మహబూబ్‌నగర్ : ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఏడుగురు సభ్యులను వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ ప్రజా స్వామిక వేదిక ఆధ్వర్యంలో ఈనెల 30 వ తేదిన నిర్వహించతలపెట్టిన చలో డిల్లీ పోస్టర్‌ను శనివారం స్తానిక టీఎన్‌టీఓ భవన్‌లో ఆవిష్కరించారు. ఈసందర్బంగా టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, టీపీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భూషన్, పాలమూర్ అద్యాయన వేదిక జిల్లా కన్వీనర్ రాఘవాచారీ, టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి మాట్లాడుతు సాయిబాబతోపాటు మరో ఐదుగురు సహచరులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
గురువావ్ మారుతి కంపెనికి చెందిన 13 మంది కార్మికులకు విధించిన జీవిత ఖైదును వెంటనే రద్దు చేయాలని కోరారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బంగార్ గ్రామానికి చెందిన భూఆందోళన కారులు, హక్కుల సంఘాల నేతలపై పెట్టిన యూఏపీఏ కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. ఈ మేరకు ఈనెల 30వ తేదిన డిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజాస్వామిక వాదులు హాజరు కావాలనికోరారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ జిల్లా అద్యక్షుడు వామన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాయిబాబా కోసం చలో ఢిల్లీ
Published Sat, Apr 22 2017 10:20 PM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM
Advertisement
Advertisement