సాక్షి, తిరుమల : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. వైష్ణవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. తిరుమల శ్రీవారిని గవర్నర్ నరసింహన్ దంపతులు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులు, హరీష్‌రావు దంపతులు ,కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ దర్శించుకున్నారు. కాగా, భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నారాయణగిరి ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లు నిండిపోయాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
గరుడ వాహనంపై
పశ్చిమగోదావరి : జిల్లాలోని ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు తెల్లవారుజామున 5 గంటలకు ప్రారంభం అయ్యాయి. గరుడ వాహనంపై చినవెంకన్న ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మహా విష్ణువు అవతారంలోని స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment