ఇల్లందు ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖలు | trs mla koram kananaiah gets warning letters from unknown | Sakshi
Sakshi News home page

ఇల్లందు ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖలు

Published Wed, May 17 2017 4:32 PM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య - Sakshi

ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మావోయిస్టుల పేరుతో బెదిరింపులు వస్తుండటం జిల్లాలలో కలకలంగా మారింది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు రెండు సార్లు బెదిరింపు లేఖలు, రెండుసార్లు బెదిరింపు ఫోన్‌కాల్స్‌ వచ్చాయి.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ఎమ్మెల్యే కనకయ్యకు భద్రను పెంచారు. ఆయన నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమరాలు ఏర్పాటుచేయడంతో పాటు, రక్షణ కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన కొరం కనకయ్య.. కొద్ది నెలలకే టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. కాగా, బెదిరింపు వ్యవహారం మావోయిస్టుల పనేనా? లేక నకిలీలదా అనేది తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement