badradri
-
అంగరంగ వైభవంగా భద్రాద్రి సీతారాముల కల్యాణం
-
నేడు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన
-
భద్రాద్రి రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త మలుపు
-
భద్రాద్రి లడ్డూ ప్రసాదాల్లో అవకతవకలు
-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెడ్ కానిస్టేబుల్ కు దేహశుద్ధి
-
పురిటిపాట్లు..
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మొట్లతిమ్మాపురం గ్రామం.. మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వర్షాకాలం వస్తే మధ్యలో ఉన్న ఉడుముల (వట్టె)వాగు దాటి వెళ్లాలి. గత 4 రోజుల కింద గ్రామానికి చెందిన తోట రవీందర్ అనే యువకుడు వాగు దాటే ప్రయత్నం చేసి నీటిలో కొట్టుకుపోయి మరణించాడు. యువకుడే వాగు దాటలేక మరణిస్తే.. ఇక మహిళలు, గర్భిణుల పరిస్థితి ఎలా ఉంటుందో..! ‘భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం చింతపెట్టిగూడెం గ్రామం నుంచి బయటకు రావాలంటే మధ్యలో ఉన్న పారేటి వాగు దాటాలి. ఈ వాగు కొద్దిపాటి వర్షానికే పొంగుతుంది. దీంతో ఇటీవల ఆ గ్రామానికి చెందిన గర్భిణికి పురిటి నొప్పులు రాగా.. ఎడ్లబండిపై వాగు దాటించి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంగారుచెలక, అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొత్తగూడెం వెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. సాక్షి, మహబూబాబాద్: వానాకాలం వస్తే చాలు రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉండే గర్భిణులకు వణుకు మొదలవు తుంది. వాగులు, వంకలు దాటి ప్రసవం కోసం ఆస్పత్రుల కు వెళ్లాలంటే కత్తిమీద సాములా మారుతోంది. నిండుచూ లాలికి నొప్పులు వస్తే వారిని ఆస్పత్రికి తరలించడం ఎంత కష్టమో చెప్పలేం. ఏజెన్సీ ప్రాంతాల్లో గర్భిణులు ప్రసవం, ఇతర అత్యవసర వైద్యం చేయించుకోవాలంటే ముందుగా గిరిజన గ్రామాల రహదారిపై ఉన్న వాగులు దాటితేనే వైద్యం అందుతుంది. ఇక ఆ వాగు దాటాలంటే ఎడ్లబండ్లు, జోలెలే శరణ్యం. ఇలా రాష్ట్రంలోని మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని గిరిజనులు ఇలాంటి దారుణ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ జిల్లాల్లో నెలలు నిండిన మొత్తం గర్భిణులు దాదాపు 3,869 మంది ఉన్నట్లు అంచనా. ►మహబూబాబాద్ జిల్లా గంగారం, గూడూరు, కొత్తగూడ, బయ్యారం, గార్లతో పాటు నెల్లికుదురు, కేసముద్రం మండలాల్లోని పలు గ్రామాలకు సరైన రోడ్డు మార్గాలు లేవు. ఉన్నా మధ్యలో వాగులు దాటాల్సి ఉంటుంది. దీంతో ఊట్ల మట్టెవాడ, మొట్ల తిమ్మాపురం, ముస్మి, దొరవారి తిమ్మాపురం గ్రామాలతో పాటు ఏజెన్సీలోని 10 గ్రామాలకు రాకపోకలు బంద్ అవుతాయి. ►నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంత మండలం ముల్గర నుంచి కల్వకుర్తికి వెళ్లాలంటే దుందభివాగు దాటాలి. అమ్రాబాద్ మండలం కుమ్మరంపల్లి నుంచి సమీప ఆస్పత్రికి వెళ్లాలంటే మధ్యలో ఉన్న మందవాగు దాటాలి. ►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని మేడికుంట–మిట్టపల్లి మధ్య మస్మివాగు, రాఘబోయినగూడెం చెరువు అలుగు పడి ముల్కలపల్లి, బోటితండా మధ్య, ఇల్లెందు, తొడిదెలగూడెం మ«ధ్య చెరువు అలుగు పడటంతో పరిసర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతా యి. టేకులపల్లి మండలం రోళ్లపాడు, మురుట్ల, సాయ మ్మ, గడ్డిచెరువు ముర్రేడు వాగుల్లోకి వరద నీరు భారీగా చేరి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ముత్యాలంపాడు, తావుర్యాతండా, రాజుతండా, జండాలతండా, పెట్రాంచెలక సమీపంలోని వాగుల ఉధృతితో ఈ గ్రామాల రాకపోకలకు బ్రేక్ పడింది. సోములగూడెం, బిక్కుతండాపై లో లెవల్ బ్రిడ్జి ఉంది. బూడిదవాగు పొంగితే బ్రిడ్జిపై రాకపోకలు స్తంభిస్తాయి. గుండాల మండలంలో కిన్నెరసాని వాగుపై ఉన్న లో లెవల్ చప్టాల కారణంగా వర్షాలు కురిసినప్పుడు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. అశ్వాపురం–గొందిగూడెం ప్రధాన రహదారిపై ఉన్న లో లెవెల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తే గొందిగూడెం, గొందిగూడెం కొత్తూరు, ఎలకలగూడెం, మనుబోతులగూడెం గ్రామ పంచాయతీల్లోని 8 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ►ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రిమ్మ, తుమ్మపహాడ్, సిరికొండ, రాజులగూడ, నారాయణపూర్ గ్రామా లు. నేరేడుగండి, ఇంద్రవెల్లి, నార్నూరు, గాదిగూడ, ఉట్నూరు, బజార్హత్నూర్, బోథ్ మండలాల్లోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. ►ములుగు జిల్లాలో వాజేడు మండలంలో కొంగలవాగుల దాటితే పెనుగోడు గ్రామానికి, చాకలివాగు దాటితే వాజేడు మండల కేంద్రానికి వెళ్తారు. కన్నాయిగూడెం మండలం ఐలాపూర్, వెంకటాపురం–కె మండలంలో కర్రవానిగుంపు, మల్లారం గ్రామాలకు వెళ్లాంటే మద్యంలో కంకలవాగును దాటివెళ్లాల్సి ఉంటుంది. ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని జలగవంచతో పాటు జిల్లావ్యాప్తంగా ఇరువై గ్రామాలకు వర్షాకాలం వస్తే రోడ్డు మార్గం కూడా ఉండదు. బయ్యారం–మొట్లతిమ్మాపురం మధ్యలో ఉన్న ఉడుము వాగును దాటుతున్న మహిళలు -
గోదావరికి పోటెత్తిన వరద
భద్రాచలం అర్బన్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వరద ఉధృతితో గురువారం రాత్రి 11 గంటలకు గోదావరి నీటిమట్టం 17.03 అడుగులు ఉండగా, శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు 18.90 అడుగులకు చేరింది. అది పెరుగుతూ రాత్రి 11 గంటలకు 33.10 అడుగులకు చేరింది. ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి కూడా వరద నీరు ఉపనదుల ద్వారా గోదావరికి చేరడంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి మరింత పెరిగింది. అంతేకాకుండా ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని దిగువకు వదులుతుండటంతో శనివారం మధ్యాహ్నానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అప్పుడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశముంది. ఈ క్రమంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మరోవైపు, 1986లో వచ్చిన 75.6 అడుగుల నీటిమట్టంకన్నా పోలవరం బ్యాక్ వాటర్‌తో ఇప్పుడు భద్రాచలంలో గోదావరి ఒకట్రెండు అడుగులు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందన్న ప్రచారంతో ఏజెన్సీ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. -
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం
-
తెరుచుకున్న భద్రాద్రి ఆలయం
-
భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి
సాక్షి, భద్రాద్రి : ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో వేడుకలు వైభవంగా జరుతున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు వీఐపీలకు మాత్రమే ఉత్తర ద్వారా దర్శనానికి అనుమతిచ్చారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కుటుంభ సభ్యులకు మాత్రమే ఉచిత పాస్‌లను మంజూరు చేశారు. సాధారణ భక్తులకు ఉత్తర ద్వారం దర్శనానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 6గంటల 3నిమిషాల వరకు మాత్రమే వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని ఆలయ అధికారులు చెప్పారు. సాధారణ భక్తులను 6:30 నుంచి దర్శనానికి అనుమతిచ్చారు. రద్దీ దృష్ట్యా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు..భక్తులందరూ భౌతిక దూరం పాటించాలని విఙ్ఞప్తి చేశారు. ఇక వైకుంఠ ఏకాదశి వేడుకలు కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వేకవజామున నుంచే వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారం వద్ద స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల కలెక్టర్ జి.రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్తరద్వారం గుండా హరిహరులు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనానికి విచ్చేస్తున్నారు. -
భద్రాద్రి రాముడి పట్టాభిషేకం
-
శ్రీసీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబు
-
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
-
గుండాల ఎన్కౌంటర్.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని..
-
గ్రామస్థులకు శాపంగా మారిన ఓపెన్ క్రాష్ గనులు
-
‘మిషన్’ స్లో
అశ్వాపురం : ఇంటింటికీ తాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాతక్మంగా చేపడుతున్న మిషన్ భగీరథ పనులు అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ నిర్లక్ష్యంతో ఆలస్యమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో గల 23 మండలాల్లోని 1826 గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.2250 కోట్లతో మిషన్ భగీరథ పథకం పనులు చేపడుతున్నారు. అశ్వాపురం మండల పరిధిలోని కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై ఇన్‌టేక్ వెల్, అప్రోచ్‌బ్రిడ్జి, ఫిల్టర్‌బెడ్, మిట్టగూడెం రథంగుట్ట వద్ద 40 ఎంఎల్డీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సంప్, 900 కేఎల్, 3900 కేఎల్ సామర్థ్యం గల రిజర్వాయర్లు, పైప్‌లైన్ పనులు చేస్తున్నారు. కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్, అప్రోచ్‌బ్రిడ్జి, ఫిల్టర్‌బెడ్, రథంగుట్ట వరకు పైప్‌లైన్ పనులు డిసెంబర్ 31 నాటికి పూర్తి కావాలని ప్రభుత్వం గడువు విధించింది. కానీ జనవరి దాటినా ఇన్‌టేక్‌వెల్ పనులు పూర్తికాలేదు. ఇందులో 6 టర్బైన్లకు పంపింగ్ మోటార్లు, ప్యానల్‌బోర్డులు, ఎలక్ట్రానిక్ పనులు, అప్రోచ్ బ్రిడ్జి మీదుగా మిట్టగూడెం రథంగుట్ట వరకు ప్రధాన పైప్‌లైన్ పనుల్లో జాప్యం జరుగుతోంది. రబీకి నీటి విడుదలతో... రబీ సీజన్ ప్రారంభం అవుతుండటంతో పాములపల్లి లిఫ్ట్ ద్వారా గోదావరి నీరు పొలాలకు వదులుతుండటంతో రథంగుట్ట వరకు ప్రధాన పైప్‌లైన్ పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో జరుగుతున్న అంతర్గత పైపులైన్లు, వాటర్‌ట్యాంక్‌ల నిర్మాణాలు కూడా నత్తనడకన సాగుతున్నాయి. 752 వాటర్‌ట్యాంక్‌లకు ఇప్పటి వరకు సగం కూడా పూర్తి కాలేదు. ఈ పనులకు మార్చి వరకు గడువు ఉందని, ఆ లోపు పూర్తి చేస్తామని అధికారులు అంటున్నారు. ట్రయల్ రన్‌కు సిద్ధం కాని పనులు.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ప్రాధాన్యమైన దుమ్ముగూడెం ఇన్‌టేక్‌వెల్ పనులపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికే పనులను పలుమార్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పర్యవేక్షించారు. అయినా పనుల్లో పురోగతి లేదు. కుమ్మరిగూడెం, మిట్టగూడెం రథంగుట్ట వద్ద జరుగుతున్న పనులను జనవరి 6న పరిశీలించిన వేముల ప్రశాంత్‌రెడ్డి, స్మితా సబర్వాల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాప్యంపై అధికారులను మందలించారు. అంతేకాక అధికారులు, నిర్మాణ సంస్థతో మిట్టగూడెంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి జనవరి నెలాఖరు నాటికి ఇన్‌టేక్‌వెల్ పనులు పూర్తి చేయాలని, టర్బైన్లకు మోటార్లు బిగించాలని, అప్రోచ్ బ్రిడ్జి నుంచి రథంగుట్ట వరకు ప్రధాన పైప్‌లైన్ పనులు పూర్తి చేసి ట్రయల్‌రన్‌కు సిద్ధం చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తే సహించేది లేదని, కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. జనవరి 25 వరకు ఇన్‌టేక్ వెల్ పనులు పూర్తి చేస్తామని అధికారులు, నిర్మాణ సంస్థ చెప్పాయి. కానీ 25 రోజులు గడిచినా పనుల్లో ఏ మాత్రం పురోగతి లేదు. ట్రయల్‌రన్‌కు మరో నెల రోజులు పట్టే అవకాశం ఉంది. అత్యంత ప్రాధాన్యంగా మిట్టగూడెం రథంగుట్ట కుమ్మరిగూడెంలో నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్, రథంగుట్ట వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, రెండు రిజర్వాయర్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. కుమ్మరిగూడెంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న ఇన్‌టేక్ వెల్ పూర్తయితే ఇక్కడి నుంచి రథంగుట్ట వరకు ప్రధాన పైప్‌లైన్ ద్వారా గోదావరి నీటిని 900 కేఎల్, 3900 కేఎల్ సామర్థ్యం గల రిజర్వాయర్లకు పంపిస్తారు. తద్వారా పినపాక, కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల పరిధిలోని 1826 గ్రామాలకు, మణుగూరు, పాల్వంచ , కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి మున్సిపాలిటీలకు తాగునీరు అందించనున్నారు. 900 కేఎల్ రిజర్వాయర్ ద్వారా పినపాక నియోజకవర్గానికి, 3900 కేఎల్ రిజర్వాయర్ ద్వారా మిగిలిన నియోజకవర్గాలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయనున్నారు. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు తాగునీరు అందించేందుకు పర్ణశాల వద్ద 13.5 ఎంఎల్డీ, వాజేడు, వెంకటాపురం మండలాలకు తాగునీరు అందించేందుకు పూసూరు వద్ద 9 ఎంఎల్డీ వాటర్ ట్రీట్‌మెంట్‌ప్లాంట్లు నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తాం పనులు వేగవంతం చేసి ఫిబ్రవరి నెలాఖరుకు మిషన్ భగీరథ పనులు పూర్తి చేస్తాం. ఇన్‌టేక్‌వెల్‌లో టర్బైన్లకు పంపింగ్, మోటార్లు అమర్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 10 నాటికి ఇన్‌టేక్‌వెల్‌లో మోటర్లు, ప్యానల్‌బోర్డులు అమర్చే ప్రక్రియ పూర్తి చేస్తాం. అప్రోచ్‌బ్రిడ్జి, ఫిల్టర్‌బెడ్, రథంగుట్ట వరకు ప్రధాన పైపులైన్ పనులు 15 రోజుల్లో పూర్తి చేసి ట్రయల్‌రన్‌కు సిద్ధం చేస్తాం. – మహేందర్‌రెడ్డి, డీఈ, మిషన్ భగీరథ -
అరెస్టయ్యాడోచ్..!
ఇల్లెందు: అలా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకండి..! అతడు అరెస్టయినందుకు అటు పోలీసులు, ఇటు ఎన్డీ(చంద్రన్న) నాయకులు ‘ఆనందపడుతున్నారు’..!! ఔను, మీరు చదివింది అక్షరాలా నిజమే..!!! ‘ఎందుకు? ఏమిటి?’ అంటూ, ఒకేసారి ప్రశ్నల వర్షం కురిపించ కండి. అంతగా తెలుసుకోవాలనుకుంటే.. కింది కథనాన్ని తీరిగ్గా చదవండి.. ఎన్డీ(చంద్రన్న) యువ నాయకుడైన మోరే రవి ఎట్టకేలకు పోలీసుల చెంతకు ‘చేరాడు’. లొంగిపోయాడా..? అరెస్టయ్యాడా? ఏదైతేనేం..! అటు పోలీసులు, ఇటు ఎన్డీ నాయకత్వం కోరుకున్నదే జరిగింది. ఎవరీ రవి..? ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామస్తుడు. న్యూడెమోక్రసీ అనుబంధ పీవైఎల్‌లో పనిచేశాడు. 2010లో గద్దర్ నాయకత్వంలోని ప్రజాఫ్రంట్‌లో చేరాడు. పాల్వంచ ఏరియాకు మకాం మార్చాడు. 2012లో పాలవంచ మండలం రెడ్డిగూడెం గ్రామంలో భూ వివాదంలో తల దూర్చాడు. అక్కడి సర్పంచ్ భర్త, కాంగ్రెస్ నాయకుడైన కళ్లెం వెంకటరెడ్డి భూముల్లో జెండాలు పాతాడు. అతడు (వెంకటరెడ్డి) లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో, అతడిని చంపాలనుకున్నాడు. మావోయిస్టు పార్టీ భద్రు దళంలోకి వెళ్లాడు. ఏడాది తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. 2013లో ఎన్డీ చీలిక తరువాత చంద్రన్న వర్గంలో చేరాడు. ‘మోస్ట్ వాంటెడ్’ ఎందుకయ్యాడంటే! 2017, ఆగస్టు 16వ తేదీ ఉదయం. పాల్వంచ మండలం పాండురంగాపురం సమీపంలోని నర్సంపేట గ్రామం ప్రశాంతంగా ఉంది. ఆ గ్రామ టీడీపీ నాయకుడు, న్యూడెమోక్రసీ(రాయల) మాజీ నాయకుడైన రాయల భాస్కర్ ఇంటికి ఎన్డీ(చంద్రన్న)కి చెందిన 20మంది సాయుధ అజ్ఞాత దళ సభ్యులు వచ్చారు. అందరూ చూస్తుండగానే ఆయనను పట్టుకున్నారు. సమీపంలోగల జామాయిల్ తోటలోకి తీసుకెళ్లారు. చుట్టూ జనం చూస్తుండగా.. తీవ్రంగా కొట్టి చం పారు. ఈ దారుణాన్ని దగ్గరుండి జరిపించింది ఆ దళ నాయకుడు.. మోరే రవి! అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ హత్యను పోలీసులు సవాల్‌గా భావించారు. అప్పటి నుంచి వారికి ఆ మోరే రవి.. మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. తమ దళ నాయకుడు, ‘కీలక’ ఆపరేషన్లలో ముందుండే మోరే రవి.. ఎన్డీ(చంద్రన్న) పార్టీకి సహజంగానే ‘మోస్ట్ వాంటెడ్’ అయ్యాడు. వేట మొదలు ‘చిక్కడు–దొరకడు’ అన్నట్టుగా తప్పించుకుని తిరుగుతున్న మోరే రవి కోసం పోలీసుల వేట మొదలైంది. ఇది, ఎన్డీ(చంద్రన్న) ఇతర అజ్ఞాత దళాలకు కూడా సమస్యగా మారింది. టేకులపల్లి మండలం సంపత్‌నగర్ సిద్ధారం అటవీ ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్న రాము (జిల్లా కార్యదర్శి) దళంపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఆ దళం త్రుటిలో తప్పించుకుంది. ఇది ఏ దళమో పోలీసులకు ముందుగా తెలియదు. మోరే రవి దళమేమోనన్న అనుమానంతో వచ్చారు. 2017, సెప్టెంబర్ 21న ఇది జరిగింది. ఆ పార్టీ లీగల్ నాయకత్వంపై కూడా పోలీసుల ఒత్తిడి పెరిగింది. మోరే రవితోపాటు, తమ పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి అశోక్ కోసం పోలీసులు విస్తృతంగా వేట సాగిస్తున్నారన్న సమాచారంతో ఎన్డీ(చంద్రన్న) నాయకత్వం కలవరపడింది. ‘మోరే రవి కారణంగా పార్టీ మొత్తం నష్టపోయే పరిస్థితి దాపురించింది’ అనే భావన, ఆ పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది. ‘ఆనందం’ ఎందుకంటే... మోరే రవి అరెస్టుతో అటు పోలీసులు, ఇటు ఎన్డీ(చంద్రన్న) నాయకత్వం ఆనందంగా ఎందుకు ఉన్నదో ఈపాటికే మీకు అర్థమయి ఉండాలి. తాము ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న ‘మోస్ట్ వాంటెడ్’ క్రిమినల్ దొరికిపోయాడు కాబట్టి పోలీసులు ‘ఆనందం’గా ఉన్నారు. రవి అరెస్టుతో తమ అజ్ఞాత దళాలకు, పార్టీకి పోలీసుల ‘ఒత్తిళ్లు’ తగ్గినట్టేనన్నది ఎన్డీ (చంద్రన్న) నాయకత్వ భావన. ఇదొక రకమైన ఆనందం. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా పోలీసులకు రవి ’క్షేమంగా’ చిక్కాడన్నది మరో రకమైన ఆనందం. మూడు ముక్కల్లో చెప్పాలంటే.. మోరే రవి క్షేమంగా ఉండాలి, పోలీసులకు దొరికిపోవాలి. వేట ముగియాలి, ఒత్తిళ్లు తగ్గాలి. ఇవన్నీ నెరవేరాయి. కాబట్టి, ఇటు పోలీసులు–అటు ఎన్డీ(చంద్రన్న) పార్టీ హ్యాపీ...!!! -
పరిహారమివ్వండి ఊరొదిలిపోతాం
మణుగూరుటౌన్(భద్రాద్రికొత్తగూడెం) : మణుగూరు ఓసీ నుంచి వచ్చే దుమ్ము, ధూళి తో ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం.. అని రాజుపేట గ్రామస్తులు మంగళవారం గ్రామంలోని రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... లారీల మితిమీరిన వేగంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. లారీలకు కనీసం పట్టాలు కట్టకుండా బొగ్గును రవాణా చేయడం ద్వారా బొగ్గు చూర ఇళ్లల్లోకి చేరుతోందన్నారు. బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు ధ్వంసం అవుతున్నాయని వాపోయారు. తమకు పరిహారం చెల్లిస్తే ఊరు ఖాళీ చేస్తామన్నారు. మణుగూరు ఓసీ రహదారికి బైపాస్ ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యానికి ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, సమస్య పరిష్కారించే వరకు వెళ్లేది లేదని భీష్మించారు. సుమారు నాలుగు గంటల పాటు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మణుగూరు సీఐ మొగిలి, ఎస్సై జితేందర్ సింగరేణి ఎస్వోటు జీఎం ఎం.సురేష్, గని ఏజెంట్ లలిత్‌కుమార్, సెక్యూరిటీ అ«ధికారి నాగేశ్వర్రావు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇళ్ల తొలగింపు విషయం హెడ్ ఆఫీస్ పరిధిలోనిదని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. 11 మందిపై కేసు నమోదు అనుమతులు లేకుండా రోడ్డుపై ఆందోళన చేపట్టారంటూ రాజుపేటకు చెందిన 11 మంది వ్యక్తులపై మణుగూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మణుగూరు ప్రాజెక్టు అధికారి లలిత కుమార్ ఫిర్యాదు మేరకు రాజుపేటకు చెందిన సాంబశివరావు, తార, అక్బర్, పన్నాలాల్, చంద్రశేఖర్, యాణోత్ సతీష్ నాగరాజు, తులసీరాం, భూక్యా వినోద్, బాణోత్ సతీష్, లక్పతి, మంగమ్మలపై కేసు నమోదు చేసినట్లు మణుగూరు సీఐ మొగిలి తెలిపారు. -
అహో... భద్రాద్రి
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రం సరికొత్త రూపుదాల్చబోతోంది. యాదాద్రి తరహాలో భద్రాద్రిని ప్రభుత్వం అభివృద్ధి చేయబోతోంది. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా వెయ్యికాళ్ల మండపాన్ని నిర్మించేందుకు డిజైన్ సిద్ధమైంది. దీని అంతర్భాగంలోనే శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణ వేడుకను జరిపించేలా మండప డిజైన్‌ను కూడా తీర్చిదిద్దారు. ఆలయాభివృద్ధితోపాటు ప్రస్తుతం తుదిరూపు సంతరించుకున్న డిజైన్ మేరకు కట్టడాల నిర్మాణానికి రామాలయ చుట్టు పక్కల 65 ఎకరాల భూమి అవసరం. భద్రాద్రి రామాలయ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్‌సాయి సిద్ధంచేసిన మాస్టర్‌ప్లాన్‌కు చినజీయర్ స్వామి కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. సుందర భద్రాద్రికి సీఎం కేసీఆర్ ఆమోదమే తరువాయిగా, వచ్చే నెలలోనే భద్రాచల క్షేత్ర అభివృద్ధికి పునాదిరాయి పడే అవకాశముందని దేవాదాయశాఖ నుంచి ఇక్కడి అధికారులకు సంకేతాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. వెయ్యికాళ్ల మండపంతో ఖ్యాతి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేనిరీతిలో భద్రాచలంలో వెయ్యికాళ్ల (శిల్పాలతో చెక్కిన వెయ్యి పిల్లర్లు కలిగిన)మండప నిర్మాణానికి ప్రస్తుత డిజైన్‌లో ప్రాధాన్యం కల్పించారు. శ్రీరామనవమిన శ్రీసీతారాముల కల్యాణ వేడుక జరిగే మండపం, దీనికి ఆనుకొని ఉన్న స్థలంలో వెయ్యికాళ్ల మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. దీని అంతర్భాగంలోనే కల్యాణ మండపం కూడా ఉండనుంది. ప్రస్తుత కల్యాణ మండపంలో 35 వేల మంది ఆసీనులై తిలకించే వీలుండగా, సరికొత్త డిజైన్‌తో 80 వేల మంది సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. చూడముచ్చటగా రాములోరి క్షేత్రం.. - భక్తరామదాసు నిర్మించిన గర్భగుడిని యథాతథంగా ఉంచుతారు. - కొత్తగా రెండు ప్రాకారాల్లో ఆలయ నిర్మాణం డిజైన్. - నిత్యకల్యాణ మండపం, స్వామి వారి తిరువీధి సేవ, భక్తులు ఆలయం చుట్టూ తిరిగేలా మార్పు. - ఆలయం నలువైపుల నుంచి స్వామివారి దర్శనం చేసుకునే వీలు - ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శిల్పాలు, వీటి గురించి తెలిపేలా నామకరణం. -
పతాకావిష్కరణ బదులు ఆయన ఏం చేశారంటే..
భద్రాద్రికొత్తగూడెం: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుండగా.. ఓ అటవీశాఖ రేంజర్ మాత్రం మద్యం తాగుతూ కూర్చున్నాడు. ఆ మత్తులో కిందిస్థాయి సిబ్బందిపై చిందులేస్తూ.. ఆవిష్కరణకు సిద్ధం చేసిన జెండాకర్రను ఓ మూలన పెట్టించాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురంలో జరిగింది. అచ్యుతాపురం క్రాస్ రోడ్‌లోని ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్లో రేంజర్‌గా పని చేస్తున్న సదానందాచారి ఉదయం జెండావిష్కరణ సమయంలతో మద్యం మత్తులోనే కార్యాలయానికి వచ్చాడు. స్వాతంత్ర్య వేడుకల కోసం అప్పటికే సిబ్బంది జాతీయ జెండా, మహాత్మాగాంధీ చిత్రపటం, కొబ్బరికాయలు, మిఠాయిలు, బిస్కెట్లు సిద్ధం చేశారు. జెండా ఎగుర వేసే సమయానికే కార్యాలయానికి చేరుకున్న రేంజర్.. తాపీగా సిగరెట్ తాగుతూ జాతీయ జెండా, ఇతర సామగ్రిని లోపల పెట్టాలంటూ సిబ్బందిని ఆదేశించాడు. ‘సార్.. జెండా ఎగరేయాలి కదా.. లోపల పెడితే ఎలా’ అని ప్రశ్నించడంతో ‘ఇప్పుడే వస్తా’నని చెప్పి కారులో అశ్వారావుపేటలోని ఓ బెల్ట్‌షాపులోకి వెళ్లి మద్యం తాగాడు. ఇది గమనించిన స్థానికులు మీడియాకు సమాచారం అందించగా.. రేంజర్ వ్యవహార శైలి వెలుగులోకి వచ్చింది. మీడియా రేంజర్ కార్యాలయానికి వెళ్లి వివరాలు సేకరిస్తుండగా మద్యం తాగి వచ్చిన రేంజర్ కిందిస్థాయి సిబ్బందిపై చిందులేశాడు. ఈ ఘటనపై రేంజర్ సదానందాచారిని ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను మద్యం సేవించిన మాట వాస్తవమేనని, అయితే బీరు మాత్రమే తాగానని చెప్పాడు. పైగా అది ఆల్కహాల్ కాదంటూ సెలవిచ్చాడు. జాతీయ జెండా ఎందుకు ఆవిష్కరించలేదని అడిగితే మర్చిపోయానని.. ఒకసారి, ఎగురవేసిన తర్వాత తీసి కార్యాలయంలో పెట్టించానని మరోసారి పొంతన లేని సమాధానాలు ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. -
ఆ ఎమ్మెల్యేను బెదిరించింది బంధువులే
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యను రెండేళ్లుగా బెదిరింపులకు గురిచేసిన వారిని పోలీసులు పట్టుకున్నారు. నక్సలైట్ల పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్న ముగ్గురిని టేకులపల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు రెండు సార్లు బెదిరింపు లేఖలు, రెండుసార్లు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఎమ్మెల్యే ఫిర్యాదుతో అప్పమత్తమైన పోలీసులు దర్యాప్తు చేప్టటారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యేను బెదిరించిన నిందితులు ఆయన బంధువులు కావడం విశేషం. నిందితులు పూనెం బాలకృష్ణ, పూనెం ప్రకాష్, ఇర్ప కిషోర్‌లు చాలా సార్లు ఎమ్మెల్యేకు ఫోన్ చేసి బెదిరిస్తుండేవారు. తండ్రీకొడుకులైన బాలకృష్ణ, ప్రకాష్‌లు మరో నలుగురితో కలిసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇంకా ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. రూ. లక్ష ఇవ్వాలని ఎమ్మెల్యే కనకయ్యను డిమాండ్ చేస్తూ చంపుతామని హెచ్చరించారని వివరించారు. వీరిని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. -
ఇల్లందు ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖలు
ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు మావోయిస్టుల పేరుతో బెదిరింపులు వస్తుండటం జిల్లాలలో కలకలంగా మారింది. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు రెండు సార్లు బెదిరింపు లేఖలు, రెండుసార్లు బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. ఎమ్మెల్యే కనకయ్యకు భద్రను పెంచారు. ఆయన నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమరాలు ఏర్పాటుచేయడంతో పాటు, రక్షణ కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన కొరం కనకయ్య.. కొద్ది నెలలకే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా, బెదిరింపు వ్యవహారం మావోయిస్టుల పనేనా? లేక నకిలీలదా అనేది తెలియాల్సిఉంది. -
సందడిగా మారిన భద్రాద్రి పర్ణశాల
-
ఎవడబ్బ సొమ్మనీ..!
భద్రాద్రి దేవస్థానం భూములపై బడాబాబులు కన్నేశారా..? ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నం భూములపై ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది పెత్తందారులు పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారా..? పురుషోత్తపట్నం కేంద్రంగా ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే ఇది నిజమేనంటున్నారు. కౌలు భూముల్లో దేవస్థానం నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండానే చేపల చెరువు నిర్మాణం చేపడుతుండటం ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. – నెల్లిపాక భద్రాద్రి దేవస్థానంకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 1347.27 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1032.94 ఎకరాలు ఏపీలోనే ఉంది. సుమారు 1207.29 ఎకరాలు ప్రస్తుతం ఆక్రమణలో ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో భూములను సాగు చేస్తున్న 410 మందిని గుర్తించి, వారి నుంచి ఆలయాధికారులు యూజ్ అండ్ ఆక్యుపేష¯ŒS చార్జెస్ కింద కౌలు వసూలు చేస్తున్నారు. ఇలా ఏడాదికి సుమారు రూ.20 లక్షలు కౌలు రూపేణా ఆలయానికి ఆదాయం రావాల్సి ఉంది. ఇలా సాగు చేస్తున్న వారికి భూములపై ఎటువంటి హక్కులు ఉండవు. ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు చేయాల్సిందే. ఒకటి రెండు చోట్ల మినహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భూములకు భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానం పేరుతోనే సర్వ హక్కులు(పట్టా) ఉన్నాయి. సేద్యం పేరుతో వ్యాపారం ఏళ్ల తరబడి సాగు చేస్తున్న కొంతమంది సేద్యం పేరుతో రాముడి భూములతో వ్యాపారాలు చేస్తున్నారు. పురుషోత్తపట్నంలోని ఓ వ్యక్తి సుమారు అర ఎకరంలో ఏకంగా చేపల చె రువు నిర్మాణం చేపట్టారు. నిబంధనల మేరకు ఈ భూముల్లో పంటలు వేయాల్సి ఉంటుంది. వీటితో ఎటువంటి వ్యాపారా లు చేయకూడదు. కానీ కౌలు చెల్లిస్తున్నామనే కారణంతో చేప ల చెరువు నిర్మాణం చేపట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అంతేగాక చెరువు మట్టిని భద్రాచలం పట్టణానికి తరలించి ఒక్కో ట్రాక్టర్ మట్టి రూ.600లకు విక్రయిస్తూ, పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నప్పటకీ, దేవస్థానం అధికారులు కానీ రెవెన్యూ శాఖ కానీ పట్టించుకోకపోవటంపై అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. భూముల స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకని దేవస్థానం ద్వారా నియమితులైన రక్షణ సిబ్బందికి చేపల చెరువు నిర్మాణం, మట్టి వ్యాపారాలు వారి దృష్టికి రాలేదా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. పురుషోత్తపట్నం కేంద్రంగా అక్రమ వ్యాపారాలు భద్రాచలంనకు ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నం కేం«ద్రంగా కొంతమంది బడాబాబులు అక్రమ వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొల్లుగూడెం రీచ్ నుంచి ఇసుకను రా త్రి వేళ తరలిస్తూ, పురుషోత్తపట్నం సమీపంలోని దేవస్థానం భూముల్లో నిల్వ చేసి, దానిని భద్రాచలం పట్టణానికి తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించకపోతే రాములోరి భూముల్లో అక్రమాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశాం పురుషోత్తంపట్నం ఆలయ భూముల్లో గోతులు తవ్విన కౌలుదారునిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. మట్టి అమ్మకాలు చేపట్టినట్లుగా మా విచారణలో తేలింది. భూమిలో గుంతలు పెట్టినందుకు గాను డామేజ్ చార్జి వసూలు చేస్తాము. అదే విధంగా అతని ఆధీనంలో ఉన్న పది ఎకరాల భూమిని స్వాధీనం చేసుకొని, తిరిగి వేలం నిర్వహిస్తాము. – రమేష్‌బాబు, దేవస్థానం ఈవో -
అగ్నిప్రమాదం: దంపతులకు తీవ్రగాయాలు
భద్రాద్రి కొత్తగూడెం: టీవీ ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనిశెట్టిపల్లిలో శనివారం ఉదయం ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. టీవీ ఆన్ చేసే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న వెంకమ్మ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్తి నష్టం వాటిల్లింది. -
కారు, బైక్ ఢీ: ఇద్దరి మృతి
టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు చనిపోయారు. సీతారాంపురం స్టేజీకి చెందిన బోడ అనిల్, తూర్పుగూడెం గ్రామానికి చెందిన వీరన్న బైక్‌పై వెళ్తుండగా బోరింగ్ తండా వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కారును స్టేషన్‌కు తరలించి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పోస్టర్లు తొలగిస్తుండగా పేలిన బాంబు
భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు వేసిన పోస్టర్లు తొలగించేందుకు వెళ్లిన ఓ మాజీ సర్పంచ్ మందు పాతర పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పోలంపల్లి వద్ద మావోస్టుల పోస్టర్లు వెలిశాయి. వాటిని తొలగించేకు మాజీ సర్పంచ్ ఒకరు వెళ్లారు. ఈ క్రమంలో మందుపాతర పేలి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని దోర్నాపాల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం, నల్లబెల్లి గ్రామాల్లో కూడా మావోయిస్టు వాల్‌పోస్టర్లు కనిపించాయి. వాటిని పోలీసులు తొలగించినట్లు సమాచారం. కానీ పోలీసులు ధ్రువీకరించలేదు. ,