Vaikunta Ekadashi
-
వైకుంఠ ఏకాదశి.. తిరుమలకు పోటెత్తిన భక్తులు (ఫోటోలు)
-
తిరుమలకు పోటెత్తిన భక్తులు..
-
వైకుంఠ ద్వార దర్శనంలో YSRCP నేతలు
-
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై భద్రాద్రిలో భక్తుల రియాక్షన్
-
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
-
రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాష్ట్ర ప్రజలందరికీ శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉండాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.రాష్ట్ర ప్రజలందరికీ శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.— YS Jagan Mohan Reddy (@ysjagan) January 10, 2025 -
పిట్స్ బర్గ్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
వైకుంఠ ద్వాదశి సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం
-
తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభా
-
నేడు వైకుంఠ ఏకాదశి..ఆలయాలకు పోటెత్తిన భక్తులు
-
తిరుమలకు క్యూ కడుతున్న వీఐపీలు, సామాన్య భక్తులు
-
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ
-
శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం… ఉచిత టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తులు (ఫొటోలు)
-
పది రోజుల పటు వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం
-
విశాఖ: భక్తులతో కిటకిటలాడిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం
-
భద్రాచలం రామాలయంలో కన్నులపండుగగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
తూర్పు గోదావరి జిల్లా వైష్ణవ ఆలయాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
జియాగూడ రంగనాథ స్వామి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు
-
వైకుంఠ ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శనాలు
-
తెలుగు రాష్ట్రాల ఆలయాల్లో ముక్కోటి ఏకాదశి శోభ
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల వద్ద క్యూ కడుతున్నారు. ఉత్తర ద్వారా దర్శనం కోసం తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆలయాల ప్రాంగణాలన్ని కిక్కిరిసిపోతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో.. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ద్వారాన్ని సుందరంగా అలంకరణ చేసింది టీటీడీ. గర్భాలయం నుండి మహా ద్వారం వరకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. 12 టన్నుల పుష్పాలతో తిరుమలని వైకుంఠంగా తీర్చిదిద్దారు. అదనంగా.. విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకోగా.. భక్త జనం పోటెత్తుతోంది. ఇక తిరుమల వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్న టిటిడి ఛైర్మన్ వై..వి. సుబ్బారెడ్డి.. మీడియాతో మాట్లాడారు. ‘‘అర్దరాత్రి 1.30 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభించాం. ముందుగా నిర్ణయించిన మేరకే ఉదయం 6 గంటలకు సర్వ దర్శనం ప్రారంభించాం. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే క్యూలైన్లలోకి అనుమతి ఉంటుంది. తిరుపతిలో సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు తీసుకొని తిరుమల రావాలి. ఆన్ లైన్ లో రోజుకు 20 వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు జారీ చేశాం. తిరుపతిలో సమయ నిర్దేశిత సర్వ దర్శన టోకెన్లు నాలుగున్నర లక్షలు జారీ చేస్తున్నాం అని తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో స్వర్ణ రథంలో శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు. యాదాద్రిలో తొలిసారి.. యాదాద్రి చరిత్రలో మొదటిసారిగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తున్నారు. పునర్నిర్మానం తర్వాత తొలిసారిగా ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నార లక్ష్మీనరసింహ స్వామి. ఉదయం 6.48 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కొనసానుంది. ద్వారకా తిరుమలలో.. ఏలూరు జిల్లా చిన్నతిరుపతి ద్వారకా తిరుమల ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్న దర్శించుకుంటున్నారు భక్తులు. గోవింద నామ స్మరణలతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం. వీఐపీలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి ఇరుముడి సమర్పిస్తున్నారు గోవింద స్వాములు. భద్రాచలం రాములోరి చెంత.. భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి ఆలయంలో మంగళ వాయిద్యాలు, వేదఘోష నడుమ తెరుచుకుంది వైకుంఠ ద్వారం. ఉదయం 5.01 గంటల నుంచి 5.11 గంటల వరకు వినతాసుత వాహన కీర్తన నాదస్వరం నిర్వహించారు. ఉదయం 5.11 గంటల నుంచి 5.21 గంటల వరకు ఆరాధన, శ్రీరామ షడ క్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. 5.30 గంటల నుంచి 5.40 గంటల వరకు స్థానాచార్యులచే ద్వార దర్శన ప్రాశస్తం చెప్పబడింది.ఆ తర్వాత 108 ఒత్తులతో హార తినిస్తూ శరణాగతి గద్యవిన్నపం చేశారు. ఉదయం 6 గంటలకు అదిగో కోదండపాణి కీర్తనతో వైకుంఠ ద్వారం నుంచి శ్రీ స్వామి వారి ఉత్థాపన జరిగింది. ఆపై భక్తులకు స్వామి మూలవరుల దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌక ర్యం కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాడపల్లిలో భక్తుల కిటకట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో.. కోనసీమ తిరుమలగా పేరు పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోవింద నామస్మరణతో మారుమోగింది ఆలయ ప్రాంగణం. దర్శనానంతరం ఉచిత ప్రసాద వితరణ స్వీకరించారు భక్తులు. రాజన్నసిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వార భక్తులకు దర్శనం ఇచ్చారు హరి హరులు. స్వామి వార్లను దర్శించుకున్నారు భక్తులు. ఉత్సవ మూర్తులను ఆలయంలోనే పల్లకి సేవ, పెద్ద సేవలపై మూడు సార్లు ప్రదక్షిణలు చేయించి భక్తులకు దర్శనం కల్పించారు. మహా హారతి అనంతరమే కోడె మొక్కులు, ఆర్జిత సేవలు ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా వైఎస్సార్ జిల్లా.. ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై కొలువు దీరాడు జగదభి రాముడు. తెల్లవారు జామున 5 గంటల నుండి సీతానాయకుని దర్శనం కోసం పోటెత్తింది భక్తజనం. గోవింద నామ స్మరణతో మార్మోగుతోంది కోదండ రామాలయం. ఇక.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు తొలి గడప దేవుని కడపలో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీవారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు ఓరుగల్లు ఆలయాలకు.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారం ద్వార ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. బట్టలబజార్ లోని బాలానగర్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు. హన్మకొండ ఎక్సైజ్ కానీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారా ద్వార స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు.గోవింద నామ స్మరణతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం. -
సింహాచలంలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం
-
వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ భారీ ఏర్పాట్లు
-
వైకుంఠ ఏకాదశి సందర్బంగా టీటీడీ భారీ ఏర్పాట్లు
-
వైభవంగా వైకుంఠ ఏకాదశి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
-
సీఎం వైఎస్ జగన్ కు స్వామివారి ఆశీస్సులు ఉండేలా చూడాలని కోరుకున్నా: తమ్మినేని సీతారాం
-
ఏపీ వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుడివాడ అమర్నాత్ కుటుంబం
-
విజయవాడలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
-
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
-
10 రోజుల పాటు వేంకటేశుడి వైకుంఠ ద్వార దర్శనం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఈ నెల 13 నుంచి 22 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా గతేడాది మాదిరిగానే 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం అందించాలని నిర్ణయించింది. సామాన్యులకు ఎక్కువ సంఖ్యలో దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వీఐపీల సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేసింది. చైర్మన్ కార్యాలయంలో కూడా ఈ పది రోజులూ సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే ప్రముఖులకే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు మంజూరు చేస్తారు. ఆ రోజుల్లో గదుల అడ్వాన్స్ రిజర్వేషన్ రద్దు ► జనవరి 11–14వ తేదీ వరకు తిరుమలలో వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను రద్దు చేసి, వాటిని కరెంట్ బుకింగ్‌లో భక్తులకు కేటాయించనుంది. ► ఈ తేదీలలో ఎంబీసీ–34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ, ఏఆర్పీ కౌంటర్లలో గదులు కేటాయించబడవు. ► జనవరి 11–14 వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్‌ను రద్దు చేశారు. ► సామాన్య భక్తులకు తిరుమలలో 6 ప్రాంతాల్లో ఉన్న రిజిస్ట్రేషన్ కౌంటర్ల ద్వారా గదులను కేటాయిస్తారు. -
భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి
సాక్షి, భద్రాద్రి : ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో వేడుకలు వైభవంగా జరుతున్నాయి. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు వీఐపీలకు మాత్రమే ఉత్తర ద్వారా దర్శనానికి అనుమతిచ్చారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల కుటుంభ సభ్యులకు మాత్రమే ఉచిత పాస్‌లను మంజూరు చేశారు. సాధారణ భక్తులకు ఉత్తర ద్వారం దర్శనానికి అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 6గంటల 3నిమిషాల వరకు మాత్రమే వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని ఆలయ అధికారులు చెప్పారు. సాధారణ భక్తులను 6:30 నుంచి దర్శనానికి అనుమతిచ్చారు. రద్దీ దృష్ట్యా ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు..భక్తులందరూ భౌతిక దూరం పాటించాలని విఙ్ఞప్తి చేశారు. ఇక వైకుంఠ ఏకాదశి వేడుకలు కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరుగుతున్నాయి. భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. వేకవజామున నుంచే వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉత్తర ద్వారం వద్ద స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురిలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల కలెక్టర్ జి.రవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్తరద్వారం గుండా హరిహరులు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనానికి విచ్చేస్తున్నారు. -
ముక్కోటి ఏకాదశి: తిరుమలలో ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం అభిషేకం అనంతరం ఆలయ ఆర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. ఉదయం నాలుగు గంటలకు దర్శనం ప్రారంభం అవ్వగా.. సామాన్య భక్తులు, వీఐపీలు దర్శనాల కోసం క్యూకట్టారు. శుక్రవారం కావడంతో అభిషేకం అనంతరం దర్శనాలు మొదలయ్యాయి. దీంతో తిరుమల క్షేత్రం వైకుంఠాన్ని తలపిస్తోంది. కాగా వైకుంఠ ఏకాదశి పర్వ దినాన పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకుని వైకుంఠ ద్వార ప్రవేశం చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందు మల్హోత్రా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాద్ రావు దర్శించుకున్నారు. అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు వేమారెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిధున్ రెడ్డి, ఎంపీ గోరంట్ల మాదవ్, మోపిదేవి వెంకటరమణ, ఆంధ్రప్రదేశ్ నూతన సీఎస్ ఆదిత్యనాధ్, జస్టిన్ సీవీ నాగార్జున్ రెడ్డి, ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, తెంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, హైకోర్టు న్యాయమూర్తి వెంకటరమణ, జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ హైకోర్టు జస్టిస్ అమర్ నాథ్ గౌడ్, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, తెలంగాణ కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్, సర్కార్ వారి పాట చిత్రం డైరెక్టర్ పరుశురామ్, తదితరులు శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. సునీల్ దియోధర్ మాట్లాడుతూ... వైకుంఠ ఏకాదశికి టీటీడీ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిందన్నారు. దేవాలయాల నిర్వహణలో టీటీడీ దేశంలోని అన్నీ ఆలయాలకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూ అద్భుతమైన దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వీఐపీలు క్రమ శిక్షణతో శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. అనుకున్న సమయం కంటే ముందుగానే సర్వ దర్శనం ప్రారంభిస్తున్నామన్నారు. భక్తులందరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు ఈ సందర్భంగా ఆలయ అదనపు ఈవో మాట్లాడుతూ.. సాధారణ భక్తులకు గంటన్నర ముందే వైకుంఠద్వార దర్శనం కల్పించినట్లు తెలిపారు. ఉ. 9 గంటలకు అనుకున్నామని కానీ 7.30 గంటలకే ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. పరిస్థితిని అంచనా వేసి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏర్పట్లు చేసినట్లు, సర్వదర్శనం టిక్కెట్ల పెంచినట్లు పేర్కొన్నారు. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించగలుగుతున్నామన్నారు. ప్రముఖులు సహకరించడంతో సాధారణ భక్తులకు ఎక్కువ సమయం లభించిందన్నారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా రెండు వేలు, దాతలకు రెండు వేలు, వీఐపీలకు మూడు వేల మందికి టికెట్లు కేటాయించామన్నారు. -
‘టిక్కెట్లు లేని భక్తులు కొండకు రావొద్దు’
సాక్షి, తిరుమల : డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, భక్తులు భౌతిక దూరం వంటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ముందస్తుగా ఆన్లైన్ ద్వారా ఇరవై వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు ఆఫ్‌లైన్‌లో రేపటి నుంచి స్థానిక భక్తుల కోసం పది వేల టిక్కెట్లు విడుదల చేశామన్నారు. టిక్కెట్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని టీటీడీ ఈవో సూచించారు. చదవండి: వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నామన్నారు. డిసెంబరు 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకూ రోజుకు ముప్పై వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వీఐపీలు ఉదయం 4 గంటల నుంచి వీఐపీ భక్తులకు, 8 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభిస్తామని తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. పది రోజుల పాటు టిక్కెట్లు లేని భక్తులు కొండకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇందుకు టీటీడీ భక్తులు సహకరించాలని కోరుతున్నట్లు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. -
నేడు తిరుమలలో వైకుంఠ ఏకాదశి
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 6న తెల్లవారుజామున 12.30 నుంచి 2 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. అనంతరం సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా సోమవారం ఉదయం 5 గంటల నుంచి ధర్మదర్శనం ప్రారంభమవుతుంది. ఉదయం 9 నుంచి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు స్వర్ణరథంపై నాలుగుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ కన్నులపండుగగా జరుగనుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో కలిసి తిరుచ్చిపై నాలుగుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.30 నుంచి 9.30 వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు చేపడతారు. 7న చక్రస్నానం జనవరి 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి ఘనంగా జరుగనుంది. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత గల స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల నేపథ్యంలో 5 నుంచి 7 వరకు ఆర్జితసేవలను టీటీడీ రద్దు చేసింది. కిక్కిరిసిన తిరుమల.. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ నిండిపోయాయి. వారికి నిరంతరం అల్పాహారం, అన్నప్రసాదం, టీ, కాఫీలు పంపిణీ చేస్తున్నారు. 172 ప్రాంతాల్లో 3 లక్షల వాటర్ బాటిళ్లు పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. వైకుంఠ ద్వార దర్శనం రోజుల్లో ఎలాంటి మార్పూ లేదు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విషయంలో ఎలాంటి మార్పూ లేదని, అమల్లో ఉన్న సంప్రదాయాన్నే కొనసాగిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆదివారం మండలి అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం వైవీ మీడియాతో మాట్లాడుతూ తిరుపతికి చెందిన తాళ్లపాక రాఘవన్ వైకుంఠ ద్వారాన్ని ఎన్ని రోజులు తెరుస్తారనే విషయమై హైకోర్టులో పిల్ వేశారని, దీనికి సంబంధించి జనవరి 6లోపు నిర్ణయం తెలియజేయాల్సిందిగా హైకోర్టు టీటీడీని కోరిందని తెలిపారు. విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరవాలనే అంశంపై అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి కన్వీనర్‌గా కమిటీ ఏర్పాటు చేశామని, మఠాధిపతులు, పీఠాధితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. జనవరి 20 నుంచి శ్రీవారిని దర్శించుకునే భక్తులందరికీ ఉచిత లడ్డూ అందిస్తామన్నారు. సమావేశంలో టీటీడీ ఈవో సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, తిరుపతి జేఈవో పి.బసంత్‌కుమార్, ప్రత్యేక ఆహ్వానితులు భూమన కరుణాకరరెడ్డి, శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
రెండురోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం
-
రెండురోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయని తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనానికి ఈ ఏడాది రెండురోజులపాటు అనుమతి ఇస్తామని, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. అందరికీ ఉచిత లడ్డు ప్రతిపాదనపై పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, జనవరి 20 నుంచి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డు ఇవ్వనున్నట్టు తెలిపారు. టీటీడీ పాలకమండలి భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం ఎన్ని రోజులు పెట్టాలనే అంశంపై టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఉత్తర ద్వారా దర్శనం ఎన్ని రోజులు పెట్టాలనే అంశంపై అత్యవసర సమావేశం పెట్టామని ఆయన తెలిపారు. ఉత్తర ద్వారాలు పది రోజులు తెరవడంపై కమిటీ నియమించామని, కమిటీ నివేదిక ఆధారంగా వచ్చే ఏడాది దీనిని అమలు చెయ్యాలా? లేదా? అన్నది నిర్ణయిస్తామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు తిరుమల కొండపైకి చేరుకున్నారని, భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలుకుండా ఏర్పాట్లు చేశామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం తెల్లవారుజామునుంచే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని తెలిపారు. -
వైకుంఠ ఏకాదశికి తిరుమలలో భారీ ఏర్పాట్లు
-
శ్రీవారి సేవలో కేసీఆర్ కుటుంబం
సాక్షి, తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు, హరీష్‌రావు దంపతులు ,కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ దర్శించుకున్నారు. కాగా, భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు నిండిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. గరుడ వాహనంపై పశ్చిమగోదావరి : జిల్లాలోని ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభం అయ్యాయి. గరుడ వాహనంపై చినవెంకన్న ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మహా విష్ణువు అవతారంలోని స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. -
వైకుంఠ ఏకాదశి రోజు ఉ: 5.30 నుంచి శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఈనెల 29న ఉదయం 5.30 నుంచి శ్రీవారి దర్శనం, వైకుంఠ ద్వార ప్రవేశం కల్పిస్తామని టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు వెల్లడించారు. ఏకాదశి ఏర్పాట్లను మంగళవారం ఆయన మీడియాకు వెల్లడించారు. 29న వైకుంఠ ఏకాదశి, 30న ద్వాదశి, నూతన ఆంగ్ల సంవత్సరాది కారణంగా ఈ నెల 28 నుంచి జనవరి 1 వరకు 5 రోజులపాటు అన్ని రకాల ఆర్జితసేవలు, కాలిబాట దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామన్నారు. వాటితోపాటు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, విరాళాలిచ్చిన దాతలకు ప్రత్యేక దర్శనాలు ఉండవన్నారు. ఏకాదశి రోజు ఉదయం 12.01 గంటలకు వైకుంఠ ద్వారం తెరిచి, నిత్య, ధను ర్మాస పూజలు నిర్వహిస్తామన్నారు. రాజ్యాంగపరమైన హోదాలో ఉన్నవారికి, ఇతర ప్రముఖులకు దర్శనం, వసతి ఏర్పాట్ల విషయమై ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నామని జేఈవో వెల్లడించారు. -
మోక్షానికి మార్గం.. వైకుంఠ ద్వారం..!
-
తిరుమలలో ఏకాదశికి భారీ ఏర్పాట్లు
సాక్షి,తిరుమల : వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాల కోసం తరలివచ్చే భక్తులకోసం తిరుమలలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే చలి కోసం అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక షెడ్లు నిర్మించారు. ఇవి సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఆదివారం కురిసిన భారీ మంచు, ముసురువాన వల్ల భక్తులకు రక్షణగా నిలిచాయి. తాత్కాలిక మరుగుడొడ్లు నిర్మించారు. అదనంగా క్యూలు నిర్మించారు. ఏకాదశికి ఆకర్షణగా ఆలయం వద్ద పందిరి నిర్మిస్తున్నారు. వీఐపీల కోసం ఇప్పటికే నాలుగు క్యూలు నిర్మించారు. బ్యారికేడ్లు నిర్మించారు. అలాగే, ఆలయం వద్ద ఈసారి కొత్తగా శేషతల్పంపై పవళించే శ్రీరంగనాథుని ప్రతిమను రూపొందించనున్నారు. 8 టన్నుల పుష్పాలు, 5 టన్నుల పండ్లతో అలంకరణ వైకుంఠఏకాదశి కోసం టీటీడీ ఉద్యావన వన విభాగం ఎనిమిది టన్నులు పుష్పాలు, ఐదు టన్నుల పండ్లతో ఆలయాన్ని అందంగా అలంకరించనున్నారు. ఆలయ మహద్వారం, బలిపీఠం, ధ్వజస్థంభం , వెండివాకిలి, ఇతర అనుబంధ ఆలయాలు, వైకుంఠద్వారం (ఉత్తరద్వారం) వరకు వివిధ రకాల సంప్రదాయ, బ్యాంకాక్‌నుంచి తెప్పించిన కట్‌పుష్పాలతో అలంకరించనున్నారు. వీటితోపాటు గ్రీన్‌యాపిల్, బెర్రీ, చెర్రీ, ఇతరరత్రా పండ్లతో ఆకట్టుకునే విధంగా అలంకరణచేయనున్నట్టు టీటీడీ గార్డెన్ విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన సాక్షి, తిరుమల: నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ, వైకుంఠ ఏకాదశి, రెండో తేది ద్వాదశి రోజుల్లో రెండు వేల మంది పోలీసు, భద్రతా బలగాలను భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. భద్రతా ఏర్పాట్లపై ఆదివారం అధికారులు సమీక్షించారు. టీటీడీ ఇన్చార్జి సీవీఎస్వో జి.శ్రీనివాస్, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి, ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని క్యూ లైన్లను పరిశీలించారు. ఎంబీసీ నుంచి నారాయణగిరి, వైకుంఠం క్యూకాంప్లెక్స్ వరకు విస్తరించిన క్యూ లైన్లను పరిశీలించారు. క్యూలైన్ల నిర్వహణలో అవసరమైన చర్యలను మ్యాపుల ద్వారా గుర్తించారు. అదే క్యూలైన్లలో ఆలయానికి చేరుకున్నారు. అన్ని పార్కింగ్ కేంద్రాలను పరిశీలించారు. భక్తుల రక్షణ కోసం సుమారు రెండు వేల మంది సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నామని టీటీడీ ఇన్చార్జి సీవీఎస్వో జి.శ్రీనివాస్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి పేర్కొన్నారు. ప్రధానంగా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్, భద్రకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ట్లు చెప్పారు. అలిపిరి నుంచి ఆలయం వరకు భద్రత వ్యవస్థను పటిష్టం చేస్తామని తెలిపారు. -
వైభవంగా రాపత్తు సేవ
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్ : వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామికి ఆదివారం రాపత్తు సేవను వైభవంగా నిర్వహించారు. అంబసత్రంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి రోజు నుంచి స్వామి వారికి వివిధ ప్రభుత్వ కార్యాల యాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యం లో రాపత్తు సేవలు నిర్వహించటం ఆనవాయితీ గా వస్తోంది. ఇందులో భాగంగా రాపత్తు సేవల లో రెండోరోజున స్వామివారిని ప్రత్యేకంగా అలం కరించి సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. దారిపొడువునా భక్తులు పూజలు నిర్వహించి మొ క్కులు తీర్చుకున్నారు. అంబ సత్రం చేరుకున్న స్వామి వారికి ఆలయ అర్చకులు విశ్వక్షేణ పూజ, పుణ్యవచనంలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జ గన్నాధాచార్యులు, వేదపండితులు గుదిమెళ్ల ము రళీకృష్ణమాచార్యులు, సన్యాసిశర్మ, లింగాల రామ కృష్ణప్రసాద అవధాని, ఆలయఅర్చకులు, సిబ్బం ది, వేదపాఠశాల విద్యార్ధులు, భక్తులు పాల్గొన్నారు. పునఃప్రారంభమైన నిత్యకల్యాణాలు: శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో ఆదివారం నుంచి స్వామి వారి నిత్యకల్యాణాలు పునఃప్రారంభమయ్యాయి. పగల్‌పత్తు ఉత్సవాల సందర్భంగా రద్దు చేసినవీటిని యథావిధిగా ఆదివారం ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతరాలయంలో జరిగిన అభిషేకం, సువర్ణపుష్పపూజలలో కూడా భక్తులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్రాంతి సెలవులు కావడంతో ఆదివారం రామాలయంలో తీవ్ర రద్దీ ఎక్కువగా ఉంది. ఖమ్మం మాజీ కలెక్టర్, ప్రస్తుత పశ్చిమగోదావరి కలెక్టర్ సిద్దార్ధజైన్, ఐటీడీఏ పీవో వీరపాండియన్లు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.