
సాక్షి, భద్రాద్రి : ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో వేడుకలు వైభవంగా జరుతున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు వీఐపీలకు మాత్రమే ఉత్తర ద్వారా దర్శనానికి అనుమతిచ్చారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కుటుంభ సభ్యులకు మాత్రమే ఉచిత పాస్‌లను మంజూరు చేశారు. సాధారణ భక్తులకు ఉత్తర ద్వారం దర్శనానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 6గంటల 3నిమిషాల వరకు మాత్రమే వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని ఆలయ అధికారులు చెప్పారు. సాధారణ భక్తులను 6:30 నుంచి దర్శనానికి అనుమతిచ్చారు. రద్దీ దృష్ట్యా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు..భక్తులందరూ భౌతిక దూరం పాటించాలని విఙ‍్ఞప్తి చేశారు.
ఇక వైకుంఠ ఏకాదశి వేడుకలు కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వేకవజామున నుంచే వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారం వద్ద స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల కలెక్టర్ జి.రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్తరద్వారం గుండా హరిహరులు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనానికి విచ్చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment