
తెలంగాణ గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్‌ను కేంద్రం నియమించిన నేపథ్యంలో నరసింహన్ సొంత రాష్ట్రం తమిళనాడుకు బయలుదేరారు.
సాక్షి, హైదరాబాద్ : బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ దంపతులు శనివారం సాయంత్రం చెన్నై బయలు దేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రభుత్వాధికారులు వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. అంతకుముందు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్‌ను కేంద్రం నియమించిన నేపథ్యంలో నరసింహన్ సొంత రాష్ట్రం తమిళనాడుకు వెళ్తున్నారు. ఇక తెలంగాణ గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్‌లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.