాల నేతలపై పెట్టిన యూఏపీఏ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. ఈ మేరకు ఈనెల 30వ తేదిన డిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాస్వామిక వాదులు హాజరు కావాలనికోరారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అద్యక్షుడు వామన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యంపై ఆందోళన
-
ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు
-
ప్రొఫెసర్ సాయిబాబాకు జీవితఖైదు
► మరో నలుగురికీ యావజ్జీవ శిక్ష విధించిన గడ్చిరోలి కోర్టు ► విధ్వంసం సృష్టించేందుకు నిందితుడు కుట్రపన్నాడన్న కోర్టు ముంబై, సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు(47) జీవిత ఖైదు విధిస్తూ మహారాష్ట్రల్లోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. మరో నలుగురికి జీవిత ఖైదు విధించగా, మరొకరికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఢిల్లీ వర్సిటీ ఇంగ్లిషు ప్రొఫెసర్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ మే, 2014లో గడ్చిరోలి పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మావోయిస్టులకు సంబంధించిన పత్రాలు, సీడీలు, పెన్ డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో పోలీసులు ప్రకటించారు. దాంతో వర్సిటీ సాయిబాబాను సస్పెండ్ చేసింది. విధ్వంసం సృష్టించేందుకు, సమాజంలో అశాంతి రగిల్చేందుకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పట్ల విరోధభావం వ్యాప్తి చేసేందుకు నిందితుడు కుట్ర పన్నాడని తీర్పు సందర్భంగా గడ్చిరోలి కోర్టు పేర్కొంది. అందుకు నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న నక్సల్స్ సాహిత్యమే సాక్ష్యమని, ఆ సాహిత్యాన్ని మావోయిస్టులు, ఆర్డీఎఫ్(రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్)తో పాటు ఇతరులకు సాయిబాబా అందచేశారని న్యాయమూర్తి షిండే తీర్పులో పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద సాయిబాబా, అతని సహచరుల్ని దోషులుగా కోర్టు నిర్ధారించింది. సాయిబాబాతో పాటు వర్సిటీ విద్యార్థి హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్రాయ్తో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. అనారోగ్య కారణాలతో సాయిబాబాపై కనికరం చూపాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. మే, 2014లో సాయిబాబా అరెస్టు అనంతరం అతని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మే, 2015లో బోంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం మళ్లీ జైలు కెళ్లడంతో బెయిల్ కోసం సాయిబాబా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 2016లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవకుండా మినహాయింపునిచ్చింది. సుప్రీం తీర్పునకు విరుద్ధం: వరవరరావు మావోలతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు మరో నలుగురికి జీవిత ఖైదు విధిస్తూ గడ్చిరోలి సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని విరసం నేత వరవరరావు అన్నారు. నిషేధిత పార్టీతో సంబంధం ఉండడం లేదా ఆ పార్టీ రాజకీయ విశ్వాసం కలిగి ఉండడం, చివరకు ఆ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడం వాటికవిగా శిక్షార్హమైనవి కావని సుప్రీంకోర్టు ఇటీవలే ఓ కేసులో తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. -
ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు
హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబాకు మహారాష్ట్రలోని గడ్చిరోలి ఓ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని విశ్వసించి ఈ మేరకు తీర్పునిచ్చినట్లు న్యాయస్థానం పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను గడ్చిరోలి పోలీసులు 2014లో అరెస్టు చేశారు. వికలాంగుడైన ఆయన తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో తర్వాత ప్రభుత్వం విడుదల చేసింది. ఆయనపై ఉన్న ఆరోపణలను గడ్చిరోలి న్యాయస్థానం ఇటీవల విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపైనే ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు జేఎన్టీయూ విద్యార్థి హేమ్ మిశ్రా, మాజీ జర్నలిస్టు ప్రశాంత్ రాహి తదితరులకు కూడా ఇదేవిధంగా జీవిత ఖైదు విధించింది. -
ప్రొ.సాయిబాబాకు బెయిల్ మంజూరు
-
ప్రొ.సాయిబాబాకు బెయిల్ మంజూరు
ముంబై: ఏడాదిగా జైల్లో గడుపుతున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం బాంబే హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏడాది క్రితం మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సాయిబాబాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. సాయిబాబాకు బెయిల్ మంజూరు చేసేందుకు గతంలో న్యాయస్థానాలు తిరస్కరించాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్ ఇవ్వాలని సాయిబాబా చేసుకున్న విన్నపాన్ని మన్నించి బాంబే హైకోర్టు మంజూరు చేసింది. -
ఈ తీరు సబబేనా?!
రాజ్యం ఔన్నత్యం దాని ప్రకటిత లక్ష్యాల్లో కంటే...ఆ లక్ష్యాలను త్రికరణశుద్ధిగా ఆచరించే తీరులోనే వ్యక్తమవుతుంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ పరిషత్ మాగ్నకార్టా మొదలుకొని అనేక దేశాల రాజ్యాంగాలను విపులంగా అధ్యయనం చేసి మనకొక అపురూపమైన లిఖిత రాజ్యాంగాన్ని అందించింది. కనుక దాన్ని ఆచరించడంలో సందిగ్ధతకు తావుండాల్సిన అవసరం లేదు. అయితే, మావోయిస్టు పార్టీ నేతలుగా, సానుభూతిపరులుగా భావిస్తున్న వారి విషయంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీప గ్రామానికి చెందిన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో అరెస్టు చేసి ఏడాది గడిచింది. ఆయన వృత్తిరీత్యా ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా, విశ్వాసాలరీత్యా విప్లవ ప్రజాస్వామిక వేదిక బాధ్యుడిగా ఉన్నారు. ఆ క్రమంలో ఆయన దేశవ్యాప్తంగా జరిగిన అనేక బహిరంగ సభల్లో మాట్లాడారు. ధర్నాల్లో పాల్గొన్నారు. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో ఎన్నో రచనలు చేశారు. ఇవేవీ ఆయన రహస్యంగా చేసినవి కాదు. చట్టం అనుమతించిన పరిధుల్లో, పరిమితుల్లో చేసినవి. పైగా ఆయన 90 శాతం శారీరక వైకల్యం ఉన్న మనిషి గనుక ఎక్కడికెళ్లాలన్నా చక్రాల కుర్చీయే ఆధారం. ఆయనకు తోడుగా కనీసం ఒకరైనా ఉంటే తప్ప కదల్లేని స్థితి. ఇట్లాంటి స్థితిలో ఉన్న ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ పోలీసులు చెబుతున్నట్టు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అరణ్యంలో మావోయిస్టులతో కలిసి కుట్ర చేశారన్న ఆరోపణ నిజమే అనుకున్నా...ఆ విషయంలో న్యాయస్థానం తీర్పు వెలువరించేంతవరకూ ఆయన నిర్దోషికిందే లెక్క. ఆరో శతాబ్దంలోని రోమన్ లా చెప్పిన ఈ సూత్రం మన రాజ్యాంగంలోని 20(3), 21 అధికరణలద్వారా...నేర శిక్షాస్మృతిలోని వివిధ సెక్షన్ల ద్వారా వ్యక్తమైంది. ప్రపంచ మానవ హక్కుల ప్రకటనలోని 11వ అధికరణ చెబుతున్నదీ ఇదే. అయితే, సాయిబాబా విషయంలో దీన్ని పాటించడానికి నాగపూర్ సెంట్రల్ జైలు అధికారులకైనా, వారిపై అజ్మాయిషీ చెలాయించే అధికార యంత్రాంగానికైనా అభ్యంతరం ఉండవలసిన అవసరం ఏమిటో అర్థంగాని విషయం. ఆయనకు అంగవైకల్యంతోపాటు గుండెజబ్బు, నరాల క్షీణత, వెన్నెముక సంబంధ వ్యాధి, రక్తపోటు వంటివి ఉన్నాయి. అలాంటి వ్యక్తిని గాలి, వెలుతురు చొరబడని అండా సెల్లో నిర్బంధించమంటే న్యాయస్థానం శిక్ష ప్రకటించకముందే దాన్ని అమలు చేయడం. సాయిబాబాకు అవసరమైన మందులు సైతం అందుబాటులో ఉంచడంలేదని, తక్షణం చికిత్స అందకపోతే ప్రాణాపాయం ఏర్పడుతుందని వచ్చిన ఫిర్యాదును పిటిషన్‌గా స్వీకరించి బొంబాయి హైకోర్టు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించాలని ఆదేశించింది. అంతక్రితం సాయిబాబా గురించి టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు, మరో ఆరుగురు ఎంపీలు కేంద్ర హోంమంత్రిని కలిసినా ఫలితం లేకపోయిందని విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఉన్నత విద్యావంతుడైన వ్యక్తి...అందునా శారీరకంగా నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తి విషయంలో ఇంత క్రూరంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా? అయిదేళ్ల క్రితం అరెస్టయిన మావోయిస్టు పార్టీ నాయకుడు కోబాడ్ గాంధీ విషయంలోనూ తీహార్ జైలు అధికారులు ఈ తీరులోనే వ్యవహరించారు. కిడ్నీలకు సంబంధించిన తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్న తనకు అవసరమైన మందులు, చికిత్స అందించకుండా...తరచుగా ఒక సెల్‌నుంచి మరో సెల్‌కు మారుస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ ఆయన గత నెల 30నుంచి నిరాహారదీక్షకు పూనుకున్నారు. ఆయన విషయంలో కూడా న్యాయస్థానం జోక్యం చేసుకుని ఆదేశాలివ్వాల్సివచ్చింది. ఇద్దరిపైనా పోలీసులు మావోయిస్టులని ఆరోపణలు చేసినా సాయిబాబా యూనివర్సిటీ అధ్యాపకుడిగా పనిచేస్తూ అరెస్టయిన వ్యక్తి. కోబాడ్ గాంధీ అజ్ఞాతంలో ఉండగా పట్టుబడినవారు. వీరిద్దరి విషయంలోనూ న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ఆదేశాలిచ్చాయంటే అధికార యంత్రాంగం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరించలేదనే అర్ధం. మావోయిస్టుల సిద్ధాంతంతో ఏకీభావం లేనివారు సైతం ఈ తీరును సమర్థించలేరు. మావోయిస్టులు లేదా వారి సానుభూతిపరుల విషయంలో కఠినంగా ఉంటే మిగిలినవారు భయపడి అలాంటి ఆచరణకు దూరంగా ఉంటారని ప్రభుత్వాలు భావిస్తున్నట్టు కనబడుతోంది. వాస్తవానికి మన రాజ్యాంగంలోని నాలుగో విభాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పాటిస్తే అన్నీ సక్రమంగా ఉంటాయి. సమస్యంతా వాటిని పట్టించుకోకపోవడంలోనే ఉంది. ప్రజలందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం లభించేలా, ఆదాయ వ్యత్యాసాలను పారదోలే విధంగా ప్రభుత్వ విధానాలుండాలని... పౌరులందరికీ అవసరమైన జీవికను కల్పించాలని... స్త్రీ, పురుషులకు సమాన వేతనాలు, సమాన పని పరిస్థితులు ఉండేలా చూడాలని ఆదేశిక సూత్రాలు చెబుతాయి. భూ సంస్కరణలు సక్రమంగా అమలైతే, అడవుల్లోని ఆదివాసీల జీవికకు ఎసరు తెచ్చే విధానాలకు స్వస్తి పలికితే... సంక్షేమ రాజ్య సాధనకు ప్రభుత్వాలు కట్టుబడి ఉంటే సమాజంలో ఉద్రిక్తతలు తలెత్తవు. వాటిని ఆసరా చేసుకుని బయల్దేరే సామాజిక, రాజకీయ ఉద్యమాలు ఉండవు. ఆదేశిక సూత్రాల అమలులో విఫలమవుతూ...అణచివేతనే పరిష్కారంగా ఎంచుకుంటే సమస్యలింకా పెరుగుతాయి తప్ప తరగవు. మహా నగరాల్లోని జైళ్లలో నిర్బంధంలో ఉన్న వ్యక్తుల విషయంలోనే ఇలా ఉంటే ఎక్కడో అడవుల్లో తమపై కాల్పులకు తెగబడిన 19 ఏళ్ల వివేక్ అనే యువకుణ్ణి ఎదురు కాల్పుల్లో హతమార్చామని పోలీసులు చెబితే ఎవరైనా నమ్మగలరా? అతను తప్పే చేసివుంటే అరెస్టుచేసి సరైన కౌన్సెలింగ్ ఇచ్చి సక్రమ మార్గంలో పెట్టవచ్చు కదా అని అంటున్న ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ప్రభుత్వాలిచ్చే జవాబేమిటి? స్వాతంత్య్రం వచ్చాక ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో మన ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోవడంవల్లే అటవీ ప్రాంతాల్లో నక్సల్ ఉద్యమం వేళ్లూనుకుంది. హింసాత్మక ఘటనలకు పాల్పడేవారి విషయంలో చర్యలు తీసుకోవద్దని ఎవరూ అనరు. కానీ ఆ మాటున రాజ్యాంగ విలువలకూ, చట్టబద్ధ పాలనకూ తిలోదకాలిస్తే హర్షించరు. జవాబుదారీ తనం, పారదర్శకత పాలనకు వన్నె తెస్తాయి. వాటికి పాతరేసే విధానాలవల్ల ప్రపంచంలో మనం పలచనవుతాం. పాలకులు ఈ సంగతిని గుర్తించాలి.