
ప్రొ.సాయిబాబాకు బెయిల్ మంజూరు
ముంబై: ఏడాదిగా జైల్లో గడుపుతున్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం బాంబే హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
ఏడాది క్రితం మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై సాయిబాబాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నాగ్పూర్ సెంట్రల్ జైల్లో గడుపుతున్నారు. సాయిబాబాకు బెయిల్ మంజూరు చేసేందుకు గతంలో న్యాయస్థానాలు తిరస్కరించాయి. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు బెయిల్ ఇవ్వాలని సాయిబాబా చేసుకున్న విన్నపాన్ని మన్నించి బాంబే హైకోర్టు మంజూరు చేసింది.