పోస్టర్లు తొలగిస్తుండగా పేలిన బాంబు
Published Sat, Dec 3 2016 12:07 PM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM
భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టులు వేసిన పోస్టర్లు తొలగించేందుకు వెళ్లిన ఓ మాజీ సర్పంచ్ మందు పాతర పేలి తీవ్రంగా గాయపడ్డాడు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పోలంపల్లి వద్ద మావోస్టుల పోస్టర్లు వెలిశాయి. వాటిని తొలగించేకు మాజీ సర్పంచ్ ఒకరు వెళ్లారు. ఈ క్రమంలో మందుపాతర పేలి ఆయన తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని దోర్నాపాల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం, నల్లబెల్లి గ్రామాల్లో కూడా మావోయిస్టు వాల్‌పోస్టర్లు కనిపించాయి. వాటిని పోలీసులు తొలగించినట్లు సమాచారం. కానీ పోలీసులు ధ్రువీకరించలేదు.
,
Advertisement
Advertisement