Vasantha Kumari
-
సాయిబాబా ఆరోగ్యంపై జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు సరైన వైద్యం అందేలా జోక్యం చేసుకోవాలని ఆయన భార్య వసంత కుమారి ఆధ్వరంలో ప్రతినిధి బృందం జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ)ను ఆశ్రయించింది. ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని అండా సెల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. 90 శాతం వైకల్యంతో ఉన్నా సాయిబాబా కాలకృత్యాలు తీర్చుకోలేకపోవడంతో పాటు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నారని ప్రతినిధి బృందం తెలిపింది. గత పది వారాల నుంచి జైలు అధికారులు సాయిబాబాకు సరైన వైద్యం అందించడం లేదని వసంత కుమారి ఆరోపించారు. మావోయిస్టులతో సంబంధాలున్న కేసులో సాయిబాబాకు కోర్టు ఇంతకుముందు యావజ్జీవ శిక్ష విధించింది. -
'ఆయనకు శిక్ష.. బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ కుట్ర'
ముంబై: తన భర్తకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించడంపై ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా భార్య వసంత కుమారి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చార్జిషీటులో ఉన్న నిందితులందరికీ శిక్ష విధించడం మహారాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారని వెల్లడించారు. ఇదంతా బీజేపీ-ఆర్ ఎస్ ఎస్ కుట్ర అని ఆరోపించారు. 'ఆర్ ఎస్ ఎస్ అజెండాను నిసిగ్గుగా బీజేపీ ప్రభుత్వం అమలుచేస్తోంది. ఇందులో భాగంగా సాయిబాబా లాంటి వారిని అణచివేస్తోంది. అప్రజాస్వామిక విధానాలు, ప్రజా సమస్యలపై గళమెత్తిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతోంద'ని ఫస్ట్ పోస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వసంత కుమారి చెప్పారు. ప్రాసిక్యూషన్ ఎటువంటి ఆధారాలు చూపకపోయినా కోర్టు శిక్ష విధించడం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సెషన్స్ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. సాయిబాబాతో పాటు కేశవదత్త మిశ్రా(జేఎన్ యూ విద్యార్థి), మహేష్ కరిమాన్ తిక్రి, పాండు పొరా నరోటీ(గడ్చిరోలి రైతులు)లకు కోర్టు జీవితఖైదు విధించగా.. విజయ్ నాన్ తిక్రి(ఛత్తీస్ గఢ్ కు చెందిన గిరిజన కార్మికుడు)కి పదేళ్ల కఠిన కారాగార శిక్ష వేసింది. -
అసభ్య మెసేజ్‌లు పంపిన ఉద్యోగికి దేహశుద్ధి
హైదరాబాద్ : సెల్‌ఫోన్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఓ రైల్వే ఉద్యోగికి.. టీఆర్ఎస్ మహిళా డివిజన్ అధ్యక్షురాలు వసంతకుమారి దేహశుద్ధి చేశారు. గత కొంతకాలంగా ఓ రైల్వే ఉద్యోగి.. వసంతకుమారికి...ఫోన్లో వేధింపులతో పాటు అసభ్య మెసేజ్‌లు పంపిస్తున్నట్లు సమాచారం. దాంతో విసిగిపోయినా ఆమె...అతగాడిని గురువారం బోయిన్‌పల్లికి రమ్మని పిలిచింది. అక్కడ వచ్చిన ఉద్యోగికి దేహశుద్ది చేసిన ఆమె అనంతరం తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.