న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు సరైన వైద్యం అందేలా జోక్యం చేసుకోవాలని ఆయన భార్య వసంత కుమారి ఆధ్వరంలో ప్రతినిధి బృందం జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)ను ఆశ్రయించింది. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని అండా సెల్‌లో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.
90 శాతం వైకల్యంతో ఉన్నా సాయిబాబా కాలకృత్యాలు తీర్చుకోలేకపోవడంతో పాటు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారని ప్రతినిధి బృందం తెలిపింది. గత పది వారాల నుంచి జైలు అధికారులు సాయిబాబాకు సరైన వైద్యం అందించడం లేదని వసంత కుమారి ఆరోపించారు. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాకు కోర్టు ఇంతకుముందు యావజ్జీవ శిక్ష విధించింది.
సాయిబాబా ఆరోగ్యంపై జోక్యం చేసుకోండి
Published Fri, Jun 2 2017 11:32 AM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM
Advertisement