మీట్ ది ప్రెస్‌లో ప్రొఫెసర్ సాయిబాబా
తొమ్మిదేళ్లు నాగ్‌పూర్ జైల్లోని అండాసెల్‌లోనే ఉంచారు
21 రకాల జబ్బుల బారిన పడ్డా
తొలిసారి దివ్యాంగుడిననే భావన కలిగినా
ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు
ఉద్యమ పంథా వీడను.. బోధన వృత్తిలో కొనసాగుతా
సాక్షి, హైదరాబాద్: తప్పుడు కేసుల కారణంగా పదేళ్లు నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో చిత్రహింసల కొలిమిలో మగ్గిపోయానని, తొమ్మి దేళ్లు తనను అండా సెల్లోనే (జైలు ఆవరణ లోపలి ప్రత్యేక జైలు) ఉంచారని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, మానవహక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా తెలిపారు. ఇంత నిర్బంధం ఎదుర్కొన్నప్పటికీ తన ఉద్యమ పంథాను వీడనని, అధ్యాపకుడిగా కొనసాగుతా నని స్పష్టం చేశారు. తెలంగాణ స్టేట్ యూని యన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడ బ్ల్యూజే) శుక్రవారం బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా రు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జి.హర గోపాల్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కె.విరా హత్ అలీతో కలిసి సాయిబాబా మాట్లాడారు.
పదేళ్ల తర్వాత స్వేచ్ఛగా మాట్లాడుతున్నా..
‘జైలు జీవితం అంతా చీకటి రోజులు. అందులో రెండేళ్ల కరోనా సమయం మరింత దారుణం. పదేళ్ల తర్వాత తెలంగాణలో స్వేచ్ఛగా మాట్లాడుతున్నా. రాజ్య హింస నుంచి ఆదివాసీయులను కాపాడేందుకు జస్టిస్ రాజేంద్ర సచార్, మరికొందరు సామాజిక వేత్తలతో కలిసి ‘ఫోరం అగైనెస్ట్ వార్ అండ్ పీపుల్’ను స్థాపించి ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’కు వ్యతిరేకంగా ప్రచారం చేయడమే నా అరెస్టుకు ప్రధాన కారణం. ఆపరేషన్ గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాటం ఆపాలని నన్ను, నా భార్య వసంతను కొందరు బెదిరించారు.
మాట వినకపోతే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతామని చెప్పడంతో పాటు చేసి చూపించారు. నన్ను ఢిల్లీలో కిడ్నాప్ చేసి గడ్చిరోలికి తీసుకు వచ్చా రు. అక్కడ మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేసి నాగ్‌పూర్ జైలుకు తరలించారు. ఆ సమయంలో నా వీల్‌చైర్‌ను విరగ్గొట్టారు. నన్ను బయటికి ఈడ్చారు. ఆ దాడితో నా ఎడమ చేతి నరాలు దెబ్బతిన్నాయి. జైల్లో పెట్టిన తర్వాత 9 నెలలు నాకు కేవలం నొప్పిని తగ్గించే మాత్రలే ఇచ్చారు తప్ప డాక్టర్‌కు చూపించలేదు. పదే ళ్లలో కొన్నిసార్లు మాత్రమే ఆసుపత్రికి తీసుకె ళ్లారు. సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో ఎడమ చేయి పూర్తిగా పడిపోయింది.
క్రమంగా ఊపిరి తిత్తులు, గుండెపై ప్రభావం పడింది. చిన్ననాటి నుంచి పోలియో తప్ప మరే జబ్బులు లేని నేను, జైలుకు వెళ్లిన తర్వాత 21 రకాల జబ్బుల బారినపడ్డా. కనీసం గ్లాస్ మంచినీళ్లు తాగలేని స్థితి. బాత్‌రూంకు ఇద్దరు మోసుకెళ్లాల్సిన దుస్థితి. ఇతర ఖైదీలతో కలవకుండా చేశారు. అప్పుడే తొలిసారి నేను దివ్యాంగుడిని అన్న భావన కలిగినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు..’ అని సాయిబాబా చెప్పారు.
జైల్లో కుల వ్యవస్థ విచ్చలవిడిగా ఉంది
‘నాగ్‌పూర్ జైల్లో కుల వ్యవస్థ విచ్చలవిడిగా ఉంది. మహారాష్ట్ర జైలు మాన్యువల్‌లో కుల వ్యవస్థ గురించి, ఖైదీలను అవసరం అయితే కొంత హింసించవచ్చని రాసి ఉంది. నక్సల్స్, గ్యాంగ్‌స్టర్స్, పొలిటికల్ కేసులు మినహా మిగతా కేసుల్లో సాధారణ ఖైదీలను క్రమ శిక్షణ పేరిట చిత్రహింసలు పెడుతున్నారు. జైల్లో ఉన్న పదే ళ్లలో సాహిత్యమే నాకు ఊరటను, ఆత్మవిశ్వా సాన్ని ఇచ్చింది. అనేకమార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా చేదు అనుభవ మే ఎదురైంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న మా అమ్మను చివరి దశలో చూసేందుకు, ఆమె అంత్య క్రియల్లో పాల్గొనేందుకు కూడా బెయిల్ దక్కలేదు.
చివరకు ‘ఒక మేధావిని హింసించడం తప్ప ఈ కేసులో ఏమీ లేదు’ అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నా బెయిల్ ఉత్తర్వుల్లో రాశారు. రాజ్య వ్యవ స్థలో మిగిలిన వ్యవస్థలు పతనమవుతుంటే అందులోనే ఒక భాగమైన న్యాయ వ్యవస్థ నిలబ డదు. ప్రజా ఉద్యమం తీవ్రంగా ఉంటేనే కోర్టు లు న్యాయాన్ని త్వరగా అందిస్తాయి. అయితే క్రమంగా న్యాయవ్యవస్థ పైనా నమ్మకం సన్న గిల్లుతోంది. దీనిని జడ్జీ్జలుకూడా అర్ధం చేసుకుంటున్నారు..’ అని సాయిబాబా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment